Latest Updates
-
రైలులో థర్డ్ ఏసీ ప్రయాణంపై కొడుకు ఫిర్యాదు.. జనరల్ కంపార్ట్మెంట్ కి తీసుకెళ్లిన తండ్రి.. వీడియో వైరల్ -
మేఘన చికెన్ బిర్యానీ.. అస్సలు మిస్ అవ్వకండి! -
కేవలం వారం రోజుల్లో బరువు తగ్గడం ఎలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. -
బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కు బెస్ట్..ఇంట్లోనే హై ప్రోటీన్ చపాతీ చేసుకోండిలా.. -
చలికాలంలో జలుబు, దగ్గు దరిచేరనివ్వని..ఇమ్యూనిటీని రెట్టింపు చేసే ఉసిరి చ్యవన్ ప్రాష్ ఎలా చేసుకోవాలంటే.. -
శీతాకాలపు పార్టీల్లో అతిగా తిని, తాగుతున్నారా? తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ ముప్పు! -
చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఆరోగ్యకరమైన నువ్వుల పట్టీ..ఇంట్లోనే ఇలా చేసుకోండి! -
ఒక్క లిప్ కిస్ ప్లీజ్.. విదేశీ యూట్యూబర్ తో మనోడు వెకిలి చేష్టలు, వీడియో చూడండి.. -
రాజస్థానీ పెరుగు వెల్లుల్లి చట్నీ.. ఇడ్లీ, దోశ, చపాతీలకు బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
ఆరోగ్యం, రుచి కలగలిసిన చలికాలం స్పెషల్..బీట్ రూట్ లడ్డూ ఇలా ఈజీగా చేసేయండి!
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే!
జ్యోతిష్య శాస్త్రంలో దేవగురువు బృహస్పతికి (గురు గ్రహం) అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆయన అనుగ్రహం ఉంటే జీవితంలో అపారమైన విజయాలు సిద్ధిస్తాయని జ్యోతిస్య పండితులు చెబుతుంటారు. అయితే 2026 అక్టోబర్ నెలలో ఆకాశంలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ నెలలో గురు గ్రహం తన రాశితో పాటు నక్షత్రాన్ని కూడా మార్చుకోనున్నాడు.
అక్టోబర్ 8వ తేదీన ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి ప్రవేశించే గురుడు, నెలచివరి నాటికి సింహరాశిలోకి అడుగుపెడతాడు. ఒకే నెలలో జరిగే గురుడి ఈ ద్వంద్వ సంచారం అత్యంత అద్భుతమైనదిగా పరిగణించబడుతోంది. దీని ప్రభావంతో ప్రధానంగా మూడు రాశుల వారికి ఈ సమయం ఒక సువర్ణావకాశంలా మారనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూడండి.

కర్కాటక రాశి
ఈ రాశి వారికి అక్టోబర్ నెల ఒక వరం లాంటిది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వృత్తిపరంగా మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు అద్భుతమైన సానుకూల ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు లాభాల పంట పండిస్తాయి. మీ ఉద్యోగ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ప్రభుత్వ లేదా పరిపాలనా రంగాల్లో ఉన్నవారికి ఊహించని ఉన్నతి కలుగుతుంది. ఇంట్లో పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు.
సింహ రాశి
ఏ పని చేపట్టినా అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. సొంతింటి కలను లేదా కొత్త వాహనం కొనుగోలు చేయాలనే కోరికను ఈ సమయంలో సులభంగా నెరవేర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, జీవితంలో విలాసాలు, సౌకర్యాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతూ ఆనందాన్ని ఆస్వాదిస్తారు. వృత్తిపరంగా ఇది అత్యుత్తమ సమయం.
తులా రాశి
మీ మాటతీరుతో, ప్రవర్తనతో నలుగురినీ ఇట్టే ప్రభావితం చేస్తారు. తండ్రి మరియు ఇంట్లోని పెద్దల ఆశీస్సులు, సహకారం మీకు అండగా నిలుస్తాయి. విద్యార్థులకు, ఉద్యోగులకు ఇది అత్యంత అనుకూల సమయం. సమాజంలో కొత్త పరిచయాలు మీ కెరీర్ ఎదుగుదలకు నిచ్చెనలా మారతాయి. వ్యాపారం సరైన దిశలో పరుగెడుతుంది. ఆఫీసులో మీ కీర్తిప్రతిష్టలు పెరిగి, మీ ప్రతిభకు తగ్గ కొత్త అవకాశాలు తలుపు తడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
