Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
షష్ రాజయోగంను ఏర్పరుస్తున్న శని సంచారం, ఈ 4 రాశుల వారికి అదృష్టం
వేదజ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక మంచి లేదా చెడు ప్రభావాలను చూపిస్తుంది. అలాగే ప్రతి గ్రహం కూడా ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. ఈ గ్రహాల సంచారం వివిధ రాజయోగాలను ఏర్పరుస్తుంది. అలా శని సంచారం వల్ల షష్ రాజయోగం ఏర్పడుతుంది. నవగ్రహాల్లో నిదానంగా కదిలే గ్రహం శని. శని రెండున్నరేళ్లకోసారి రాశులను మారుస్తాడు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత శని ఇప్పుడు సొంత రాశి అయిన కుంభ రాశిలో వక్రమార్గంలో సంచరిస్తున్నాడు. శని తిరోగమనం కొంతమంది స్థానికులకు ఇబ్బందులను తెచ్చిపెట్టనుంది. శని నవంబర్ 4 వరకు తిరోగమనంలో ఉంటుంది. ఆ తర్వాత శని సరళ రేఖలో కదలడం ప్రారంభమవుతుంది.

ఈ శని సంచారం వల్ల షష్ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం 4 రాశుల వారికి మంచి ఫలితాలను అందించనుంది. ఈ రాశుల వారు ఆర్థిక లాభాలు అందుకోనున్నారు. జీవితంలో పురోగతి లభించనుంది. ఏ పని తలపెట్టినా అందులో విజయం అందుకుంటారు. ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి
శని ప్రత్యక్ష సంచారం వల్ల మేష రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. షష్ రాజయోగం మేషరాశి వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. కోర్కెలు నెరవేరుతాయి. కెరీర్ లో మంచి పురోగతిని సాధిస్తారు. మంచి మంచి అవకాశాలను అందుకుంటారు. వాటిలో విజయం సాధిస్తారు. జీతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పదోన్నతి లభించే అవకాశాలున్నాయి. ఆర్థికంగా చాలా మంచి సమయం. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి. వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండనుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఈ షష్ రాజయోగం వల్ల అవివాహితులకు సంబంధాలు ఖాయం అవుతాయి.
సింహరాశి
శని సంచారం సింహ రాశి వారికి మంచి చేస్తుంది. షష్ రాజయోగం వల్ల అత్యధికంగా లాభపడేది సింహ రాశి వారే. జీవితంలో ఆనందం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం మెరుగుపడుతుంది. దంపతుల మధ్య కలహాలు లేకుండా ఆనందమైన, హాయి అయిన జీవితాన్ని గడుపుతారు. వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా చాలా లాభాలు కనిపిస్తున్నాయి. దేనిలోనైనా విజయం సులభంగా సొంతం అవుతుంది.
మకరరాశి
మకర రాశి వారి శని సంచారం అద్భుతమైన సమయాన్ని సృష్టించనుంది. ఈ కాలంలో గణనీయమైన ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు, సహోద్యోగులు, ఉన్నతోదోగ్యుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో చేపట్టే ప్రాజెక్టుల్లో విజయం అందుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి.. పరిస్థితి మెరుగుపడుతుంది.
కుంభరాశి
శని ప్రత్యక్ష సంచారం కుంభరాశి వారికి చాలా శుభాన్ని తీసుకువస్తుంది. కుంభ రాశికి అధిపతి శని అయినందువల్ల ఈ సమయంలో వారికి చాలా అనుకూలంగా ఉండనుంది. షష్ రాజయోగం కుంభరాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆర్థిక లాభం చేకూరుతుంది. ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications