Latest Updates
-
తిరుమల శ్రీవారి ప్రసాదం మలహోర.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
అనిరుధ్ - కావ్య మారన్ వెడ్డింగ్: గ్రీస్‌లోనే పెళ్లి ఎందుకు? అక్కడ ఉన్న ప్రత్యేకతలేంటి? -
జింక్, కాల్షియం, విటమిన్ ఈ, ప్రొటీన్ పుష్కలంగా ఉండే లడ్డు ఇదే ..ఎలా చేసుకోవాలో చూడండి -
రొమాంటిక్ మూడ్ చెడిపోకూడదంటే.. ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ విషయాలు అస్సలు మాట్లాడకండి -
చలికాలంలో మాత్రమే దొరికే లక్నో ఫేమస్ మఖన్ మలై.. మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
వంటకు ఏ నూనె వాడితే ఆరోగ్యానికి మంచిది? -
జలుబు, దగ్గు పరార్.. కేవలం 5 నిమిషాల్లో ఆరోగ్యకరమైన వెల్లుల్లి కొత్తిమీర సూప్ చేసుకోండిలా.. -
భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సెల్యూట్స్ ఒకేలా ఎందుకు ఉండవో తెలుసా? -
చలికాలంలో ఏ రోటీలు తింటే ఆరోగ్యానికి మంచిది? సజ్జ, జొన్న, రాగి లేదా గోధుమ? -
రోజూ నిమ్మరసం తాగుతుంటే కిడ్నీ రాళ్లు రావా?
వైద్య రంగంలో సంచలనం..కొత్త యూరిన్ టెస్ట్ తో బ్లడర్ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తింపు!
క్యాన్సర్..ఈ పేరు వింటేనే గుండెల్లో దడ మొదలవుతుంది. ఈ మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించడం డాక్టర్లకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. కానీ కేవలం ఒక చిన్న మూత్ర పరీక్షతో క్యాన్సర్ ను పసిగట్టవచ్చంట. అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు అసాధ్యాన్ని ఓ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ సైన్స్ జర్నల్ నేచర్ మెడిసిన్ లో ప్రచురితమైన ఈ పరిశోధనా పత్రం ఇప్పుడు వైద్య లోకంలో పెను సంచలనం సృష్టిస్తోంది.
ఈ నూతన విధానం ద్వారా ప్రధానంగా మూత్రాశయ క్యాన్సర్ ను (Bladder Cancer) అత్యంత సులభంగా కనుక్కోవచ్చు. ఇప్పటికే 500 మందికి పైగా రోగులపై జరిపిన ప్రయోగాల్లో ఈ పరీక్ష ఏకంగా 95 శాతం ఖచ్చితత్వంతో క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ అద్భుత ప్రయోగానికి సంబంధించిన రెండవ దశ కూడా శరవేగంగా కొనసాగుతోంది.

ఇది సాధారణ పరీక్ష కాదు..
మనం చేయించుకునే సాధారణ మూత్ర పరీక్షలు కేవలం ఇన్ఫెక్షన్లను మాత్రమే పసిగట్టగలవు, క్యాన్సర్ కణాలను కాదు. కానీ ఈ సరికొత్త పరీక్ష తీరే వేరు. ఇది దాదాపు లిక్విడ్ బయాప్సీని పోలి ఉన్నప్పటికీ, పనిచేసే విధానం భిన్నంగా ఉంటుంది. సాధారణ లిక్విడ్ బయాప్సీలో రక్తం ద్వారా డీఎన్‌ఏ , ప్రోటీన్లను విశ్లేషించి క్యాన్సర్ ను గుర్తిస్తారు. అయితే ఈ కొత్త పరీక్ష డీఎన్‌ఏను కాకుండా మూత్రంలో ఉండే ఆర్ఎన్‌ఏ (రైబోన్యూక్లిక్ యాసిడ్) ఆధారంగా పనిచేస్తుంది.
కణాల గుట్టు విప్పే ఆర్ఎన్‌ఏ..
అసలు ఈ ఆర్ఎన్‌ఏ అంటే.. ఇది మన శరీరంలోని కణాలకు ఒక దూత)ః లాంటిది. కణాల లోపల ఏం జరుగుతోంది? జన్యుపరంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి? అనే రహస్య సమాచారాన్ని ఆర్ఎన్‌ఏ మోసుకెళ్తుంది. మూత్రాశయం (Bladder) లోని కణాలకు సంబంధించిన ఆర్ఎన్‌ఏ... సహజంగానే మూత్రంతో కలిసిపోతుంది.
ఒకవేళ మూత్రాశయంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతుంటే, ఆ ప్రమాదకరమైన సమాచారాన్ని కూడా ఈ ఆర్ఎన్‌ఏ తనతో పాటే బయటకు తీసుకొస్తుంది. శాస్త్రవేత్తలు సరిగ్గా ఇక్కడే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆ ఆర్ఎన్‌ఏను విశ్లేషిస్తారు. దీని ద్వారా క్యాన్సర్ ఉందా లేదా? ఉంటే అది ఏ దశలో ఉంది? భవిష్యత్తులో అది ఎంత వేగంగా వ్యాపిస్తుంది? అనే రోగి పూర్తి జాతకాన్ని డాక్టర్లు ఇట్టే చెప్పేస్తారు.

నొప్పి లేని పరిష్కారం..
ప్రస్తుతం మూత్రాశయ క్యాన్సర్‌ను గుర్తించాలంటే సిస్టోస్కోపీ, బయాప్సీ వంటి అత్యంత సంక్లిష్టమైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇవి రోగులకు శారీరకంగా తీవ్రమైన నొప్పిని, అసౌకర్యాన్ని గురిచేస్తాయి. ఇలాంటి తరుణంలో, ఎలాంటి నొప్పీ లేకుండా కేవలం మూత్ర నమూనాతోనే క్యాన్సర్ ను కచ్చితంగా గుర్తించడం అంటే రోగులకు ఇది ఒక పెద్ద వరం లాంటిదే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
