వాలెంటైన్ స్పెషల్:మీరు లవ్ లో సక్సెస్ కావాలంటే..లవ్ టిప్స్ అండ్ ట్రిక్..!!

అమ్మాయి ఓకే చెప్పేసింది కదా అని ప్రేమిస్తే సరిపోదు. ఆ ప్రేమను కంటికి రెప్పలా చూసుకోవాలి. ప్రేమలో పడిపోయింది కనుక ఇక తన వెంటే తిరుగుతుంది అనే వాదనకు బూజు పట్టి చాన్నాళ్లయింది.

Posted By:
Subscribe to Boldsky

ప్రస్తుతం వాలెంటైన్ వీక్ రన్ అవుతావుంది. ఈ వాలెంటైన్ వీక్ లో ఫ్రెండ్ షిప్ ల ముందు ఏ ''షిప్పూ'' పనికిరాదు. అందో రంగుల ప్రపంచం. ఆ ప్రపంచంలో తాము మాత్రమే విహరించాలంటూ కలలు కంటుంటారు. స్నేహం రకరకాలుగా ఉంటుంది. ఈ రకాల్లో మొదటి రకం ప్రేమతో కూడా స్నేహబంధం. ఈ ప్రేమ బంధం మొగ్గతొడిగితే చాలు..ఇక లోకంలో ఎవ్వరూ కనపడరు..ఒక్క ప్రేయసి/ప్రియుడు తప్పు.

అందుకే ప్రేమ గుడ్డిది అన్నారు పెద్దలు. కానీ, ఈ ఆధునిక ప్రపంచంలో మోడ్రన్ లవర్స్ మాత్రం ప్రేమ విశాలమైన నేత్రాలు కలిగిన ఓ బ్యూటిఫుల్ పవర్ అంటున్నారు. ప్రేమ లేనిదే ఏదీ లేదని చెబుతున్నారు. అంతే కాదు ప్రేయసి వద్ద సంపూర్ణమైన ప్రేమను పొందేందుకు ప్రేమలో సక్సెస్ అయిన కొన్నిజంటలు కొన్ని చిట్కాలను కూడా చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

టైమ్ ఇంపార్టెంట్ గురూ..

. చెప్పిన చోటకు, చెప్పిన సమయానికి, చెప్పినట్లు రాకపోతే అమ్మాయి అప్సెట్. అందుకే బాసూ ఫలానా చోటికి ఫలానా టైంకి వస్తానని చెపితే గంటకొట్టి మరీ అక్కడ ఐదు నిమిషాలకు ముందే ఉండాలి. లేదంటే అమ్మాయి కారాలు మిరియాలు నూరుతుంది. ఆ తర్వాత మీ పని మిర్చిమసాలే.

మీ ప్రేయసి మాట్లాడే చాన్స్ ఇవ్వాలి..

పిలిస్తే ఊరకనే అలా వెళ్లి సొల్లు కబుర్లు చెపితే అమ్మాయికి కోపం రావచ్చు. అందుకని ఆమెకే ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. అలాగని మూగమొద్దులా కూచోకూడదు. మధ్యమధ్యలో ప్రేయసి మనసు మీటే మాటల బాణాలను తూటాల్లా వదలాలి. ఆ మాటలు ఎలా ఉండాలంటే ఇక ఈ జన్మలో మీతోటిదే లోకం అన్నట్లు ఉండాలి మరి.

ప్చ్.. అబద్ధం చెప్పారా... అందుకే...

సహజంగా కొంతమంది, కాదు..కాదు ప్రతి ప్రియడు ప్రేయసి వద్ద కొన్ని(చెప్పాల్సినవి) దాచేసి అబద్ధాలు చెపుతుంటారు. అది రివర్సై చివరికి మాటల యుద్ధానికి దారితీస్తుంది. ఒకరిపై ఒకరు రుసరుసలాడుకోవడమూ జరుగుతుంది. కనుక ప్రేయసి వద్ద, ముఖ్యంగా ఆమెకు సంబంధించినది కావచ్చు లేదా ప్రియునికి సంబంధించినది కావచ్చు నిజాన్ని చెప్పేయడమే బెటర్. అబద్ధం చెపితే అరచెంప వాచిపోడమే కాదు, మీ రిలేషన్ కూడా దెబ్బతినవచ్చు. బీ కేర్‌ఫుల్

ఆమెను ప్రేమించడానికి మీవద్ద ఏముంది..?

ప్రస్తుత కాలంలో మీ అందాన్ని, కండలు తిరిగిన మీ శరీరాన్ని..మీరు వేసే కాస్టూమ్స్ నో..దుస్తులనో.. ఇలాంటివి చూసి అమ్మాయి ప్రేమలో పడిందని అనుకోవడం పొరపాటు. నేటితరం అమ్మాయిలు చాలా ఫార్వార్డ్ గా ఉన్నారు. అబ్బాయిల బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకుని మరీ ప్రేమిస్తున్నారు. అలాగని వారి ప్రేమ స్వార్థంతో కూడుకున్నది అనుకునేరు. అది ప్రియుడికోసమే. అతడితో సంతోషంగా కాలం గడిపేందుకే అంటున్నారు.

వాళ్లు ఆశించేందేమంటే...

ప్రేమతో దగ్గరైన తర్వాత తమకు భవిష్యత్తులో ఆర్థిక, సామాజిక... ఇతరత్రా అడ్డంకులు ఎదురు కాకూడదన్నదే. అలా చూసుకోవడం ద్వారా తమ ప్రేమలో సక్సెస్ అవుతున్నారు. కనుక అలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ నికరం చేసుకుని అమ్మాయిని సంప్రదిస్తే బెటర్.

లవ్ చేయడమే కాదు.. లవ్‌కేర్ కూడా ముఖ్యమే...

అమ్మాయి ఓకే చెప్పేసింది కదా అని ప్రేమిస్తే సరిపోదు. ఆ ప్రేమను కంటికి రెప్పలా చూసుకోవాలి. ప్రేమలో పడిపోయింది కనుక ఇక తన వెంటే తిరుగుతుంది అనే వాదనకు బూజు పట్టి చాన్నాళ్లయింది. ప్రేమిస్తే... నచ్చని పనులు చేస్తే సహిస్తూ ఆ బంధంలో కొట్టుమిట్టాడాలా..? అనే ప్రశ్నలు వస్తున్నాయ్. నచ్చకపోతే... ఓ ఫైన్ మార్నింగ్ అమ్మాయి సిమ్ కార్డుతో సహా... ఇంటి డెస్టినేషన్ అడ్రెస్ కూడా మారిపోతుంది. అలా శాశ్వతంగా ప్రేమబంధాన్ని తెగతెంపులు చేసుకునేందుకు ఎంతమాత్రం వెనుకాడటం లేదు. కనుక లవ్ కేర్ ముఖ్యమనేది గుర్తుంచుకోవాలి గురూ.

English summary

Does Love Have A Set Formula For Success?

Do relationships of love have set formulas. If they do then what are they. Is it possible to say that I will fall in love with a guy who is exactly 5 years elder to me, earns exactly 10 grands more than me and owns a 2 bedroom apartment? If that person does not fall under this love equation then he is out of the league.
Story first published: Friday, February 10, 2017, 15:12 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter