For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాయ్ ఫ్రెండ్ ఇలా ఉంటే అమ్మాయిలకు అస్సలు నచ్చదట..!

|

అమ్మాయిల మనసులో ఏముందో తెలుసుకోవడం కన్నా.. సముద్రం లోతు తెలుసుకోవడం చాలా ఈజీ అన్నది ఓ ఫిలాసఫీ. పైకి ఒకలా కనిపించే ఆడవాళ్లు.. లోలోపల మరోలా ఉంటారన్నది జగమెరిగిన సత్యం.. అందుకే.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. ఇవన్నీ పక్కన పెడితే చిన్న చిట్కాలు పాటిస్తే.. అమ్మాయిల మనసులో చోటు సంపాదించడం అంత కష్టమేమీ కాదంటారు లవ్‌ ఎక్స్‌పర్ట్స్‌.

మీకు ఎలాంటి బాయ్‌ఫ్రెండ్‌ అంటే ఇష్టం? ఈ ప్రశ్నను దేశంలోని మెట్రో నగరాల్లోని నవతరం అమ్మాయిలను అడిగినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎక్కువ మంది తమకు హాట్‌గా కనిపించే అబ్బాయిలే నచ్చుతారని తెలియజేశారు. ఇలా సిటీ గాళ్స్‌ వారికి ఎలాంటి లక్షణాలున్న బాయ్‌ఫ్రెండ్స్‌ నచ్చుతారో, ఎలాంటి క్వాలిటీస్‌ను ఇష్టపడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

బాయ్ ఫ్రెండ్స్ లో విషయంలోని గర్ల్ ఫ్రెండ్స్ తరచూ ఫిర్యాదు చేసే విషయాల గురించి ఈ వ్యాసం లో వివరించబడినది. బాయ్ ఫ్రెండ్స్ కున్న ఆ అలవాట్ల గురించి తెలుసుకోవాలంటే చదవండి మరి

తన కుటుంబాన్ని కలవకుండా బాయ్ ఫ్రెండ్ పోస్ట్ పోనే చేస్తూ ఉంటే

తన కుటుంబాన్ని కలవకుండా బాయ్ ఫ్రెండ్ పోస్ట్ పోనే చేస్తూ ఉంటే

గర్ల్ ఫ్రెండ్ కుటుంబాన్ని కలవకుండా ఉండేందుకు ఏదైనా కారణం చూపిస్తూ ఆలస్యం చెయ్యడాన్ని గర్ల్ ఫ్రెండ్స్ ఇష్టపడరు. వారి కుటుంబాన్ని కలిస్తే తమ రిలేషన్ షిప్ కి మౌనంగా అంగీకారం తెలిపినట్లు అని అబ్బాయిలు భావిస్తారు. అమ్మాయిలు తము ఎంతగానో ఇష్టపడే కుటుంబాన్ని తన బాయ్ ఫ్రెండ్ కి చూపించడంలో ఎంత ఆసక్తికనబరుస్తారో అబ్బాయిలు అర్ధం చేసుకోలేరు.

స్నేహితులతో మందు కొట్టడం

స్నేహితులతో మందు కొట్టడం

స్నేహితులతో పీకల్లోతు మందు పార్టీలో నిమగ్నమయిపోయి కనీసం గర్ల్ ఫ్రెండ్ పక్కనుంది అన్న విషయం పట్టించుకోని అబ్బాయిలంటే అమ్మాయిలకు కొంత చిరాకు. ఇంట్లో తాగడం ఒక వైపైతే, నలుగురి మధ్యలో తాగి తమ బాయ్ ఫ్రెండ్ అభాసు పాలవడం అమ్మాయిలకు నచ్చదు.

రహస్యంగా అశ్లీల శృంగారాలను చూడడం

రహస్యంగా అశ్లీల శృంగారాలను చూడడం

అశ్లీల శృంగారాన్ని వీక్షిస్తున్న తన బాయ్ ఫ్రెండ్ ని గమనించిన అమ్మాయికి అతనంటే చిరాకు ఏర్పడుతుంది. వారు తమకి తగిన వారు అవునా కాదా అనే సందేహంలో పడతారు. అమ్మాయిలకు అభద్రతాభావం కలిగించే ఇటువంటి పనులకు అబ్బాయిలు దూరంగా ఉంటే మంచిది.

