బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది?

చాలా సందర్భాల్లో పిల్లలకు బాగోలేనప్పుడు లేదా పెద్దవాళ్లు అనారోగ్యంతో హాస్పిటల్ కు వెళ్లినప్పుడు డాక్టర్ మీకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పడం చూస్తుంటాం. బ్లడ్ ఇన్ఫెక్షన్ పేరు వినగానే చాలామంది తెగ కంగారు పడిపోతుంటారు. అయితే కానీ భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి గుర్తించి సరైన మెడిసిన్స్ వాడటం స్టార్ట్ చేస్తే పూర్తిగా కోలుకోవచ్చు.

ఆలస్యం చేస్తే మాత్రం ప్రమాదం ఉంటుందని ప్రముఖ పీడియాట్రిషన్ డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ తన ఇన్ ప్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పారు. అసలు బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటీ? ఎందుకు వస్తుంది? బ్లడ్ ఇన్ఫెక్షన్ అని ఎలా తెలుసుకోవచ్చో ఆయన సూచించారు.

What is blood infection causes and how to identify blood infection

బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటీ?

రక్తంలోకి బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ చేరితే దాన్ని బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటారు. దీనిని వైద్య బాషలో సెప్సిస్ అంటారు.

బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది

సాధారణంగా శరీరంలో ఇమ్యూనిటీ(వ్యాధి నిరోధక శక్తి)వీక్ అయినప్పుడు లేదా ఇతర అనారోగ్య సమస్యల వల్ల రక్తంలోకి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ప్రధాన కారణాలు ఏంటంటే..

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్(ప్నీమోనియా)వల్ల: న్యుమోనియా ప్రాబ్లమ్ సీరియస్ అయినప్పుడు లంగ్స్ లోకి క్రిములు రక్తప్రవాహంలోకి ఈజీగా చేరుకునే అవకాశం ఉంటది.

మూత్ర ఇన్ఫెక్షన్ వల్ల: మూత్రపిండాల(కిడ్నీలు)ఇన్ఫెక్షన్లు ముదిరాయంటే అవి రక్తంలో వ్యాపించే ప్రమాదం కూడా ఉంటదట.

శరీరంలో గాయాల ద్వారా: మన శరీరానికి ఏదైనా పెద్ద గాయం అయినప్పుడు లేదా ఆపరేషన్ జరిగిన చోట సరిగ్గా మానకపోయినా కూడా బ్యాక్టీరియా చేసి ఇన్ఫెక్షన్ సోకే ఛాన్స్ ఉంటది.

పుట్టిన బిడ్డల్లో నాభి ఇన్ఫెక్షన్ వల్ల: అప్పుడే పుట్టిన పిల్లలో బొడ్డు దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంటది.

కడుపులో ఇన్ఫెక్షన్ రక్తంలో వ్యాపిస్తే: మన కడుపులో వచ్చే పేగుల ఇన్ఫెక్షన్లు, అపెండిసైటిస్, అల్లర్లు వంటి తీవ్రరూపం దాల్చి బ్లడ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇలా ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరితే బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది.

సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా..సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా..

బ్లడ్ ఇన్ఫెక్షన్ అని మీకు ఎలా తెలుసుకోవచ్చు

సాధారణంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినట్లు తెలుపబడే కొన్ని లక్షణాలు మనకు కబడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

-జ్వరం లేదా హై ఫీవర్
-బిడ్డ తినడం తగ్గిపోవడం
-బలహీనంగా, మత్తుగా ఉండటం
-శ్వాస వేగంగా ఉండటం
-చేతులు, కాళ్లు చల్లగా అవ్వడం

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, October 17, 2026, 12:48 [IST]
Desktop Bottom Promotion