అనిరుధ్ - కావ్య మారన్ వెడ్డింగ్: గ్రీస్‌లోనే పెళ్లి ఎందుకు? అక్కడ ఉన్న ప్రత్యేకతలేంటి?

పాపులర్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీమ్ ఓనర్ కావ్య మారన్ ల పెళ్లి ఇవాళ గ్రీస్ లో జరుగుతుంది. రెండు రోజుల పెళ్లి వేడకలో భాగంగా నవంబర్ 10న హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగ్గా..నేడు ప్రధాన వివాహ వేడుక జరుగుతుంది. వీరి పెళ్లి కోసం గ్రీస్‌ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన శాంటోరిని సమీపంలో అత్యంత వైభవంగా ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం.

ఈ వేడుక కోసం మారన్ కుటుంబం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్, సూపర్‌ స్టార్ రజనీకాంత్‌లతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గ్రీస్ వెళ్లేందుకు ఏకంగా నాలుగు ప్రత్యేక విమానాలను కూడా సమకూర్చినట్లు తెలిసింది. వీరంతా ప్రత్యేక విమానాల్లో ఆల్రెడీ గ్రీస్ చేరుకున్నారు. అయితే చాలామంది సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలను కామెంట్ల రూపంలో లేవనెత్తుతున్నారు.

Anirudh Kavya Maran Marriage Why Celebrities Choose Greece for Destination Weddings

ఒకపక్క సాక్షాత్తూ ప్రధాని మోదీ మనదేశంలోనే వివాహ వేడుకలు జరుపుకోవాలని కోరుతున్న సమయంలో విదేశాల్లో ఇంత ఖర్చు పెట్టి పెళ్లి ఎందుకు, మనదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి అనేక అద్బుతమైన ప్లేస్ లు ఉన్నాయి కదా, పచ్చని పందిరి వేసి పెళ్లి చేసుకుంటే సూపర్ ఉండేది కదన్నా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నాయి. ఇదిలాఉంటే, అసలు చాలామంది తమ పెళ్లి కోసం గ్రీస్ ను ఎందుకు సెలక్ట్ చేసుకుంటున్నారు? అక్కడ అంత స్పెషల్ ఏం ఉందో ఇక్కడ చూడండి.

రొమాంటిక్ మూడ్ చెడిపోకూడదంటే.. ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ విషయాలు అస్సలు మాట్లాడకండిరొమాంటిక్ మూడ్ చెడిపోకూడదంటే.. ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ విషయాలు అస్సలు మాట్లాడకండి

డెస్టినేషన్ వెడ్డింగ్‌ కు గ్రీస్ ప్రత్యేకతలు

అనుకూలమైన వాతావరణం: గ్రీస్‌ లో సంవత్సరానికి దాదాపు 300 రోజులు ప్రకాశవంతమైన ఎండ ఉంటుంది. మధ్యధరా సముద్ర తీర ప్రాంతపు ఆహ్లాదకరమైన వాతావరణం ఆరుబయట (ఔట్ డోర్) వివాహ వేడుకలు జరుపుకోవడానికి చాలా అనువైనది.

అద్భుతమైన నేపథ్యం: నీలిరంగు సముద్రం, కొండ చివరన ఉండే తెల్లటి భవనాలు, పురాతన కట్టడాలు ఫొటోలకు ఎంతో అందాన్నిస్తాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ సూర్యాస్తమయ కాంతులు పెళ్లి ఫొటోలను జీవితాంతం గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాయి.

ప్రకృతి వైవిధ్యం: స్వచ్ఛమైన తీరప్రాంత బీచ్‌ లు, నీలి రంగు జలాలతో పాటు ప్రశాంతమైన పర్వత గ్రామాలు ఒకే చోట అలరిస్తాయి.

సంస్కృతి, ఆతిథ్యం: గ్రీక్ సంస్కృతిలో ఫిలోక్సేనియా (అపరిచితులను కూడా ఆత్మీయంగా ఆదరించడం) కు ప్రాధాన్యం ఉంటుంది.

వంటకాలు: తాజా సీ ఫుడ్, మాంసాహారంతో పాటు శాకాహారులకు కూడా విభిన్న రకాల రుచులు అందుబాటులో ఉంటాయి. స్థానిక వైన్లు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ కారణాల వల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం గ్రీస్‌ను ఎంచుకుంటున్నారు.

Story first published: Wednesday, November 11, 2026, 11:15 [IST]
Desktop Bottom Promotion