For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ వైఫ్స్ కు చీకాకు పెట్టే భర్త యొక్క అలవాట్లు

By Super
|

భారతీయ భర్తలను గమనించినట్లయితే వారి జీవితభాగస్వాములపట్ల చాలా నిందార్హులుగా వ్యవహిస్తారని తెలుస్తున్నది. వారి చిన్నచిన్న అలవాట్లే భార్యల కోపానికి మరియు నిరాశకు కారణమయి "మీరు యెంత మంచివారో" అన్న అనుభూతి నుండి "ఏమి మనిషి! ఇటువంటి మనిషినా నేను వివాహం చేసుకున్నాను!" అనే అనుభూతికి గురి చేస్తున్నాయి.

మీ భర్త సాధారణ భారతీయ పతిదేవుడు అయి ఉండనట్లయితే మీరు చాలా అదృష్టవంతులు, కాని అతను ఈ క్రింద ఇచ్చిన అలవాట్లు కలిగి ఉంటే, మీరు చాలా మంది భారతీయ భార్యల లాగానే మండిపడతారు.

బెడ్ మీదనే అన్ని రకాల తినుబండారాలు తినడం మరియు అదే బెడ్ లోనే నిద్ర పోవటం

బెడ్ మీదనే అన్ని రకాల తినుబండారాలు తినడం మరియు అదే బెడ్ లోనే నిద్ర పోవటం

వారికి ఇంట్లో వండిన వంటకాలు ఎప్పుడు ఇష్టం ఉండదు, కానీ వారికి TV చూస్తూ స్నాక్స్ బెడ్ మీదనే తినటం ఇష్టం లేదా ఆఫీసు పని పూర్తి చేయటం ఇష్టం. వారు లీనమయిపోతారు మరియు తినడం మర్యాద కూడా మర్చిపోతారు, చుట్టూరా ప్రతిదీ విరజిమ్ముతారు మరియు మీరు వారిని బెడ్ షీట్లు మార్చడానికి లేవమని అడిగితే మీవైపు చిరునవ్వుతో చూస్తారు. ఒకవేళ వారి భార్యలు అలా అడగకపోతే, వారు అదే మెస్ లో నిద్రపోతారు మరియు అసలు ఏమి పట్టించుకోరు.

రాత్రంతా గురక బిగ్గరగా పెట్టటం మరియు నిద్ర సరిగా పోలేదని ఫిర్యాదు

రాత్రంతా గురక బిగ్గరగా పెట్టటం మరియు నిద్ర సరిగా పోలేదని ఫిర్యాదు

భర్తల గురక వలన మంచి నిద్ర లేని భార్యలకు ధన్యవాదాలు లేకపోవొచ్చు, కానీ ఉదయం వారి భర్తలు లేచి "రాత్రి మొత్తం నిద్ర లేదు. నీవు మొత్తం బెడ్ ఆక్రమించావు, మరియు నాకు నిద్రపోవటానికి ఏ గదిని ఉంచలేదు."అని ఫిర్యాదు చేస్తుంటారు.

పేపర్ చదవటం మరియు ధూమపానం లోపల. ఇతరులను వేచి ఉండేట్లుగా చేయటం

పేపర్ చదవటం మరియు ధూమపానం లోపల. ఇతరులను వేచి ఉండేట్లుగా చేయటం

భారతీయ పురుషులు ఉదయం చేయాలనుకునే రెండు విషయాలు ఒక నిశ్శబ్ద మూలలో వార్తాపత్రిక చదివాటం (వారు ధూమపానం చేస్తూ ఉన్నా ) కానీ కొన్ని కారణాల వాళ్ళ ఇంటిలో మూలలో నిశబ్దంగా కనపడేది బాత్రూమ్, ప్రపంచం నుండి సురక్షితంగా లాక్ చేసుకుని, గంటల తరబడి వారికి ఇష్టమైనది చేసే స్థలం. వారు బాత్రూమ్ లో ధూమపానం చేస్తూ అరగంట అక్కడ కూర్చుని ఉండటం మరియు సిగరెట్ పొగను అక్కడ వొదలటం; ఇది భారతీయ భార్యలకు చాలా హేయమైన చర్య.

