Latest Updates
-
ఐరన్, ప్రోటీన్ నిండిన బలవర్థకమైన వేరుశెనగ చిక్కీ..చలికాలంలో బెస్ట్ హెల్తీ స్నాక్..ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్! -
వైద్య రంగంలో సంచలనం..కొత్త యూరిన్ టెస్ట్ తో బ్లడర్ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తింపు! -
తిరుమల శ్రీవారి ప్రసాదం మలహోర.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
అనిరుధ్ - కావ్య మారన్ వెడ్డింగ్: గ్రీస్లోనే పెళ్లి ఎందుకు? అక్కడ ఉన్న ప్రత్యేకతలేంటి? -
జింక్, కాల్షియం, విటమిన్ ఈ, ప్రొటీన్ పుష్కలంగా ఉండే లడ్డు ఇదే ..ఎలా చేసుకోవాలో చూడండి -
రొమాంటిక్ మూడ్ చెడిపోకూడదంటే.. ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ విషయాలు అస్సలు మాట్లాడకండి -
చలికాలంలో మాత్రమే దొరికే లక్నో ఫేమస్ మఖన్ మలై.. మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
వంటకు ఏ నూనె వాడితే ఆరోగ్యానికి మంచిది? -
జలుబు, దగ్గు పరార్.. కేవలం 5 నిమిషాల్లో ఆరోగ్యకరమైన వెల్లుల్లి కొత్తిమీర సూప్ చేసుకోండిలా.. -
భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సెల్యూట్స్ ఒకేలా ఎందుకు ఉండవో తెలుసా?
నోరూరించే రుచి, ఆరోగ్యానికి మేలు..క్రీమీ పనీర్ నూడుల్స్ ఒక్కసారి రుచి చూశారంటే రోజూ ఇదే కావాలంటారు..
రుచికరమైన ఆహారం తినాలంటే కచ్చితంగా ఆరోగ్యాన్ని పక్కన పెట్టాల్సిందేనేమో అని డైటింగ్ చేసే చాలామంది అనుకుంటారు. కానీ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఈ రెండూ ఒకే వంటకంలో దొరికితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన రెసిపీనే క్రీమీ పనీర్ నూడుల్స్. ఇది తింటే క్యాలరీలు పెరుగుతాయేమో అన్న భయం అక్కర్లేదు. పైగా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. ఒక్కసారి దీన్ని రుచి చూశారంటే ప్రతిరోజూ ఇదే కావాలంటారు. నోరూరించే క్రీమీ పనీర్ నూడుల్స్ మీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
పనీర్ - 200 గ్రాములు
పచ్చి ఉల్లిపాయలు (స్ప్రింగ్ ఆనియన్స్) - 2 లేదా 3
పాలు - అర కప్పు
నీళ్లు - పావు కప్పు
చిల్లీ ఆయిల్ - 2 టీస్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 6
అల్లం - ఒక అంగుళం ముక్క
చక్కెర - 1 టీస్పూన్
సోయా సాస్ - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
వెజిటబుల్ స్టాక్ - తగినంత
ఉప్పు, మిరియాల పొడి - రుచికి సరిపడా
నూడుల్స్ - తగినంత
తెల్ల నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం
-ముందుగా ఒక 100 గ్రాముల పనీర్ ను తీసుకుని వేడి నీళ్లలో కాసేపు నానబెట్టండి. మరోవైపు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు మరిగించి నూడుల్స్ ను ఉడికించండి. నూడుల్స్ ఉడికిన తర్వాత నీటిని వడకట్టి, ఆ నీటిని పారబోయకుండా కొద్దిగా పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు నానబెట్టిన పనీర్ ను మిక్సీ జార్ లో వేసి, అందులో అర కప్పు పాలు, ముందుగా పక్కన పెట్టుకున్న నూడుల్స్ వాటర్ కొద్దిగా పోసి మెత్తని క్రీమీ సాస్ లా మిక్సీ పట్టుకోండి.
-ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టి ఒక చెంచా నూనె వేయండి. మిగిలిన 100 గ్రాముల పనీర్ ను సన్నగా తురిమి అందులో వేయండి. మంటను తక్కువగా ఉంచి మెల్లగా కలుపుతూ, దానిపై కొద్దిగా చిల్లీ ఆయిల్ చల్లండి. పనీర్ మంచి రంగు వచ్చి, కరకరలాడేలా (క్రిస్పీగా) వేయించుకుని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.
-అదే పాన్ లో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం తరుగు, పచ్చి ఉల్లిపాయల తరుగు వేసి సన్నని మంట మీద దోరగా వేయించండి. ఇవి పచ్చివాసన పోయి లేత గోధుమ రంగులోకి మారగానే.. ఒక టీస్పూన్ ధనియాల పొడి, వెజిటబుల్ స్టాక్ వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఒక టీస్పూన్ చిల్లీ ఆయిల్, చక్కెర, సోయా సాస్, కొద్దిగా నూడుల్స్ వాటర్ వేసి అన్నీ కలిసేలా బాగా తిప్పండి.
జింక్, కాల్షియం, విటమిన్ ఈ, ప్రొటీన్ పుష్కలంగా ఉండే లడ్డు ఇదే ..ఎలా చేసుకోవాలో చూడండి
-ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న క్రీమీ పనీర్ సాస్ ను ఇందులో వేసి కలపండి. రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి మిశ్రమాన్ని మరగనివ్వండి. ఈ క్రీమీ గ్రేవీ బాగా మరుగుతున్నప్పుడు, ముందుగా ఉడికించిన నూడుల్స్ వేసి సాస్ అంతా నూడుల్స్‌కు పట్టేలా బాగా కలపండి. రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే నోరూరించే వేడి వేడి క్రీమీ పనీర్ నూడుల్స్ రెడీ.
-వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని, పైన మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్రిస్పీ పనీర్ తురుము, కొద్దిగా తెల్ల నువ్వులు, స్ప్రింగ్ ఆనియన్స్ చల్లి వడ్డించండి. క్యాలరీల భయం లేకుండా, ఈ అద్భుతమైన, ఆరోగ్యకరమైన ప్రోటీన్ రిచ్ వంటకాన్ని తింటుంటే ఆహా ఓహో అనక మానరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