గదులని శుభ్రంగా ఉంచుకోకపోవటం

గదులని శుభ్రంగా ఉంచుకోకపోవటం

తమ గదులను శుభ్రంగా ఉంచుకోకపోవటం మగవాడి ముఖ్య లక్షణం. టవల్స్ ని మంచం పై పడేయటం, చిందర వందరగా ఉన్న అలమారాలు, లోదుస్తులను మర్చుకోకపోవటం అమ్మాయిలను విసిగించే అంశాలు. గందరగోళంగా ఉన్న బాయ్ ఫ్రెండ్ గదులు అమ్మాయిలకు చిరాకు కలిగించే విషయాలలో ముఖ్యమైనది.

 ఫోన్ లో మాట్లాడేటప్పుడు కంప్యూటర్ గేమ్స్ ఆడడం

ఫోన్ లో మాట్లాడేటప్పుడు కంప్యూటర్ గేమ్స్ ఆడడం

మీ బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు తన శ్రద్ద వేరే వాటిపై పడుతోందని గమనించారా. ఎందుకంటే అప్పుడు అతను వీడియో గేమ్స్ ఆడుతూ ఫోన్ లో మాట్లాడతాడు కాబట్టి. అమ్మాయిలు మాట్లాడేటప్పుడు బాయ్ ఫ్రెండ్ శ్రద్దగా వినాలని కోరుకుంటారు.

అమ్మాయిలకు తిరిగి ఫోన్ చెయ్యడం

అమ్మాయిలకు తిరిగి ఫోన్ చెయ్యడం

అబ్బాయిలలో అమ్మాయిలకు నచ్చని అతి ముఖ్యమైన అలవాటు తమ ఫోన్స్ కి సరైన స్పందన లేకపోవడం. అబ్బాయిలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.

బడ్జెట్ విషయంలో

బడ్జెట్ విషయంలో

అమ్మాయిలతో అబ్బాయిలు తాము ఈ సారి బడ్జెట్ లో చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పి ఆ మరునాడే ఖరీదైన ఐపాడ్ తన కోసం తెచ్చుకుంటే అమ్మాయిలకు చిరాకు కలుగుతుంది. వాళ్ళ కంటే ప్రయారిటీ ఆ గాడ్జెట్ కే ఇస్తున్నారని కోపం తెచ్చుకుంటారు.

 షాపింగ్ కి వేల్లినప్పుడు సహనంగా ఉండకపోవడం

షాపింగ్ కి వేల్లినప్పుడు సహనంగా ఉండకపోవడం

అబ్బాయిలతో కంటే అమ్మాయిలతో నే అమ్మాయిలు షాపింగ్ కి వెళ్ళడానికి ఒక కారణముంది. అబ్బాయిలు ట్రయల్ రూం అవతల చాలా సేపటి వరకు ఎదురు చూడడాన్ని విసుక్కుంటారు. అమ్మాయిలకు డ్రెస్ సూట్ అయిందా లేదా ఏ డ్రెస్ సూట్ అవుతుంది అని చెప్పడాన్ని ఇష్టపడరు. ఈ అలవాటు అమ్మాయిలకు నచ్చదు.

పార్టీకి తగినట్టుగా డ్రెస్ చేసుకోకపోవడం

పార్టీకి తగినట్టుగా డ్రెస్ చేసుకోకపోవడం

ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు అమ్మాయిలు ఎంతో కష్టపడి తయారయి వస్తే అబ్బాయిలు మాత్రం అలా ఏదో ఒక కాజువల్ వేర్ వేసుకుని వస్తారు. ఇటువంటి అలవాట్లను అమ్మాయిలు ఇష్టపడరు. కొంచెం సమయం తీసుకుని తమతో పాటు తమ బాయ్ ఫ్రెండ్ కూడా అందంగా తయారయి వస్తేనే అమ్మాయిలకు ఇష్టం.

 పెద్ద కొట్లాట తరువాత కూడా శారీరక సంబంధం కోరటం

పెద్ద కొట్లాట తరువాత కూడా శారీరక సంబంధం కోరటం

అమ్మాయిలకి శారీరక సంబంధం ఎమోషన్ తో కూడుకున్నది. అబ్బాయిలు మాత్రం పెద్ద గోడవైనా అవి పక్కన పెట్టేసి శారీరక సంబంధం కోరతారు. ఈ విషయం అమ్మాయిలను బాగా ఇబ్బంది పెట్టే అంశం.

English summary

10 Habits of Boyfriends All Girls Hate | బాయ్ ఫ్రెండ్ ఇలా ఉంటే అమ్మాయిలకు అస్సలు నచ్చదట..!

Girlfriends are found complaining about one of the following habits of their boyfriends which they hate. Find out the worst habits of boyfriends around the world.
Story first published: Tuesday, May 7, 2013, 18:09 [IST]
Desktop Bottom Promotion