Latest Updates
-
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు!
భయంకరమైన కాలసర్ప దోషం.. ఈ 4 రాశుల వారికి డేంజర్!
జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువుల పేర్లు వింటేనే చాలామందికి తెలియని ఆందోళన మొదలవుతుంది. ఈ రెండు గ్రహాలను అత్యంత ప్రభావవంతమైన పాప గ్రహాలుగా పరిగణిస్తారు. జ్యోతిష్య గణనల ప్రకారం..ప్రస్తుతం రాహువు కుంభ రాశిలోనూ, కేతువు సింహ రాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ క్రమంలో మిగిలిన గ్రహాలన్నీ రాహు-కేతువుల మధ్యలో చిక్కుకుపోయాయి. జ్యోతిష్య పరిభాషలో దీనినే అత్యంత ప్రమాదకరమైన కాలసర్ప యోగం లేదా కాలసర్ప దోషం అని పిలుస్తారు.

ఈ భయంకరమైన గ్రహాల కలయిక 2026 జూలై 18 వరకు మానవాళిపై తన ప్రతాపాన్ని చూపించనుంది. జూలై 19వ తేదీన చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే ఈ గ్రహాల చిక్కుముడి వీడిపోయి ఉపశమనం కలుగుతుంది. అయితే జూలై 18 వరకు ఉన్న ఈ గడ్డు కాలం కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను తుఫానునే సృష్టించనుంది. కొన్ని రాశుల వారికి ఇది చాలా కఠినమైన సమయంగా ఉంటది. ఆ రాశులేంటో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూడండి.
సింహ రాశి
రాహు-కేతువుల కాలసర్ప యోగం సింహ రాశి వారి జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులను తీసుకురాబోతోంది. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా దిగజారే ప్రమాదం ఉంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఊహించని నష్టాలు ఎదురుకావచ్చు. వివాహ జీవితంలో అకారణంగా మనస్పర్థలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు చేదుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ మాట తీరుపై పూర్తి కంట్రోల్ లో ఉంచుకోవాలి. మీరు మాట్లాడే ఒక్క కఠినమైన మాట ఎదుటివారి మనసును తీవ్రంగా గాయపరుస్తుంది. ప్రతి అడుగు ఆచితూచి వేయడం బెటర్.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ కాలసర్ప యోగం అత్యంత అశుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ సహనానికి పదేపదే పరీక్ష ఎదురవుతుంది. మీ మాటల్లో తెలియని కాఠిన్యం చోటుచేసుకుంటుంది, దీని వల్ల సన్నిహితులు దూరమయ్యే ప్రమాదం ఉంది. మీరు ఎంత నమ్మినవారైనా సరే, వారి చేతిలో మీరు మోసపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కార్యాలయంలో పనిభారం, సవాళ్లు పెరుగుతాయి. ఏ చిన్న పని చేసినా వందసార్లు ఆలోచించి అత్యంత జాగ్రత్తగా చేయాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

కర్కాటక రాశి
జూలై 18వ తేదీ వరకు కర్కాటక రాశి వారు అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి విపరీతంగా పెరిగి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మీ ఆత్మీయులు, బంధువులతో తీవ్రమైన వాగ్వాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా మీరు నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. అన్నింటికీ మించి మీ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి. అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంలో లేదా తొందరపాటుతో కీలక నిర్ణయాలు తీసుకోకండి.
కుంభ రాశి
ప్రస్తుతం రాహువు మీ రాశిలోనే ఉండటం, దానికి తోడు కాలసర్ప యోగం ఏర్పడటం కుంభ రాశి వారికి అత్యంత ప్రమాదకరం. మీరు చేసే వృత్తి, వ్యాపారాల్లో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. మీ భాగస్వాములతో తీవ్రమైన అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఈ సమయంలో మీ ఆలోచనా విధానం మందగిస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మీరు కోల్పోతారు. దీనివల్ల ఇతరుల చేతిలో మోసపోయే ప్రమాదం ఉంది. ఆవేశపడి ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టకూడదు. అలాగే మీ ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
