Latest Updates
-
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి
బ్లూ మైక్రోమూన్‌తో ఆకాశంలో అద్భుతం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే.?
మే 31న ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి రావడం అత్యంత అరుదైన ఘటన. ఈ ఆదివారం భూమికి చంద్రుడు అత్యంత దూరంగా వెళ్లడంతో ఆరోజు 'బ్లూ మైక్రోమూన్’గా పిలుస్తారు. ఈ ఖగోళ ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ పౌర్ణమి ధనుస్సు రాశి ప్రభావంతో ముడిపడి ఉండటం తీవ్రమైన భావోద్వేగ మార్పులు పొందవచ్చని పేర్కొన్నారు.
బ్లూ మైక్రోమూన్ ప్రభావం మేష రాశివారిపై సానుకూలంగా ఉంటుంది. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త ఉత్సాహం, ధైర్యం కలుగుతాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కొత్త అవకాశాలు అందుకుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు.

వృషభ రాశివారిపై బ్లూ మైక్రోమూన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఒత్తిడి ఎదుర్కొంటారు. ధన సంబంధిత విషయాల్లో ఒడుదొడుకులు ఎదుర్కొంటారు. ఖర్చుల విషయంలో అదుపులో ఉండాలి. అయితే మీరు ఎలాంటి కష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నా కుటుంబీకుల పూర్తి సహకారంతో సమస్యలను పరిష్కరించుకుంటారు.
మిథున రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. కొత్త వ్యక్తులను కలవడంతో పాటు సామాజికంగా ఎదగడానికి ఈ కాలం మీకు దోహదపడుతుంది. కుటుంబంతో బంధాలు, భాగస్వామ్యాలు, స్నేహాలు, ప్రేమ బంధాల్లో మీరు ఎదుర్కొంటున్న అపార్థాలు తొలగిపోతాయి. నిజాయతీగా ఆలోచించడం మొదలుపెడతారు.
బ్లూ మైక్రోమూన్ ప్రభావంతో కర్కాటక రాశి వారు మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించడం అవసరం. కెరీర్ పరంగా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తిపరంగా మీ కష్టానికి గుర్తింపు దక్కుతుంది. భావోద్వేగ పరంగా అనవసర విషయాలకు లోనుకాకుండా ఉండటం శ్రేయస్కరం.
ఈ కాలం సింహరాశి వారికి అనుకూల సమయం. వృత్తిపరంగా మీ ఆలోచనలు, ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ధనలాభం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ బంధాల్లో అహంకారాన్ని పక్కనపెట్టి అందరితో సున్నితంగా వ్యవహరించడం మంచింది.
కన్యా రాశి వారికి ఇది కీలకమైన సమయం. కుటుంబ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇల్లు, ఆస్తి వివాదాలు, కుటుంబ బాధ్యతల్లో సరైన విధానంలో వ్యవహరిస్తారు. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు తొలగపోయి బంధాలు మరింత బలంగా ఉంటాయి. మానసికంగా కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. సంయమనం పాటించాలి.
బ్లూ మైక్రోమూన్ ప్రభావం.. తులా రాశి వారిపై సానుకూలంగా ఉంటుంది. మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకోవడంతో మీకు కలిసివస్తుంది. చిన్నపాటి ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. వృత్తిపరంగా బిజీగా మారతారు. పనుల్లో ఒత్తిడి లేకుండా ఉండేందుకు ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలి.
వృశ్చిక రాశి వారు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. అంతర్గతంగా భయాలు తొలిగిపోతాయి. పాత ఆలోచనలను వదిలేస్తారు. ఫలితంగా కొత్త జీవితానికి ఆరంభం పలుకుతారు. బంధాలు, బాధించే విషయాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. కోపం, ఆవేశం పనికిరాదు.
ధనుస్సు రాశి వారి ఈ బ్లూ మైక్రో మూన్ చాలా ప్రాధాన్యమైనది. చంద్రుడు ఈ రాశిలో సంచరించడం వల్ల మీ వ్యక్తిగత జీవితం, భవిష్యత్తు లక్ష్యాలపై ఓ స్పష్టతను అందుకుంటారు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరిపోతాయి. వృత్తిపరంగా కొత్త మార్గాలను ఎన్నుకుంటారు.
మకర రాశి వారు ఆధ్యాత్మిక విషయాలు, ధ్యానంపై ఆసక్తి పెంచుకుంటారు. ఊహించని ఖర్చులు ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో డబ్బు పొదుపు చేసుకోవడం అవసరం. తగినంత విశ్రాంతి తీసుకుంటే శారీరక, మానసిక అలసటను దూరం చేసుకుంటారు.
కుంభ రాశి బ్లూ మైక్రోమూన్ సమయం సానుకూలంగా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం కనిపిస్తుంది. వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభం పొందుతారు. కీలక సమయంలో ఆప్తుల సహాయం పొందుతారు. వృత్తిపరంగా ప్రమోషన్లు అందుకునే అవకాశం ఉంది.
మీన రాశి వారికి బ్లూ మైక్రోమూన్ కలిసి వస్తుంది. కెరీర్ పరంగా ఊహించని మార్పులు చూస్తారు. ప్రమోషన్లు అందుకునే అవకాశం ఉంది. మీ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన సమయం. ఉద్యోగం మారాలనే నిర్ణయాల్లో ఓ స్పష్టత వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
