Latest Updates
-
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.!
బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడకూడని పది విషయాలు..!
అమ్మాయిల మనసులో ఏముందో తెలుసుకోవడం కన్నా.. సముద్రం లోతు తెలుసుకోవడం చాలా ఈజీ అన్నది ఓ ఫిలాసఫీ. పైకి ఒకలా కనిపించే ఆడవాళ్లు.. లోలోపల మరోలా ఉంటారన్నది జగమెరిగిన సత్యం.. అందుకే.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. ఇవన్నీ పక్కన పెడితే చిన్న చిట్కాలు పాటిస్తే.. అమ్మాయిల మనసులో చోటు సంపాదించడం అంత కష్టమేమీ కాదంటారు లవ్ ఎక్స్‌పర్ట్స్.
మీకు ఎలాంటి బాయ్‌ఫ్రెండ్ అంటే ఇష్టం? ఈ ప్రశ్నను దేశంలోని మెట్రో నగరాల్లోని నవతరం అమ్మాయిలను అడిగినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎక్కువ మంది తమకు హాట్‌గా కనిపించే అబ్బాయిలే నచ్చుతారని తెలియజేశారు. ఇలా సిటీ గాళ్స్ వారికి ఎలాంటి లక్షణాలున్న బాయ్‌ఫ్రెండ్స్ నచ్చుతారో, ఎలాంటి క్వాలిటీస్‌ను ఇష్టపడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...
నమ్మకం మరియు వ్యక్తీకరణ అనేది ప్రేమనుబంధాలకి మూలం. కానీ కొన్ని విషయాలు మాత్రం మీ ప్రియుడితో పంచుకోకూడదు. మీకు ఏ విషయాలు మాట్లాడవచ్చో , మాట్లాడ కూడదో ఇంకా వివరం గా తెలియాలంటే ఈ కింద విషయాలు చదవండి ...

అతని స్నేహితుని పరిచయం కోరకూడదు : మీ బాయ్ ఫ్రెండ్ ని తన స్నేహితుని గురించి మీరు ఎక్కువ ఆసక్తి కనబరచటం బాధించవచ్చు. మీ బాంధవ్యం సంతోషంగా సాగిపోవాలంటే ఎప్పుడూ అటువంటి ప్రశ్నలు వేయకండి . మీరు అడగక్కరలేదు, అతనికి మీతో తన స్నేహితులని పరిచయం చెయ్యాలనిపిస్తే అతనే చేస్తాడు.

మీరు అతనితో కంటే గొప్ప వ్యక్తులతో డేట్ కి వెళ్లానని చెప్పకూడదు: ఏ మగవాడు ఇటువంటి మాటలు తన గర్ల్ ఫ్రెండ్ నుండి వినాలనుకోడు, ఇటువంటి విషయాలని మీ లోనే ఉంచుకోండి , అతనితో ఎప్పటికి చెప్పకండి. ఇటువంటి మాటలు అతని అభిమానాన్ని , ఇగో ని ఖచ్చితంగా దెబ్బతీస్తాయి.

పరిణతి లేదని నిందించకండి: మీ బాయ్ ఫ్రెండ్ కు పరిణతి లేకపోయినా అతని ముఖం మీద అది చెప్పెయకండి. మీరు అతనికంటే పరిణతి కలవారయిన తన గర్ల్ ఫ్రెండ్ నుంచి ఈ మగాడు ఆ మాట వినటానికి ఇష్టపడడు. పరోక్షం గా అతనికి అర్ధం అయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నించండి .

జీవితంలో ఓడిపోయావు అనకూడదు: ఎవ్వరు ఇలాంటి మాటలని వినాలనుకుంటారు? మగవాళ్ళు ఈ విషయంలో మరీ సున్నితంగా ఉంటారు. ఇటువంటివి ముఖ్యంగా తన గర్ల్ ఫ్రెండ్ నుండి అసలు వినకుడదని అనుకుంటారు. ఎప్పుడు హాస్యానికి కూడా ఓడిపోయావ్ అని అనకండి, ఎందుకు జీవితంలో విజయం సాధించలేదు అని కూడా అడక్కండి.

చెడ్డ పదాలు వాడకండి : మీ బాయ్ ఫ్రెండ్ కు మీరు విలువ ఇస్తే చెడ్డ పదాలు వాడటం మానుకోండి . మగవారు ఇటువంటివి వినటానికి ఇష్టపడరు.

అతని రూపం పై విమర్శలు చేయకండి : అతనిని మీరు మీ ప్రియునిగా ఎనుక్కున్నాక , బాంధవ్యం మొదలు పెట్టాక అతని రూపం గురించి విమర్శించటంలో అర్ధం లేదు, అంతే కాక మగవారు వారి శరీరక రూపం గురించి విమర్శలను అస్సలు ఇష్టపడరు.

అతని పూర్వపు ప్రేమ బాంధవ్యాల గురించి అడగకండి: మీరు అతనితో సంతోషంగా ఉంటే ఈ విషయంలో అతనిని ప్రశ్నలు అడగకండి, దానివల్ల అతనికి మీ పై కోపం కలగవచ్చు .

వివరాలు అడగకండి : అతను బయటకి వెళ్లి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్లావు ఏంటి అనే వివరాలు ఆరా తియ్యకండి. అతనిని మీరు నిజంగా ప్రేమిస్తే అతనికి ఆ వెసులుబాటు కలిగించండి .

ప్రాముఖ్యత ఇవ్వకపోవటం చెయ్యకండి: అతని పట్ల మీ ప్రాముఖ్యతని , సహకారాన్ని మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా చూపించండి. మీ బంధానికి ఇది చాలా ముఖ్యం.

ప్రతిసారి నన్ను ప్రేమిస్తున్నావా అని అడగకూడదు: అతను ఈ ప్రేమ బంధాన్ని మీ పైన ప్రేమ ఉంటేనే కొనసాగిస్తాడు, కాబట్టి ఈ ప్రశ్న పదే పదే అడగటంలో అర్ధం లేదు.



Click it and Unblock the Notifications