Latest Updates
-
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు!
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.!
ఈ రోజే రాఖీ పౌర్ణమి. తోబుట్టువుల మధ్య అనురాగం, ఆప్యాయత, రక్షణకి చిహ్నంగా నిలిచే ఈ పండుగ రోజున ఉదయాన్నే పూజ చేసి భగవంతుడి దగ్గర పెట్టిన రాఖీలను సోదరులకు బొట్టుపెట్టి వారి మణికట్టుకి కట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ క్రమంలో అన్నాదమ్ముళ్లకి రాఖీ కట్టేందుకు రకరకాల రాఖీలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే ఎలాంటి రాఖీ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా.. మీ సోదరుడి రాశిచక్రం ప్రకారం కొన్ని రకాల రాఖీలు సెలెక్ట్ చేసుకోవచ్చని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. మరి మీ సోదరుడిది ఏ రాశి.. ఎలాంటి రాఖీ కట్టవచ్చో ఇక్కడ చూద్దాం..

మేషరాశి
మేష రాశి వారికి అధిపతి కుజుడు కాగా.. వీరికి ఎర్ర రాఖీ కట్టి, నుదుటిపై కుంకుమ తిలకం దిద్దండి. రాఖీ కట్టిన తర్వాత గోధుమ పిండి, బెల్లంతో చేసిన స్వీట్ తినిపించండి. దీని ద్వారా వారు చేసే ప్రతిపనిలో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశికి శుక్రుడు అధిపతి కాగా.. ఈ రాశి వారికి తెల్లని పట్టు దారంతో రాఖీ కట్టి కుంకు తిలకం పెట్టండి. అనంతరం పాలతో చేసిన మిఠాయిలు తినిపించండి. ఇది వారికి మనశ్శాంతిని కలుగజేస్తుంది.
మిథునం
మిథున రాశిలో పుట్టిన మీ సోదరులకు ఆకుపచ్చ రాఖీ కట్టండి. ఈ రాశి వారికి బుధుడు అధిపతి. రాఖీ కట్టిన తర్వాత శనగపిండితో చేసిన మిఠాయిలు తినిపించండి. ఇది మీ సోదరుడికి దీర్ఘాయువు, శ్రేయస్సును అందిస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి కాబట్టి ఈ రాశిలో పుట్టిన మీ సోదరులకు ప్రకాశవంతమైన తెల్లటి రాఖీ కట్టండి. వారి నుదుటిపై చందన తిలకం దిద్దండి. పాయసం వంటి పాలతో చేసిన స్వీట్ పెట్టండి. ఇది మీ మధ్య భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుంది.

సింహ రాశి
సింహ రాశికి సూర్యుడు అధిపతి. ఈ రాశిలో జన్మించిన మీ సోదరులకు బంగారు పసుపు రంగు రాఖీ కట్టండి. పసుపుతో కలిపిన కుంకుమ తిలకం దిద్దండి. ఇది వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు తీసుకువస్తుంది.
కన్యారాశి
కన్యారాశిలో పుట్టిన మీ సోదరులకు గణేశుడి చిహ్నం ఉన్న రాఖీ కట్టండి. అనంతరం గణనాథుడికి ఇష్టమైన మోతీచూర్ లడ్డూ తినిపించండి. దీనివల్ల మీ సోదరులతో మీకు అనుబంధం పెరుగుతుంది.
తులారాశి
శుక్రుడు అధిపతిగా ఉన్న తులారాశి వారికి నీలిరంగు రాఖీ కట్టాలని పండితులు సూచిస్తున్నారు. అనంతరం పుడ్డింగ్ తినిపించండి. ఇది వారిలో ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో పుట్టిన మీ సోదరులకు ముత్యాలు పొదిగిన ఎర్ర రాఖీ కట్టవచ్చు. బెల్లంతో చేసిన మిఠాయిలి తినిపించండి. దీని వల్ల వారి జీవితంలో శాశ్వతమైన ఆనందం లభిస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి పసుపు, బంగారు రంగు లేదా చందనం రంగు ఉన్న రాఖీలు కట్టవచ్చు. పసుపు లేదా కుంకుమ తిలకం దిద్దండి. రసగుల్లాలు తినిపించండి. వారిలో మనశ్శాంతిని కలిగిస్తుంది.
మకర రాశి
మీ సోదరులు మకర రాశిలో జన్మిస్తే వారికి నీలి రంగు రాఖీ కట్టవచ్చు. ముదురు రంగు ఎంచుకుంటే మంచిది. ఇది వారిని దురదృష్టం బారిన పడకుండా కాపాడుతుంది. బలుషాహి తినిపించండి.
కుంభ రాశి
కుంభరాశి వారికి శని గ్రహం అధిపతిగా ఉంటుంది. ఈ రాశి వారికి రుద్రాక్షలతో చేసిన రాఖీని కట్టండి. పసుపు తిలకం పెట్టి, కలాకండ్ తినిపించండి. ఇది వారిలో మంచి వ్యక్తిత్వాన్ని, బలమైన మనోధైర్యాన్ని అందిస్తుంది.
మీన రాశి
మీన రాశిలో పుట్టిన మీ సోదరులకు ఈ రాఖీ రోజున బంగారు పసుపు రంగు రాఖీ కట్టండి. పసుపు తిలకం పెట్టండి. పాలతో చేసిన కేక్ తినిపించండి. ఇది వారికి సంతోషాన్ని ఇస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