వారు వారివారి సొంత వొస్తువులను అందుబాటులో ఉంచుకోరు

వారు వారివారి సొంత వొస్తువులను అందుబాటులో ఉంచుకోరు

భారతీయ భర్తలు వొస్తువులు ఎక్కడివక్కడ ఒక క్రమంలో ఉండటం ఇష్టపడతారు, కానీ వారు తాముగా ఏమి చేయాలని అనుకోరు. వారి కోసం వాటిని భార్యే చేయాలని భావిస్తారు. ఉదయం లేచినదగ్గర నుండి వారు స్వంతంగా ఒక్క వొస్తువును కూడా తీసుకోరు. వారి టూత్ బ్రష్, పేస్ట్, చొక్కాలు, బూట్లు మరియు సాక్స్ నుండి, ప్రతిదీ వారికోసం తీసిపెట్టాలి. వాటిని మీరు సరిఅయిన స్థానంలోనే ఉంచినా, వారు గుర్తు ఉంచుకోరు లేదా వాటిని కనీసం చూసుకునే ప్రయత్నం కూడా చేయరు.

వారాంతపు శెలవుదినం అయినా షేవింగ్ చేసుకోరు

వారాంతపు శెలవుదినం అయినా షేవింగ్ చేసుకోరు

బహుశా మీరు అతను శుభ్రంగా షేవ్ చేసుకోవటం చూసి వివాహం చేసుకుని ఉండవొచ్చు మరియు చాలా చక్కగా తలను దువ్వుకోవటం చూసి ఇష్టపడి ఉండవొచ్చు కాని కనీసం వారాంతంలో కూడా షేవింగ్ చేసుకోరని మీరు తర్వాత గ్రహింఛి ఉండవొచ్చు. సాధారణంగా గైస్ వారాంత సమయంలో చాలా సోమరితనంగా ఉంటారు మరియు వారికి అప్పటికే ఇంటి వద్ద భార్య ఉంటే, మంచి వస్త్రధారణకు, అందంగా శుభ్రంగా ఉండటానికి సమయం వృధా చేసుకునే అవసరం వారికి ఉండదు.

"కమింగ్" అని చెపుతారు మరియు సమయం మించుతున్నా డైనింగ్ టేబుల్ ను చేరుకోరు

మీరు వండే రుచికరమైన ఆకట్టుకునే ఆహారం కోసం మిమ్మలిని వివాహం చేసుకొని ఉండవచ్చు, కానీ వివాహం తర్వాత ఎప్పుడో ఒకసారి మాత్రమే గుర్తు ఉంచుకుంటారు. టి. వి.ని చూడటం, వారి ఇమెయిల్స్ చూసుకోవటం, మరియు కేవలం భోజనం ముందు పేపర్స్ సర్దుకోవటం వంటివి వారికి ఇష్టమైన పనులతో సమయం గడుపుతుంటారు. డిన్నర్ చల్లగా అయిపోయినా, వారు చాలా మటుకు పట్టించుకోరు.

మొత్తం వారాంతంలో స్నానం కూడా చేయకుండా నిద్ర పోవటం

మొత్తం వారాంతంలో స్నానం కూడా చేయకుండా నిద్ర పోవటం

వారాంతం ప్రారంభమవగానే, భర్తలు సాధారణంగా ఒక నిమిషం కూడా వృథా కానివ్వకుండా, వారి మంచం మీద పడి నిద్ర పోతుంటారు. వారు అదే మంచంమీద నిద్రపోతూనే పక్షవాతం వొచ్చినవారివలె అక్కడే కూర్చొని టీ, భోజనం అన్నీ పూర్తికానిస్తుంటారు. రోజుమొత్తం టి. విలో ప్రసారమయ్యే క్రికెట్ లేదా వార్తలు గాని చూస్తూనేఉంటారు. మీరు స్నానం చేయమని వారిని అడిగితే, ఇంకేముంది? మీరు వారి వారాంతాన్ని పాడు చేసినవారవుతారు.

బెడ్ మీద తడి టవల్ విసరడం మరియు అక్కడ వేసినదానిని మర్చిపోవటం

బెడ్ మీద తడి టవల్ విసరడం మరియు అక్కడ వేసినదానిని మర్చిపోవటం

భారతీయ పురుషులు చేసే సర్వసాధారణ చర్య - వారు స్నానం తర్వాత వారి టవల్ తీసుకుని బాల్కనీలో ఆరవేయరు, కానీ ఎప్పుడూ బెడ్ మీద పాడవేస్తారు. దానివలన మంచం మీద బెడ్ షీట్ తడిఅయినా సరే లేదా వొచ్చిన అతిథులకు అసహ్యంగా వారి దృష్టిని ఆకర్షించినా సరే, వారికి అనవసరం, భార్య చెప్పేది వినరు మరియు భార్యే తీసి ఆరవేయాలని అనుకుంటారు.


English summary

8 Irritating Habits Of Indian Husbands That Irks Indian Wives The Most

What is little noticed by Indian husbands can be extremely obnoxious for their better halves to bear with. Small habits of Indian men can cause distress and fury to their wives to kill their “honey you’re so sweet” feeling and replace it with “what a disgusting man I’ve got married to.”
Desktop Bottom Promotion