Latest Updates
-
చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది? శరీరంలో జరిగే పరిణామాలు ఇవే! -
క్రిస్పీ సొరకాయ పూరీలు.. ఒక్కసారి రుచి చూస్తే ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
కల్తీ లేని స్వచ్ఛమైన బొంబాయి రవ్వ.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండిలా! -
జిమ్ లేదు, ట్రెడ్ మిల్ లేదు.. ఇంట్లోనే నడిచి 14 కేజీలు తగ్గిన యువతి -
చుక్క నూనె, నెయ్యి లేకుండానే నోరూరించే రాజ్మా కర్రీ..ఈ ట్రిక్ తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటమి..వెంటనే 50 వీధి దీపాలు తొలగింపు..వీడియో చూడండి -
రోజుకు 2 స్పూన్లు చాలు..చలికాలంలో ఉక్కులాంటి బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్,సీడ్స్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
క్యాన్సర్ ముప్పును 80 శాతం తగ్గించే ఒకే ఒక్క పండు ఇదే -
అద్దిరిపోయే రుచితో కీమా చికెన్ సల్నా.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు!
ఓడియమ్మ: బాత్రూమ్ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక నిజమేదో, అబద్ధమేదో తేల్చుకోవడం పెద్ద సవాలుగా మారింది. తాజాగా ఇటలీలో జరిగిన వింత సంఘటన ఏఐ శక్తిని మరోసారి నిరూపించింది. ఓ తొమ్మిదేళ్ల బాలుడు సరదా కోసం ఏఐ యాప్ తో చేసిన చిన్న ప్రయోగం, ఏకంగా అగ్నిమాపక సిబ్బందిని, అటవీ అధికారులను రెండు రోజుల పాటు ఉరుకులు పరుగులు పెట్టించింది.
ఇటలీ స్థానిక వార్తా కథనం ప్రకారం, నవంబర్ 12న కాస్టెల్ ఫిడార్డో పట్టణంలో ఈ హైడ్రామా చోటుచేసుకుంది. ఆ రోజు తొమ్మిదేళ్ల బాలుడు తన స్నేహితుడి అపార్ట్ మెంట్ కు వెళ్లాడు. అక్కడ పిల్లలిద్దరూ సరదాగా ఆడుకుంటూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ బాలుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. బాత్రూమ్ లోకి వెళ్లిన అతడు, ఒక ఏఐ టూల్ సహాయంతో టాయిలెట్ నుండి ఒక భారీ కొండచిలువ బయటకు వస్తున్నట్లుగా ఫోటోకు జోడించి ఎడిట్ చేశాడు.

రెండు రోజుల పాటు తీవ్ర గాలింపు
చూసేందుకు అచ్చం నిజమైన ఫోటోలాగే కనిపించింది. బాలుడు దాన్ని పెద్దలకు చూపించగా, బాత్రూమ్ లోకి నిజంగానే కొండచిలువ ప్రవేశించిందని భావించిన వారు భయంతో వణికిపోయారు. వెంటనే అప్రమత్తమై ఓసిమో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అపార్ట్ మెంట్ కు చేరుకున్న సిబ్బంది ఇల్లంతా అణువణువూ గాలించినా సరీసృపం జాడ మాత్రం కనిపించలేదు. తెరిచి ఉన్న కిటికీలోంచి పాము బయటకు తప్పించుకుని ఉంటుందని వారు తొలుత అనుమానించారు. మరుసటి రోజు అరుదైన జాతుల పరిరక్షణలో నైపుణ్యం కలిగిన సీఐటీఈఎస్(CITES) విభాగానికి చెందిన అటవీ అధికారులు కూడా ఈ ఆపరేషన్ లో చేరడంతో గాలింపు మరింత ముమ్మరమైంది.

ఫోన్ చెకింగ్ తో వీడిన మిస్టరీ
రెండు రోజుల పాటు ఆ అపార్ట్ మెంట్ అంతా గాలించినా ఫలితం లేకపోవడంతో అధికారులకు అనుమానం మొదలైంది. తనిఖీల్లో భాగంగా అటవీ అధికారులు ఆ ఫోటోను నేరుగా బాలుడి ఫోన్ నుండే సేకరించి నిశితంగా పరిశీలించారు. అప్పుడే ఊహించని నిజం బయటపడింది. ఆ ఫొటోని అసలు కెమెరాతో తీయలేదని, ఏఐ ఉపయోగించి కల్పితంగా సృష్టించారని తేలింది. అధికారులు ఆ ఫోటో గురించి ప్రశ్నించగా, తాను ఏఐ అప్లికేషన్ ద్వారానే దాన్ని రూపొందించినట్లు బాలుడు నిజం ఒప్పుకున్నాడు.
దాదాపు 48 గంటల పాటు పట్టణమంతటినీ అప్రమత్తం చేసి, అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన తన ఆకతాయి పనికి ఆ బాలుడు క్షమాపణలు చెప్పాడు. మొత్తానికి ఆ పాము పూర్తిగా కల్పితమని తేలడంతో అగ్నిమాపక సిబ్బంది, అటవీ అధికారులు వెనుదిరిగారు. దీంతో స్థానికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. నేటి ఆధునిక ఏఐ టెక్నాలజీ చిన్నారుల చేతిలోనూ ఎంతటి నమ్మశక్యం కాని భ్రమలను సృష్టించగలదో ఈ వింత ఘటన ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది



Click it and Unblock the Notifications
