Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
ఖరీదైన రత్న ఉంగరాల మాటే వద్దు.. రోజూ ఇలా చేశారంటే మీ జాతకానికి తిరుగే ఉండదు.!
మన జీవితంలో జ్యోతిష్య శాస్త్ర ప్రభావం ఎంతో ఉంటుంది. జాతకంలోని ప్రతి దోషానికి ఓ పరిహారం ఖచ్చితంగా ఉంటుంది. వాటిలో రత్నాల ఉంగరాలకి మొదటి ప్రాధాన్యత. అయితే ఈ ఉంగరాల ధర చాలా ఎక్కువ. ఇంకా ఎలాంటి ఉంగరం ధరించాలనే దానిపై కూడా చాలా మందికి అవగాహన ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ వాటిని ధరించలేరు. అయితే ఈ ఉంగరాల అవసరం లేకుండా మీ జాతకంలోని దోషాలను తొలగించుకోవచ్చని జ్యోతిష్యం చెబుతోంది. అవేంటో చూద్దాం.

ఖరీదైన రత్నాలను ధరించకుండానే మీ జాతకంలోని గ్రహాలను బలపరిచేందుకు సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారాలను జ్యోతిష్య శాస్త్రం అందిస్తోంది. జాతకంలో దోషంతో మీ జీవితంలో పలు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పరిష్కారాలను వీటిని నిత్యం పాటించినట్లయితే స్వల్ప వ్యవధిలోనే ప్రశాంతతను, పరిష్కారాన్ని పొందవచ్చని చెబుతోంది.
సూర్య దోషం
విశ్వానికే వెలుగునిచ్చే సూర్యుడు మీ జాతకంలో బలంగా ఉండాలి. భాస్కరుడు బలహీనంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి గౌరవం, ఆత్మవిశ్వాసం, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే దీనికి పరిష్కారం ఉంది. ప్రతి ఉదయం రాగి గ్లాసులో నీరు నింపి అందులో మందారం, గులాబి లాంటి ఎర్రటి పూలు, కొద్దిగా బెల్లం కలిపి సూర్యుడికి నైవేద్యం సమర్పించాలి. అదేవిధంగా సూర్యభగవానుడిని ఆరాధించే ఆదివారాల్లో గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలను దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు.
చంద్రదోషం
మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే మానసిక ఒత్తిడి, భయం ఎక్కువవుతుంది. చంద్ర దోషాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిష్కార మార్గాలను పాటించాలి. సోమవారాల్లో శివునికి జలాభిషేకం చేసి, 'ఓం సోమాయ నమః' మంత్రాన్ని జపించాలి. అనంతరం బియ్యం, పాలు, పటిక బెల్లం వంటి తెల్లని పదార్థాలను దానం చేయడం మంచి ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట చంద్రునికి పాలు సమర్పించడం మరిచిపోవద్దు.
మంగళ దోషం
హిందూ సంప్రదాయంలో మంగళవారం రోజు చాలా మంది కొత్త పనులను ప్రారంభించరు. కాగా, మంగళ దోషం వలన కోపం పెరగడంతో పాటు, వైవాహిక జీవితంలో ఒడుదొడుకులు, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి మంగళవారాల్లో హనుమంతుడిని పూజించి, సుందరకాండ పారాయణం చేయాలి. పప్పు ధాన్యాలు, యాపిల్, దానిమ్మ వంటి ఎర్రటి పండ్లను దానం చేయడం ద్వారా మంగళ దోషాన్ని తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. ఆరోజు కోతులకు బెల్లం, శనగలు తినిపించడం కూడా సానుకూల ప్రభావం చూపిస్తుంది.
బుధ గ్రహ దోషాలు
మీ జాతకంలో బుధుడు ఉన్నట్లయితే వ్యాపారం, విద్యపై ప్రభావం చూపడంతో పాటు పదిమందిలో మాట్లాడటానికి భయపడే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ దోష నివారణకు బుధవారాల్లో పచ్చి పప్పులు, ఆకుకూరలు, ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయడం ఉత్తమం. ఆవులకు పచ్చి మేత పెట్టడం కూడా దోష నివారణపై సానుకూల ప్రభావం చూపిస్తుంది.
గురు దోషం
గురు గ్రహం బలహీనంగా ఉంటే.. వివాహం, విద్య, సంపాదనకి సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. దీనికి పరిహారంగా గురువారాల్లో పసుపు రంగు వస్తువులను దానం చేయడం ఉత్తమం. అరటి చెట్టును పూజించడం, పేదలకు శనగపప్పు, పసుపు దానం చేయడం మంచింది. గురు గ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించడం కూడా మేలు చేకూరుస్తుంది.

శుక్ర దోషం
శుక్ర గ్రహ దోష ప్రభావంతో జీవితంలో వైవాహిక జీవిత ఇబ్బందులు తలెత్తుతాయి. ఇందుకు పరిహారంగా శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించాలి. అమ్మవారికి తెల్లని మిఠాయిలను నైవేద్యంగా సమర్పించడం మంచిది. ఆడపిల్లలకు తెల్లని బట్టలు లేదా సౌందర్య సాధనాలను దానం చేయడం వల్ల సానుకూల ఫలితాలను చూడవచ్చు.
శని దోషం
శని దోషం కారణంగా జీవితంలో కలహాలు, ఆలస్యాలు, ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. పరిహారం కోసం శనివారాల్లో రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించి, పేదలకు, అవసరమైన వారికి సహాయం చేయాలి. ఆ రోజుల్లో నల్ల నువ్వులు, మినపపప్పు దానం చేయడం ద్వారా శని దోషం నుంచి బయటపడవచ్చు.
రాహు-కేతు దోషాలు
రాహు- కేతు దోషాల కారణంగా జీవితంలో గందరగోళం, ఒత్తిడి, ఆకస్మిక సమస్యలు తలెత్తుతాయి. వీటి నివారణకు భైరవ స్వామిని, గణేశుడిని పూజించడం ప్రయోజనం చేకూరుస్తుంది. ఆరోజుల్లో కొబ్బరికాయలు, దుప్పట్లు, నువ్వులను దానం చేయడం శ్రేయస్కరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
