Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఆగస్టులో ఈ రాశుల వారికి లక్కే లక్కు.. పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఉందేమో తెలుసుకోండి
వేదజ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక, కలయిక, సంచారం, తిరోగమనం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఆగస్టు నెలలో పలు గ్రహాలు వివిధ రాశుల్లోకి సంచరించనున్నాయి. కొన్ని గ్రహాల కలయికలు, మరికొన్ని గ్రహాల తిరోగమ కదలికలు ఉంటాయి. కొన్ని అరుదైన యోగాలు, రాజయోగాలు, మహారాజయోగాలు ఏర్పడనున్నాయి. వీటి వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతంగా కలిసి రానుంది. వచ్చే నెలలో ఈ రాశుల వారు ఏ పని తలపెట్టినా అందులో విజయాన్ని అందుకుంటారు.
వీటన్నిటి ప్రభావం కొన్ని రాశుల వారికి అద్భుతంగా కలిసి రానుంది. దీని వల్ల ఈ రాశుల వారు ప్రత్యేకంగా లాభపడనున్నారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటే మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉండనుంది. వచ్చే నెలలో శ్రావణ మాసం కూడా ప్రారంభం కాబోతుంది. ఆగస్టు నెలలో ఏయే రాశుల వారికి లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథునరాశి:
ఆగస్టు నెలలో మిథున రాశి వారికి అద్భుతమైన సమయం. వారు కోరుకున్న కోర్కెలన్నీ నెరవేరుతాయి. వ్యాపారాలు చేసే వారు మంచి లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి. విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం. ఆగస్టు నెలలోని రెండో వారంలో విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభిస్తే మంచి ప్రయోజనాలు అందుకుంటారు. ఉద్యోగాలు చేసే వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. కష్టపడి పని చేసే వారికి ప్రయోజనాలు అందుకుంటారు. శ్రమించే వారికి పదోన్నతులు లభిస్తాయి. గ్రహాల స్థాన చలనం కారణంగా మిథున రాశి వారు లాభపడతారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కాలం కలిసిరానుంది. ఆగస్టు నెల అద్భుతంగా ఉండనుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రణాళికలతో చేపట్టే పనుల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆగస్టులో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్న వారికి సహోద్యోగుల నుంచి ఉన్నతోద్యోగుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ప్రమోషన్, శాలరీ హైక్ లభిస్తుంది. కోర్టు కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల ఫలితాలు వస్తాయి.
సింహ రాశి:
ఆగస్టు నెల సింహ రాశి వారికి కలిసి రానుంది. ఈ నెలలో అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. వృత్తి పనులు చేసే వారికి వ్యాపారాలు చేసే వారు సుదూర ప్రయాణాల వల్ల మంచి లాభాలు అందుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం కెరీర్ వృద్ధిలో ఉపయోగపడుతుంది. ఈ నెలలో సింహ రాశి వారు వ్యాపారాలు విస్తరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్నేహితుల మద్దతు లభిస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
