Latest Updates
-
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా..
ఈ రోజు సూర్య గోచారం.. ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.!
గ్రహాలకు రాజు సూర్యుడు. జీవితంలో కష్టసుఖాలు సాధారణమే అంటూ సూర్యుడి వెలుగు, చీకటి అద్దం పడుతుంది. అదేవిధంగా మన జీవితంలో ప్రతి కదలిక గ్రహాల గోచారం, రాశులు, సూర్య, చంద్రుల ప్రభావంపైన ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్రం చెబుతోంది. ఈ క్రమంలో ఈ రోజు సూర్య గోచారం కారణంగా 4 రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

సూర్యుడు ఆత్మవిశ్వాసం, నాయకత్వం, కీర్తి, పరిపాలన, పితృత్వం, గౌరవానికి ప్రతీక. అందుకే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేసినప్పుడల్లా అది 12 రాశులనూ ప్రభావితం చేస్తుందని జ్యోతిష్యం చెబుతోంది. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ మేరకు ఈ రోజు సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచరిస్తున్న కారణంగా కొన్ని మార్పులు జరగనున్నాయి.
కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి ఉంటాడు. అంతేకాకుండా సూర్యచంద్రులకు ఈ రాశితో స్నేహపూర్వక సంబంధం ఉందని జ్యోతిష్యం చెబుతోంది. ఈ క్రమంలో సూర్యుడి సంచారం కొన్ని రాశుల వారికి వృత్తి, ఆర్థిక స్థితి, సామాజిక హోదా పరంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి
సూర్య సంచారం ద్వారా కర్కాటక రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయని జ్యోతిష్యం చెబుతోంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తిపరంగా ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు శుభవార్త వినవచ్చు. కుటుంబంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. సమాజంలో మీకు గౌరవం పెరగనుంది.

సింహ రాశి
సూర్య గ్రహ సంచారం సింహ రాశి వారికి చాలా విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా పదోన్నతులు వంటి కొత్త మైలురాళ్లను చేరుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి సూర్య గోచారం లాభసాటిగా ఉంటుంది. పలు కీలక ఒప్పందాలు చేసుకుంటారు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, అక్కడ ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు గుడ్ న్యూస్ వింటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఖర్చుల విషయంలో అనవసరమైన వాటి జోలికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
వృశ్చికం
మిథున రాశి కర్కాటక రాశికి సూర్య గోచార సమయం వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. వారికి అదృష్టం తలుపు తడుతుంది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా కొత్త మలుపు తీసుకుంటారు. తద్వారా పురోగిత లభిస్తుంది. ప్రాజెక్టుల విషయంలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఫలితంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరింత ఉత్సాహంగా పనిచేస్తారు.
ధనుస్సు రాశి
సూర్య గోచారం ధనుస్సు రాశి వారి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా కొత్త అవకాశాలు, బాధ్యతలు అందుకుంటారు. పదోన్నతులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో మీకు లాభం కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన ఒప్పందాలు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
