Latest Updates
-
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..!
పొరపాటున కూడా ఎవరితో చెప్పకూడని కలలు.. లేదంటే తీవ్ర నష్టాలు తప్పవు.!
మనకి నిద్రలో తరచుగా కలలు వస్తుంటాయి. కొన్ని కలలు సంతోషాన్ని ఇస్తుంటే.. మరికొన్ని భయపెడుతుంటాయి. కొన్ని డ్రీమ్స్ తెల్లారిన తర్వాత అస్సలు గుర్తుండవు. ఇలా చాలా రకాలుగా మనకు అనభవాలు ఎదురవుతుంటాయి. అయితే కొందరికి తమ కలలను ఇతురులతో పంచుకోవడం అలవాటు. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం నాలుగు రకాల కలలను ఎవరితో చెప్పకూడదని హెచ్చరిస్తోంది. అలా చేస్తే చెడు శకునాలు ఎదురవుతాయని.. కుటుంబంలో ఇబ్బందులు వస్తాయని చెబుతోంది. ఇంతకీ ఏంటా కలలు ఇక్కడ చూద్దాం..

కలలో ప్రకృతి
స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో పర్వతాలు, నదులు, తోటలు, ప్రకృతి సౌందర్యం వంటివి వస్తే శుభసూచకంగా పరిగణించాలి. అలాంటి కలలు భవిష్యత్తులో ఏదో శుభకార్యం జరుగుతుందనే దానికి సంకేతం. మీకు ఈ విధమైన కలలు వస్తే ఎవరితో షేర్ చేసుకోవద్దు. లేదంటే మీ భవిష్యత్తుపై వాటి ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది.
ఆధ్యాత్మిక అనుభవం
మీరు నిద్రలో ఉన్నప్పుడు ఏదైనా ఆధ్యాత్మిక అనుభూతి కలిగినట్లు అనిపించినా, లేదంటే దైవం కనిపించినా అది సానుకూల సంకేతం. ఇలాంటి కలలను మీ మనసులోనే ఉంచుకోవాలి. ఇతరులకు చెప్పుకొన్నట్లయితే మీ ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలగడంతో పాటు కుంగుబాటుకి గురయ్యే ప్రమాదం ఉంది.
కలలో మరణం
స్వప్న శాస్త్రం ప్రకారం.. మీ కలలో మీరు లేదా ఎవరైనా చనిపోయినట్లు వస్తే అది శుభ సూచకం. మీరు జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలకు ముగింపు వస్తుందని భావించాలి. ఈ కలను ఇతరులతో చెప్పుకోకూడదు. అది అశుభానికి దారి తేసే ప్రమాదం ఉంది. దాని పర్యవసానాలు మీ కుటుంబంపై పడతాయి.
కలలో ధనం
మీరు కలలో డబ్బు చూడటం లేదా ఆస్తి సంపాదించడం, ఆర్థిక శ్రేయస్సు పొందడం లాంటివి అనుభూతి చెందినట్లయితే అది శుభసూచకంగా పరిగణించాలని స్వప్న శాస్త్రం చెబుతోంది. అలాంటి కలలను ఎవరితో పంచుకోకూడదు. ఇతరులతో చెప్పుకొన్నట్లయితే ఆ కలల సానుకూల ప్రభావం తగ్గిపోతుంది. దాని ఫలితం మీ ఆర్థిక పురోగతిలో ఆటంకాలు ఏర్పడతాయి. మీ కుటుంబలో సమస్యలు ఏర్పడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
