Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
మీ భాగస్వామి అలక తీర్చడానికి సింపుల్ టిప్స్
'అలిగితివా..సఖీ..ప్రియా...కలత మానవా...' 'కోపమా నాపైనా...ఆపవా ఇకనైనా..' ఇలా పాడుకుంటూ భార్యా భర్తలు ఇద్దరూ ఒకరి అలక మరొకరు తీరుస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కదండీ! సంసారమన్నాక అప్పుడప్పుడు చిరు కోపాలు, తపాలు, అలకలు సహజమే.
నిజంగా చెప్పాలంటే భార్యభర్తల సంబంధంలో ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో...ఇలాంటి చిర్రుబుర్రులకు కూడా అంతే ప్రాముఖ్యం కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి చిలిపి తగాదాల, బుంగమూతి పెట్టడాలు ఒకరి మీద మరొకరికి ప్రమఎంతుందో తెలుస్తుంది. దాని ద్వారా ఆ బలం మరింత బలపడుతుంది.
అయితే అలగడం వరకూ బాగానే ఉంటుంది. కానీ అది తీర్చిడానికి మాత్రం కష్టపడాల్సిందే...ఇంతకీ భాగస్వామి అలక తీర్చే మార్గాలేంటో ఈ క్రింది విధంగా ఉన్నాయి చూడండి...

ముచ్చట తీర్చాలి:
సాధారణంగా మీ పాట్నర్ కి మీ మీద కోపం రావడానికి రెండు కారణాలు ఉండవచ్చు. అందులో మొదటిది తను అడిగినడి మీరు ఇవ్వకపోవడం లేదా చేయకపోవడం. రెండవది..మీరు తనపై కోపం చూపించడం. మొదటి విషయంలో తను మీ నుంచి ఏదైనా విలువైన బహుమతి అందుకోవాలనుకున్నారనుకోండి...కానీ మీరు అది నేరవేర్చలేనప్పుడు. లేదా వారు చెప్పిన మరేదో పని చేయలేకపోయారు. అప్పుడు అందుకు గల కారణమేమిటన్నది వారికి స్పష్టంగా వివరించాలి. దాంతో వారు మిమ్మల్ని కొంచెం అర్ధం చేసుకుని మీ మీద అలక మానే అవకాశం ఉంటుంది.

ముచ్చట తీర్చాలి:
అలాగే రెండో కారణంలో చెప్పినట్లుగా మీ ఒత్తిడిని, చికాకును ఎదుటి వారిపై చూపించి. వారు కూడా కోపగించుకొన్నట్లైతే...మీ కోపం కాస్త తగ్గాక తన దగ్గరకు వెళ్లి..వారిని దగ్గరకు తీసుకుని '''సారీ రా...ఈ రోజు నా మనసేం బాగోలేదు...అప్పుడే నువ్వొచ్చి మాట్లాడుతుంటే కోపం వచ్చేసింది.. మరోసారి ఇలా చేయను ' అని వారి దగ్గరకు తీసుకొని సమాధానపరచాలి. దాంతో మీ భాగస్వామికి మీ మీద ఉండే కోపం ఇట్టే కరిగిపోతుంది.

సర్ ప్రైజ్ చేయాలి:
భాగస్వామి అలక తీర్చడానికి చాలా మంది ఎంచుకునే మార్గం. భాగస్వామిని ఏదో ఒక రకంగా సర్ ఫ్రైజ్ చేయడం. ఉదాహరణకు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు వారికి ఇష్టమైన పదార్థాలు తీసుకురావడం, లేదంటే ఇంట్లోనే స్వయంగా తయారుచేసి...వారి దగ్గరకు తీసుకెళ్లి ప్రేమగా నోట్లో పెడుతూ...' ఇంకా నా మీద నీకు కోపం తగ్గలేదా? ఈ సారికి మన్నించొచ్చు కదా! అని మీరు పశ్చాత్తపాపడుతున్నట్లుగా అడగడం, అలాగే వారికిష్టమైన ప్రదేశానికి లేదా సినిమాకు తీసుకెళ్లడం...ఇలా వివిధ రూపాల్లో వారిపై మీకున్న ప్రేమను తెలియపరచండి. దాంతో వారి అలకను నెమ్మదిగా తగ్గించవచ్చు.

