వివాహం కానివారు, వివాహం ఆలస్యమయ్యే వారు ఈ 11 మంత్రాలతో శివారాధన చేస్తే...

ఆ పరమ శివుడిని ఆరాధనతో బలం, రక్షణ, ఆరోగ్యం తోపాటు వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. శివుడు తన భక్తుల కోర్కెలను నెరవేర్చడంలో ఆనందం పొందుతాడు. ముఖ్యంగా వివాహం కానివారు శివారాధన గావిస్తే ఆటంకాలు తొలగ

Posted By:
Subscribe to Boldsky

ఈ జగత్త్ లో భక్తుల ఆనందమే తనకు ముఖ్యమంటూ కోరినంతనే వరాలనొసగే వాడు ఆ పరమశివుడు. అందుకే ఆయనను బోళాశంకరుడు అంటారు. ఎవరైనా భక్తితో నమస్కరిస్తే చాలు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవుడు. అయితే శివారాధన చేసేటప్పుడు మాత్రం కొన్ని మంత్రాలను జపిస్తూ బిల్వ పత్రాలతో అర్చన చేస్తే చాలా ఎఫెక్టివ్ గా ఫలితం దక్కుతుందట. ఆ పరమేశ్వరుడిని భక్తితో పూజిస్తే అంతులేని తెలివితేటలు, మానసిక ప్రశాంతత, ఇతరుల నుంచి గౌరవం, జీవితంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయని హిందూ ధర్మం పేర్కొంటుంది.

Shiva Mantras for long life and early marriage

ఆ పరమ శివుడిని ఆరాధనతో బలం, రక్షణ, ఆరోగ్యం తోపాటు వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. శివుడు తన భక్తుల కోర్కెలను నెరవేర్చడంలో ఆనందం పొందుతాడు. ముఖ్యంగా వివాహం కానివారు శివారాధన గావిస్తే ఆటంకాలు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పురాతన పండితులు పేర్కొన్నారు.

Shiva Mantras for long life and early marriage

సతి అగ్ని ప్రవేశం తర్వాత ఎడబాటుకు గురైన శంకరుడు కైలాసంలో ఎకాంతంగా ఉంటాడు. గిరిపుత్రిక పార్వతిగా జన్మించిన సతి మహాదేవుని ప్రసన్నం చేసుకోడానికి ఘోర తపం ఆచరిస్తుంది. అయినా శివుడు ఆమెను కరుణించకపోవడంతో వైకుంఠంలోని శ్రీమహా విష్ణువు సహాయం కోరుతోంది. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆమెకు శివుడిని ఆరాధించే విధానాన్ని ఉపదేశిస్తాడు. ఈ పదకొండు నామాలతో శంకరుడిని పూజిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయంటూ పార్వతికి శ్రీహరి తెలియజేస్తాడు. అలాగే ఆయుష్షు కూడా పెరుగుతుందట.

ఈ మంత్రాలేంటో తెలుసుకోండి. 11 మంత్రాలు శివుడి శరీరంలో అన్ని భాగాలను సంబంధించినవి.

ఓం హ్రీం హృద‌యా నమ:.

ఓం హ్రీం హృద‌యా నమ:. దీంతో హృద‌యాన్ని ఆరాధించడం.

ఓం హ్రీం శిర్షే స్వాహ.

ఓం హ్రీం శిర్షే స్వాహ. అంటే శిరస్సును పూజించడం.

ఓం హ్రీం శిఖాయి వషత్.

ఓం హ్రీం శిఖాయి వషత్. అంటే శివుని జాటజూటాన్ని అభిషేకించడం.

ఓం హ్రీం కవచాయ నమ:.

ఓం హ్రీం కవచాయ నమ:. శివుని కీర్తని శ్లాఘించడం.

ఓం హ్రీం నేత్ర త్రయాయ వషత్

ఓం హ్రీం నేత్ర త్రయాయ వషత్ అంటే కన్నులను పూజించడం.

ఓ హర అస్త్రాయ పహత్ అంటే

ఓ హర అస్త్రాయ పహత్ అంటే భుజాలను అభిషేకించడం.

వీటితో పాటు శివుడి రూపాలకు చెందిన మరో అయిదు మంత్రాలను కూడా పఠించాలి.

ఓం హ్రం సద్యయోజటాయ నమ:

 ఓం హ్రీం వామదేవాయ నమ:

 

వీటితో పాటు శివుడి రూపాలకు చెందిన మరో అయిదు మంత్రాలను కూడా పఠించాలి.

ఓం హ్రీం అఘోరాయ నమ:

10. ఓం హ్రీం తత్పురుషాయ నమ:

 

వీటితో పాటు శివుడి రూపాలకు చెందిన మరో అయిదు మంత్రాలను కూడా పఠించాలి.

ఓం హ్రీం ఇష్ణాయ నమ:

English summary

Shiva Mantras for long life and early marriage

If you want to impress Lord Shiva, then these are the most powerful mantras you must chant.
Please Wait while comments are loading...
Subscribe Newsletter