జిమ్ లేదు, ట్రెడ్‌ మిల్ లేదు.. ఇంట్లోనే నడిచి 14 కేజీలు తగ్గిన యువతి

ప్రస్తుత కాలంలో ఊబకాయం చాలా సాధారణ సమస్యగా మారింది. ఇది కేవలం మీ శారీరక రూపాన్ని దెబ్బతీయడమే కాకుండా, అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కారణమవుతుంది. చాలామంది బరువు తగ్గడానికి రకరకాల పద్ధతులు ప్రయత్నిస్తారు. కానీ ఫలితం త్వరగా కనిపించకపోవడంతో కొద్ది రోజులకే నిరుత్సాహపడి ఫిట్‌ నెస్‌ పై దృష్టి పెట్టడం మానేస్తారు.

అయితే ఫిట్‌ నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంబికా సాగర్ తన బరువు తగ్గే ప్రయాణంతో ఎందరికో గొప్ప స్ఫూర్తినిచ్చారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, కేవలం తన 2BHK ఫ్లాట్‌ లో నడుస్తూ ఆమె 14 కేజీలు బరువు తగ్గారు.

Ambika Sagar Inspiring Weight Loss Journey From 90 Kg to 77 Kg Just by Walking Inside Home

అంబికా సాగర్ బరువు తగ్గిన విధానం ఇదే

అంబికా సాగర్ ఇన్‌ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ లో..ప్రతిరోజూ 20000 అడుగులు నడవడం వల్ల తన బరువు 90 కేజీల నుండి 77 కేజీలకు తగ్గిందని ఆమె తెలిపారు. ట్రెడ్‌ మిల్ కూడా లేకుండానే, తన డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లోనే రోజువారీ నడక లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నట్లు తెలిపింది.

ప్రతిరోజూ 20,000 అడుగులు నడవడం తన బరువు తగ్గే ప్రయాణంలో గొప్ప మార్పును తెచ్చిందని అంబికా చెప్పారు. ఫిట్‌ నెస్‌ కు ఎల్లప్పుడూ ఖరీదైన పరికరాలు లేదా సంక్లిష్టమైన వ్యాయామాలు అవసరం లేదని ఇది నిరూపించిందని తెలిపారు. కొన్నిసార్లు చాలా సాధారణ అలవాట్లను కూడా నిలకడగా పాటిస్తే, అవి కూడా అద్భుతమైన మార్పును తీసుకురాగలవని ఆమె తెలిపింది.

క్యాన్సర్ ముప్పును 80 శాతం తగ్గించే ఒకే ఒక్క పండు ఇదేక్యాన్సర్ ముప్పును 80 శాతం తగ్గించే ఒకే ఒక్క పండు ఇదే

బరువు తగ్గడం అంటే పస్తులుండటం లేదా సులభ మార్గాల కోసం వెతకడం కాదని తన ప్రయాణం నేర్పిందని ఆమె చెబుతున్నారు. అది నిలకడ, క్రమశిక్షణ, ప్రతిరోజూ జీవనశైలిలో చేసుకునే చిన్న చిన్న మార్పుల గురించేనని వివరించారు. ఆలోచనాత్మకంగా తినడం, క్యాలరీల లోటులో ఉండటంతో పాటు నడవడం తనకు ఎంతగానో సహాయపడిందని తెలిపారు.

ఈ ప్రయాణంలో వచ్చిన అతిపెద్ద మార్పు కేవలం శారీరకమైనది మాత్రమే కాదని, తాను పొందిన ఆత్మవిశ్వాసం, నేర్చుకున్న ప్రేమ అన్నింటికంటే ముఖ్యమైనవని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. బరువు తగ్గాలనే బలమైన సంకల్పం ఉంటే మన చిన్న ఇల్లు కూడా అద్భుతమైన ఫిట్‌ నెస్ సెంటర్‌ గా మారుతుందని అంబికా సాగర్ నిరూపించారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, November 23, 2026, 14:30 [IST]
Desktop Bottom Promotion