Latest Updates
-
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా?
రేవతీ నక్షత్రంలోకి శని సంచారం..ఈ 5 రాశులకు మహర్దశ.. మీ రాశి ఫలం ఇప్పుడే చెక్ చేసుకోండి..
గ్రహాలన్నింటిలోకెళ్లా శని గ్రహం చాలా స్పెషల్. మంచికి మంచి చెడు చెడు స్టైల్ లో శని భగవానుడు ఫలితాలను అందిస్తుంటాడు. అందుకే శనీశ్వరుడిని న్యాయాధికారి అని పిలుస్తుంటారు. శని దేవుడు ఇవాళ అంటే 2026 ఆగస్టు 20 సాయంత్రం 7:45 గంటలకు రేవతీ నక్షత్రం రెండవ పాదం నుండి మొదటి పాదంలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 9, 2026 వరకు శని ఇదే స్థితిలో కొనసాగి, ఆ తర్వాత ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి అడుగుపెడతాడు.
సాధారణంగా శని కదలికలు కొందరికి సవాళ్లను తెచ్చిపెట్టినా, ఈ రేవతీ నక్షత్ర సంచారం మాత్రం కొన్ని రాశుల వారి పాలిట కల్పవృక్షంలా మారనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూడండి.

వృషభ రాశి
ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు శని దేవుడికి పరమ మిత్రుడు. కాబట్టి ఈ నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి అఖండ విజయాలను తీసుకురానుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో సరికొత్త బాధ్యతలు అప్పగిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. మీ అద్భుతమైన పనితీరుకు గాను ప్రమోషన్లు, జీతాల పెంపు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి మంచి ఆఫర్లు తలుపు తడతాయి.
మిథున రాశి
శని రేవతీ నక్షత్ర ప్రవేశం మిథున రాశి వారికి విశేష ప్రయోజనాలను చేకూర్చనుంది. ఇన్నాళ్లుగా నిబద్ధతతో మీరు పడ్డ కష్టానికి తగిన అద్భుత ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. సరికొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు అనూహ్యంగా పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త లాభదాయకమైన ఒప్పందాలు ఖరారు చేసుకుని ఆర్థికంగా స్థిరపడతారు.
తులా రాశి
మీరు ఎప్పటి నుంచో సాధించాలనుకుంటున్న కెరీర్ లక్ష్యాలు ఇప్పుడు నెరవేరుతాయి. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ హోదా, గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. మీరు చేసే పనులు భవిష్యత్తులో గొప్ప ప్రయోజనాలను ఇస్తాయి. పెండింగ్ లో ఉన్న బకాయిలు, ఆగిపోయిన డబ్బులు చేతికి అందడం వల్ల నెలాఖరుకల్లా మీ ఆర్థిక స్థితి అత్యంత దృఢంగా మారుతుంది.
మకర రాశి
శని దేవుడే ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతాయి. వృత్తిపరంగా ఎదురైన సవాళ్లు, ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాలలో వ్యాపారం చేసే వారికి, ప్రాజెక్టులు నిర్వహించే వారికి లాభాలు వస్తాయి. పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. ఒంటరిగా ఉన్నవారి జీవితంలోకి ప్రేమ చిగురించి, సరైన జీవిత భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంది.
కుంభ రాశి
శని నక్షత్ర మార్పు కుంభ రాశి వారికి ఆర్థికంగా మహర్దశ పట్టిస్తుంది. వ్యాపారులు తమ అమ్మకాలను పెంచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారు పటిష్టమైన వ్యూహాలతో ముందుకు వెళ్తే అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన ఫలితాలను చూస్తారు. జీవిత భాగస్వామితో ప్రేమ, అనుబంధం మరింత బలపడతాయి. వారి ఆదాయం కూడా పెరగడం వల్ల ఎలాంటి పెద్ద ఖర్చులైనా ఇట్టే భరించే వెసులుబాటు కలుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
