Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఉచ్చ స్థితిలో సూర్యుడు.. ఈ 6 రాశుల వారికి చుక్కలే, ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూడండి
ఈ ఏడాది ఏప్రిల్ 13 నుండి మే 14 వరకు గ్రహాల స్థాన చలానాలు శక్తివంతమైన ప్రభావాన్ని చూపించనుంది. సూర్యుడు తన ఉచ్ఛస్థానం అయిన మేష రాశిలో సంచరిస్తుండటం మరో విశేషం. ఇది కొన్ని రాశులకు శుభ ఫలితాలను అందించడంతో పాటు, మరికొన్ని రాశులపై ఒత్తిడిని, ఆటుపోట్లను తీసుకురానుంది. సూర్యుడు ఓ రాజగ్రహం, అతని ఉచ్ఛస్థితి మానవ జీవితంలో గరిష్ఠ శక్తిని సూచిస్తుంది. అయితే, అతని స్థానం తగినదైతే అదృష్టానికి బాటలు వేస్తుంది, లేకుంటే అవరోధాలకు కారణమవుతుంది. అయితే ఈ స్టోరీలో సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉండడం వలన ఏ రాశి వారికి మేలు జరుగుతుంది? ఎవరికి చెడు రోజులు ఉండనున్నాయి అనేది తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ రాశిలో రవి వ్యయ స్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ దశలో వృషభ రాశికి చెందిన వ్యక్తులు కొంత ఆర్థిక ఒత్తిడికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉండనుంది. అలాగే పనుల్లో ఆలస్యం వల్ల చర్చలకు లోనయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి మందగిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం, ముఖ్యంగా తల్లికి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ప్రయాణాలు ఆకస్మిక ఖర్చులకు దారి తీస్తాయి. ఆదిత్య హృదయం పారాయణం చేయడం, ఆదివారం రోజున కింద నెయ్యితో దీపం వెలిగించడం శుభఫలితాలను ఇస్తుంది.

కన్య రాశి:
కన్య రాశి వారికి రవి అష్టమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ సమయంలో కొంత ఆత్మవిశ్వాస లోపం కనిపించవచ్చు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లు, మోసపోవడం వంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో దూరంగా ఉండే పరిస్థితులు తలెత్తవచ్చు. వృత్తిలో ఆకస్మిక మార్పులు, బదిలీలు సంభవిస్తాయి. రోజూ సూర్యుని దర్శించి, జపం చేయడం మేలుగా ఉంటుంది. గోధుమ రకం వస్త్రదానం మంచి ఫలితాలను ఇస్తుంది.
తుల రాశి:
ఈ రాశి వారికి సప్తమంలో సూర్యుని ఉచ్ఛ స్థితి ఏర్పడుతుంది. ఇది వారి వైవాహిక సంబంధాల్లో ఒడిదుడుకులను తెచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అపార్థాలు, కలహాలు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో కొంత గౌరవం పెరిగినా, కుటుంబ వ్యవహారాలు సంక్లిష్టంగా మారే సూచనలు ఉన్నాయి. ఆదాయానికి సంబంధించిన విషయాల్లో ఆలస్యం, ఖర్చుల నియంత్రణ లోపం ఇబ్బంది కలిగించవచ్చు. ఆదివారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తూ సూర్యుని నమస్కరించటం శ్రేయస్కరం.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి ఆరవ స్థానంలో ఉన్న సూర్యుడు శత్రు స్థానంలో ఉచ్ఛంగా ఉన్నా, కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తలెత్తుతాయి. స్నేహితులు, బంధువుల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో ఆలస్యం, అనుకూలత లోపం కనిపించవచ్చు. ఉద్యోగాల్లో సహచరుల కుట్రలు, నిందలు ఎదురయ్యే అవకాశం ఉంది. సూర్యాష్టకం పారాయణం చేయడం, సహచరులపై విశ్వాసాన్ని పునఃపరిశీలించటం అవసరం.
మకర రాశి:
ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్న రవి, మనశ్శాంతిని ప్రభావితం చేస్తూ కుటుంబ కలహాలకు కారణమవుతాడు. నికటబంధువులతో చిన్నగా సమస్య ప్రారంభమై పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. ఆస్తి విషయాల్లో అనుకోని ఇబ్బందులు తలెత్తవచ్చు. అనారోగ్యం, ముఖ్యంగా గుండె, రక్తపోటు సంబంధిత సమస్యలపై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఆదివారం రోజు ఎర్రని పుష్పాలతో సూర్యారాధన చేయడం వల్ల శాంతి కలుగుతుంది.
మీనం రాశి:
రవి ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండటం ఈ రాశివారికి వ్యయభారం పెరిగేలా చేస్తుంది. ఖర్చులు నియంత్రణలో లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ ప్లానింగ్ తారుమారు కావచ్చు. కొందరు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా, నిర్లక్ష్యం చెయ్యరాదు. ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో తులసి నీళ్లతో సూర్యారాధన చేయడం మంచిదైన మార్గం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications