Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కర్మ ఫలదాత, న్యాయాధికారిగా పరిగణించడే శని దేవుడు ఈ ఏడాది జూలై 27, సోమవారం నాడు మీనరాశిలో తన వక్రగమనాన్ని (తిరోగమనం) ప్రారంభించబోతున్నాడు. డిసెంబర్ 11 వరకు, అంటే దాదాపు 138 రోజుల పాటు శని ఇదే స్థితిలో ఉంటాడు. శని తిరోగమనంలో ఉన్నప్పుడు గతంలో మనం వదిలేసిన, లేదా అసంపూర్ణంగా వదిలేసిన పనులు మళ్లీ మన ముందుకు వస్తాయి. మన తప్పులను సరిదిద్దుకునే అవకాశంతో పాటు కఠినమైన పరీక్షలను కూడా ఈ కాలం తీసుకువస్తుంది.

జ్యోతిషశాస్త్ర నిపుణుల ప్రకారం, ఈ 138 రోజుల శని తిరోగమన కాలంలో ప్రధానంగా 5 రాశుల వారు తమ కెరీర్, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. అనుకున్న ప్రణాళికలు విఫలం కావడం, అప్పుల పాలు కావడం వంటివి జరగవచ్చు. ఆ ఐదు రాశులు ఏమిటి? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూడండి.
మిథున రాశి
ఈ సమయంలో మీ వృత్తి జీవితం ఒక అగ్నిపరీక్షలా మారవచ్చు. ఆఫీసులో పనిభారం పెరుగుతుంది, మీ బాస్ మీ నుంచి మరింత మెరుగైన ఫలితాలను ఆశిస్తారు. మీ బాధ్యతల్లో కీలకమైన మార్పులు రావచ్చు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఉద్యోగానికే ముప్పు రావచ్చు కాబట్టి, మీ తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోండి. సులభంగా డబ్బు సంపాదించే మార్గాలకు, షేర్ మార్కెట్ వంటి రిస్క్ తో కూడిన పెట్టుబడులకు ఈ కాలంలో పూర్తిగా దూరంగా ఉండటం బెటర్.
సింహ రాశి
శని వక్రగమనం సింహ రాశి వారి ఆర్థిక మూలాలను కదిలించే అవకాశం ఉంది. పన్నులు, బీమా, జాయింట్ అకౌంట్స్, అప్పుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. గతంలో మీరు విస్మరించిన పాత ఆరోగ్య, ఆర్థిక సమస్యలు ఇప్పుడు మళ్లీ తలెత్తి మీపై తీవ్ర ఒత్తిడిని పెంచుతాయి. వ్యాపారంలో ఎలాంటి రహస్య ఒప్పందాలు, అనుమానాస్పద భాగస్వామ్యాలకు అంగీకరించవద్దు. ప్రతి రూపాయి విషయంలో పారదర్శకంగా ఉండండి.
కన్య రాశి
వ్యాపారాలు చేసే కన్య రాశి వారు ఈ కాలంలో కొత్త కాంట్రాక్టులు, క్లయింట్ల విషయంలో సవాళ్లను ఎదుర్కొంటారు. ప్రస్తుతానికి కొత్త పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనను విరమించుకోవడం మంచిది. ఏదైనా పత్రంపై సంతకం చేసే ముందు ఒకటికి పదిసార్లు చదువుకోండి. ఉద్యోగులు ఆఫీసు రాజకీయాలకు, సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు ఎంత దూరంగా ఉంటే మీ కెరీర్ కు అంత మంచిది.
ధనుస్సు రాశి
ఇల్లు, ఆస్తి వివాదాలు, కుటుంబ బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కుటుంబ పరిస్థితుల కారణంగా మీ వృత్తిపరమైన నిర్ణయాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కొత్త ఆస్తి, వాహనం కొనాలన్నా లేదా ఇల్లు మారాలన్నా డాక్యుమెంట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. భావోద్వేగాలకు లోనై వ్యాపార, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరమైన అప్పులు చేస్తే ఊబిలో కూరుకుపోతారు, కాబట్టి మీ పొదుపు ఖాతాను జాగ్రత్తగా కాపాడుకోండి.

మీన రాశి
సాక్షాత్తూ శని దేవుడు మీ రాశిలోనే తిరోగమనం చెందుతున్నాడు కాబట్టి ఈ ప్రభావం మీపై నేరుగా ఉంటుంది. మీ ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం క్షీణించవచ్చు. మీ భవిష్యత్తు లక్ష్యాలపై మీకే గందరగోళం ఏర్పడవచ్చు. పనుల్లో జాప్యం లేకుండా చూసుకోండి, సమయపాలన పాటించండి. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సరైన నిద్ర, ఆచరణాత్మకమైన ప్రణాళికలు మాత్రమే ఈ గడ్డు కాలం నుంచి మిమ్మల్ని బయటపడేస్తాయి.
శని తిరోగమన సమయంలో చేయకూడని పనులు
-కెరీర్ లేదా డబ్బు కోసం అడ్డదారులు తొక్కకండి, అబద్ధాలు చెప్పకండి.
-పెద్దలను, కళాకారులను, వికలాంగులను, కార్మికులను పొరపాటున కూడా అగౌరవపరచవద్దు.
-పన్నులు, చట్టపరమైన సమస్యలు, అప్పుల చెల్లింపుల డాక్యుమెంట్లు దాచిపెట్టడం లేదా వాటిని ఆలస్యం చేయడం వంటివి చేయకండి.
-విచ్చలవిడి ఖర్చులకు పోకండి, మీ రోజువారీ బాధ్యతలను ఏమాత్రం విస్మరించకండి.
Disclaimer: నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని నిరూపించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని నమ్మడం, పాటించడం అనేది వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications
