Latest Updates
-
నోరూరించే రుచి, ఆరోగ్యానికి మేలు..క్రీమీ పనీర్ నూడుల్స్ ఒక్కసారి రుచి చూశారంటే రోజూ ఇదే కావాలంటారు.. -
ఐరన్, ప్రోటీన్ నిండిన బలవర్థకమైన వేరుశెనగ చిక్కీ..చలికాలంలో బెస్ట్ హెల్తీ స్నాక్..ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్! -
వైద్య రంగంలో సంచలనం..కొత్త యూరిన్ టెస్ట్ తో బ్లడర్ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తింపు! -
తిరుమల శ్రీవారి ప్రసాదం మలహోర.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
అనిరుధ్ - కావ్య మారన్ వెడ్డింగ్: గ్రీస్లోనే పెళ్లి ఎందుకు? అక్కడ ఉన్న ప్రత్యేకతలేంటి? -
జింక్, కాల్షియం, విటమిన్ ఈ, ప్రొటీన్ పుష్కలంగా ఉండే లడ్డు ఇదే ..ఎలా చేసుకోవాలో చూడండి -
రొమాంటిక్ మూడ్ చెడిపోకూడదంటే.. ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ విషయాలు అస్సలు మాట్లాడకండి -
చలికాలంలో మాత్రమే దొరికే లక్నో ఫేమస్ మఖన్ మలై.. మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
వంటకు ఏ నూనె వాడితే ఆరోగ్యానికి మంచిది? -
జలుబు, దగ్గు పరార్.. కేవలం 5 నిమిషాల్లో ఆరోగ్యకరమైన వెల్లుల్లి కొత్తిమీర సూప్ చేసుకోండిలా..
నెల రోజులు నిల్వ ఉండే ఆరోగ్యకరమైన మరమరాల లడ్డు..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
స్వీట్ తినాలనిపిస్తోందా? అదీ ఆరోగ్యకరమైన, సంప్రదాయబద్ధమైన స్వీట్ అయితే ఇంకా బాగుంటుందనిపిస్తుందా? అయితే మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిన అద్భుతమైన రెసిపీ బొరుగుల లడ్డు. దీనిని ప్రాంతాలను బట్టి మరమరాల లడ్డు లేదా పేలాల లడ్డు అని పిలుస్తారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఎంతగానో ఇష్టపడే ఈ కరకరలాడే లడ్డును ఇంట్లోనే చాలా సులువుగా, అచ్చం స్వీట్ షాప్ రుచితో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
మరమరాలు (బొరుగులు) - 2 కప్పులు
బెల్లం - అర కప్పు
నీళ్లు - పావు కప్పు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - చిటికెడు
బియ్యం పిండి - కొద్దిగా

తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో పావు కప్పు నీళ్లు పోసి, అందులో అర కప్పు బెల్లం వేసి కరిగించండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, అందులో ఉండే నలకలు, ఇసుక వంటి మలినాలు పోవడానికి ఒక వడకట్టే జల్లెడ సహాయంతో ఆ నీటిని వేరే మందపాటి గిన్నెలోకి వడకట్టుకోండి.
-ఇప్పుడు ఆ స్వచ్ఛమైన బెల్లం నీటిని స్టవ్ మీద పెట్టి మరిగించడం ప్రారంభించండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ కమ్మటి నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి బాగా మరిగించండి. ఉప్పు వేయడం వల్ల లడ్డు రుచి అద్భుతంగా రెట్టింపు అవుతుంది.
-లడ్డు పర్ఫెక్ట్ గా రావాలంటే పాకం చాలా ముఖ్యం. ఒక చిన్న ప్లేట్ లో నీళ్లు తీసుకుని, అందులో కొద్దిగా బెల్లం పాకం వేసి చూడండి. అది నీళ్లలో కరిగిపోకుండా, చేత్తో పట్టుకుంటే గట్టి ఉండలా మారాలి. ఆ ఉండను వేళ్లతో నొక్కితే ఆకారం కోల్పోకూడదు. ఇదే సరైన ముదురు పాకం.
-వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు రెండు కప్పుల తాజా మరమరాలను ఆ పాకంలో వేసి, బెల్లం ప్రతి మరమరానికి బాగా పట్టేలా గరిటెతో వేగంగా కలపండి.
జింక్, కాల్షియం, విటమిన్ ఈ, ప్రొటీన్ పుష్కలంగా ఉండే లడ్డు ఇదే ..ఎలా చేసుకోవాలో చూడండి
-ఇప్పుడు మీ చేతులకు కొద్దిగా బియ్యం పిండిని అద్దుకోండి. మిశ్రమం పూర్తిగా చల్లారకముందే మీకు నచ్చిన సైజులో గుండ్రని లడ్డూల్లా గట్టిగా నొక్కుతూ చుట్టుకోండి. వేడి చల్లారితే లడ్డూలు చుట్టడం కష్టమవుతుంది, కాబట్టి ఈ పని కాస్త వేగంగా చేయాలి.
-వీటిని గాలికి పూర్తిగా చల్లారనివ్వండి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరోరించే కరకరలాడే మరమరాల లడ్డూలు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
