క్రిస్పీ సొరకాయ పూరీలు.. ఒక్కసారి రుచి చూస్తే ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

సొరకాయలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నప్పటికీ, చాలామందికి ఇష్టమైన కూరగాయల జాబితాలో దీనికి స్థానం ఉండదు. ముఖ్యంగా పిల్లలైతే సొరకాయను చూడగానే తినడానికి మారాం చేస్తుంటారు. రొటీన్ సొరకాయ కూరకు బదులుగా, ఎంతో రుచిగా, కారంగా, కరకరలాడుతూ ఉండే సొరకాయ మసాలా పూరీలను ఒకసారి ట్రై చేయండి. ఇక సొరకాయ ఎక్కడ దొరుకుతుందా అని మొదలుపెడతారు తర్వాతి నుంచి.

సొరకాయ పూరీలు కేవలం రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ పూరీలను ఒక్కసారి రుచి చూస్తే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. సొరకాయ పూరీలు తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Quick Healthy Bottle Gourd Puri A Must Try Sorakaya Poori Recipe for Fussy Eaters

కావలసిన పదార్థాలు

-గోధుమ పిండి
-సొరకాయ తురుము
-తరిగిన పచ్చిమిర్చి
-అల్లం పేస్ట్
-కొత్తిమీర తరుగు
-3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ
-1 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి
-వాము
-కారం పొడి
-పసుపు
-గరం మసాలా
-చిటికెడు ఇంగువ
-ఆమ్చూర్ పొడి లేదా చాట్ మసాలా
-రుచికి సరిపడా ఉప్పు
-వేయించడానికి సరిపడా నూనె

కల్తీ లేని స్వచ్ఛమైన బొంబాయి రవ్వ.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండిలా!

తయారీ విధానం

-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని, అందులో బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి బాగా కలపాలి. బొంబాయి రవ్వ కలపడం వల్ల పూరీలు చల్లారిన తర్వాత కూడా మెత్తబడిపోకుండా, ఎక్కువ సమయం పాటు ఉబ్బి కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో తురిమిన సొరకాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కొత్తిమీర, పైన పేర్కొన్న మసాలాలన్నీ వేసి పొడి పిండిలో బాగా కలపాలి.

-సొరకాయలో సహజంగానే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వెంటనే నీళ్ళు పోయకుండా ముందుగా సొరకాయ తురుముతోనే పిండిని కలపడానికి ప్రయత్నించండి. పిండి మరీ పొడిగా అనిపిస్తేనే, కొద్దికొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ పూరీ పిండిలా కాస్త గట్టిగా కలుపుకోవాలి. తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసి పూరీల మాదిరిగా ఒత్తుకోవాలి.

-ఇప్పుడు బాండీలో నూనె వేడి చేసి పూరీలను వేయాలి. గరిటెతో తేలికగా నొక్కుతూ రెండు వైపులా బంగారు రంగులోకి మారి, కరకరలాడేంత వరకు వేయించి తీస్తే వేడివేడి సొరకాయ పూరీలు రెడీ.

-ఈ కమ్మని, వేడివేడి మసాలా పూరీలను చల్లని పెరుగు, రుచికరమైన ఊరగాయ పచ్చడి లేదా మసాలా బంగాళాదుంప కూరతో వడ్డిస్తే పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఉదయం అల్పాహారంలోకైనా, సాయంత్రం స్నాక్స్ కోసమైనా ఇవి అద్భుతంగా ఉంటాయి.

[ of 5 - Users]
Story first published: Monday, November 23, 2026, 17:53 [IST]
Desktop Bottom Promotion