తప్పును ఒప్పుకోవాలి.
మీ భాగస్వామి అలకకు మీరు కారణమైతే? వారిని బతిమాలి అలక తీర్చాల్సిన బాధ్యత కూడా మీదే...మీరు వారిపై కాస్త తీవ్రస్థాయిలోనే కోప్పడి ఉంటే...వాళ్లు కాస్త ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మామూలుగా సారీ చెప్పడమో, బుజ్జగించడమో చేస్తే వారు అస్సలు సంత్రుప్తి పడరు. కాబట్టి వారిని వారికి నచ్చిన ముద్దుపేర్లతో పిలుస్తూ...ఈ ఒక్కసారికి క్షమించవచ్చు కదా... అంటూ మీ పరిస్థితిని వివరించండి. దాంతో వారి కోపం వెంటనే తగ్గిపోతుంది.

గుర్తుచేసుకోకండి..
మీ భాగస్వామి అలక తీర్చే క్రమంలో మీరు వారి మనసును నొప్పించేలా ప్రవర్థించిన విషయమైనా, ఇతర పాత విషయాలైనా వారి దగ్గర ప్రస్తావించడం, బాధపెట్టే మాటలను గుర్తుచేయడం, పదే పదే ఆ విషయాన్ని నొక్కి చెప్పడం....వంటివి చేయకూడదు. దీని వల్ల వారికోసం మరింతగా పెరిగే అవకాశం ుంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలేవీ గుర్తు చేయకుండా మీ భాగస్వామి అలక తీర్చే ప్రయత్నం చేస్తే వారు అన్నీ మర్చిపోయి మిమ్మల్ని త్వరగా క్షమించేస్తారు.

వెంటనే వద్దు:
అలక తీర్చమన్నాం కదా...అని అలిగిన వెంటనే వెళ్లి ఈ చిట్కాలన్నీ ప్రయత్నిస్తారా ఏంటీ? ఇలా చేస్తే మీకు చేదు అనుభవం ఎదురవ్వవచ్చు. ఎందుకంటే అలిగిన వెంటనే అయితే వారు కాస్త కోపంగా ఉంటారు కాబట్టి, ఆ క్షణంలోనే వారిని సముదాయించాలంటే కుదరకపోవచ్చు. పైగా వాళ్లు ఆ కోపాన్నీ, చిరాకుని మీపై ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీ భాగస్వామి అలక తీర్చాలనే ఆలోచన బాగానే ఉంది కానీ అందుకు కొంచెం సమయం ఆగండి. ముందుగా వారిని కాసేపు ఒంటరిగా వదిలేయండి. వారి కోసం కాస్త తగ్గితే ఆ తర్వాత మీరెలాగైనా ప్రయత్నించి మీ భాగస్వామిని తిరిగి దగ్గరికి తీసుకోవచ్చు.

సూచన:
భాగస్వామి అలక తీర్చడంలో భాగంగా ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకున్నారు కాదా...అయితే ఈ క్రమంలో మీరే బెట్టు చేయడం, వారిపై విరుచుకుపడడం, వంటివి చేయకూడదు. దాని ద్వారా ఎదుటి వారి కోపం పెరిగి, ఇద్దరి మద్య లేనిపోని కొత్త గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేయకుండా మీ తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పడం ఒక వేళ మీరే అలిగితే తొందరగా క్షమించేయడం వంటివి చేసత్ే ఇద్దరి మధ్యా ఉండే పొరపొచ్చాలు తొలగిపోయిన తిరిగి మరింత ప్రేమగా మమేకమయ్యే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications