Latest Updates
-
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ధనలాభం ఖాయం! - సోమవారం, 27 ఏప్రిల్ 2026 -
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ!
ఆషాడమాసంలో పూజలు చేయవచ్చు..! మరి పెళ్లి ఎందుకు చేయకూడదు ?
ఆషాడ మాసం ఆరంభం అవుతుందంటేనే... అంతవరకు అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడుతుంది. ఆషాడమాసం శుభకార్యాలకు మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను ఉందని పండితులు చెబుతారు. ఆషాడంలో ఎట్టిపరిస్థితుల్లో పెళ్లిళ్లు చేయరు హిందువులు. అవసరమైతే.. పెళ్లిని.. మూడు నెలలు, నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ.. ఆషాడ మాసంలో మాత్రం పెళ్లి భజంత్రీలు మోగించరు. అలాగే ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన కోడలు, అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది.
ఈ సంప్రదాయాల ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదా ? ఆషాడ మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు ? ఆషాడ మాసంలో పెళ్లిళ్లు చేస్తే ఏమవుతుంది ? ఆషాడ మాసంలో అనేక పూజలు, వ్రతాలు నిర్వహించడానికి మంచిదైనప్పుడు, పెళ్లిళ్లు చేయడానికి ఎందుకు మంచిది కాదు ? దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి ?

ఆషాడ మాసం
ఆషాడ మాసంను ఆషాడ మంత్, ఆది మాసం అని పిలుస్తారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల. హిందూ పండితుల ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదు.

దేవతారాధన
ఆషాడ అనేది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆది అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఈ ఆషాడ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది.

ఎప్పుడు ?
ఆషాడ మాసం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జూన్, జూలై మధ్యలో వస్తుంది.

శుభకార్యాలు
ఆషాడ మాసంలో పెళ్లిళ్లే కాదు.. గృహప్రవేశం, శంకు స్థాపన వంటి ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడం మంచిది కాదు. కనీసం శుభకార్యాలను, మంచి పనులు ప్రారంభించరు.

పూజలకు
మరో విచిత్రమేమిటంటే.. ఆషాడ మాసం శుభకార్యాలకు మంచిది కాదు. కానీ పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవ వంటి పెద్ద పెద్ద శుభకార్యాలకు శుభప్రదమైనది. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి.

పెళ్లిళ్లు చేయకపోవడానికి కారణం
అసలు ఆషాడంలో పెళ్లిళ్లు చేయకపోవడానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిగమ్నమై బిజీగా ఉంటారు. దీనివల్ల వాళ్లకు పెళ్లి కార్యక్రమాలు చేయడానికి సమయం ఉండదు. ఈ కారణం వల్లే.. ఆషాడ మాసంలో వివాహాలు నిర్వహించరు.

మరో కారణం
ఉత్తరాయణ, దక్షిణాయణ కథల ప్రకారం ఆషాడ మాసం సమయంలో.. దేవుడు నిద్రలోకి వెళ్తాడట. దీనివల్ల.. పెళ్లి చేసుకున్న వాళ్లకు దేవుడి ఆశీస్సులు అందవనే నమ్మకంతో.. ఇలా ఆషాడంలో పెళ్లిళ్లకు బ్రేక్ వేసినట్లు చెబుతారు.

డబ్బు
అలాగే సౌత్ ఇండియాలో ఆషాడ మాసం అంటే.. ఎలాంటి పంట చేతిలో ఉండదు. పెళ్లి చేయడానికి అవసరమయ్యే డబ్బులు ఉండక ఇలా సంప్రదాయం పేరుతో ఆషాడంలో పెళ్లి చేయకూడదు అనే నిబంధన తీసుకువచ్చారని పండితులు చెబుతున్నారు.

వాతావరణం
పూర్వకాలంలో పెళ్లి అంటే.. ఎక్కువ ఖాళీ ప్రదేశంలో పెద్ద పెద్ద పరదాలు కట్టి నిర్వహించేవాళ్లు. ఆషాడ మాసంలో గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. గాలి తీవ్రతకు పెళ్లికి ఆటంకం ఏర్పడవచ్చు. అలాగే పెళ్లి వంటకాలపై దుమ్ము, ధూళి పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. విద్యుత్ వైర్లు కట్ అవడం, హోమాల వల్ల ప్రమాదాలకు అవకాశాలు ఉంటాయి. ఈ కారణాల వల్ల.. ఆషాడంలో పెళ్లి కార్యక్రమాలు నిర్వహించకపోవడం మంచిదని పెద్దవాళ్లు ఈ నిర్ణయానికొచ్చారు.

అత్తా, కోడళ్లు
ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ఆషాడమాసం వచ్చిందంటే.. కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే పెళ్లికూతుళ్లను పుట్టింటికి పంపిస్తారు.

కోడలు పుట్టింటికి ఎందుకు ?
కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఆషాడమాసంలో విడి విడిగా ఉండటానికి మరో కారణం ఉంది. ఆషాడ మాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సయంలో గర్భం దాల్చడం వల్ల వేసవిలో ప్రసవం జరుగుతుంది. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని భావించని మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు.

ప్రసవానికి ఇబ్బంది
ఎండాకాలంలో నార్మల్ డెలివరీ చాలా ఇబ్బందికరమైనది. అలాగే ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం హాస్పిటల్స్ లో మంచి ట్రీట్మెంట్ ఉండేది కాదు కాబట్టి.. ఇలా సంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్లట.

గోరింటాకు
ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఆషాడం సమయంలో వాతావరణం మారుతుంది. ఈ క్లైమెట్ లో మార్పుల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం పాటించేవాళ్లట.

మంచిది కాదన్నది అపోహ మాత్రమే
ఈ కారణాల వల్ల ఆషాడమాసంలో పెళ్లిళ్లు నిర్వహించరు అంతే. కాబట్టి ఆషాడ మాత్రం పవిత్రం, శుభప్రదమైనది కాదు అన్నది అపోహ మాత్రమే.



Click it and Unblock the Notifications