Latest Updates
-
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే..
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.!
ఈ రోజు గ్రహాల కదలిక కారణంగా మూడు రాశుల వారికి తమ జీవితంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వారి ఆలోచనలు, చర్యలు, భావోద్వేవాలను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. తద్వారా వారి అంతర్భుద్ధి, ఆచరణాత్మకంగా ఉంటూ నిర్ణయాలను తీసుకుంటారు. ఓర్పు, ఆత్మవిశ్వాసం, జాగ్రత్తతో కూడిన సంభాషణ విజయానికి దోహదపడతుంది. మరి ఆ రాశులేంటో చూద్దాం..

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కుటుంబ వ్యవహారాల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకు అనుగుణంగా మారడం అవసరమని పండితులు సూచిస్తున్నారు. వృత్తిపరంగా మీ టెక్నికల్ స్కిల్స్ మరింతగా దోహదపడతాయి. పొదుపు, లాభాలతో ఆర్థిక ప్రణాళికలను సమర్థవంతంగా సమీక్షించుకోగలుగుతారు. ఫ్యామిలీ లైఫ్ సంతోషంగా గడుపుతారు. అయితే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మితిమీరిన స్వాధీనతను ప్రదర్శిస్తే అది బంధంలో పొరపచ్చాలకు దారితీస్తుంది. ఆరోగ్య పరంగా చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. ప్రత్యేక శ్రద్ధ వహించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
శివ స్తోత్రం
ఈ రోజు కర్కాటక రాశి వారి జీవితంలో ప్రతికూలతలు చోటుచేసుకోకుండా ఉండాలంటే 'ఓం నమఃశివాయ’ స్తోత్రాన్ని 108 సార్లు జపించాలి. స్వామి వారికి పాలు, నీటితో అభిషేకం చేసి పూజలు చేస్తే సానుకూలతకి దోహదపడుతుందని పండితులు అంటున్నారు.

సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు శారీరకంగా, మానసకికంగా ఉత్తేజంగా ఉడటంతో రోజంతా మీకు అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మీలో చమత్కారం, ఆకర్షించే గుణం, సంభాషణ నైపుణ్యాలు చాలా బలంగా ఉంటాయి. మీలో నాయకత్వ లక్షణాల కారణంగా ఇంటర్వ్యూలు, ప్రెజెంటేషన్ల వంటి వాటిలో ఇమిడిపోతారు. ఆర్థికంగా బలంగా ఉంటారు. కొత్తగా ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మీ భాగస్వామి, కుటుంబీకులు మీ మార్గదర్శకత్వంలో పనిచేయాలనుకుంటారు. కుటుంబంలో ప్రేమను అధికంగా పొందుతారు.
బయటకు వెళ్లే ముందు ఇది తప్పనిసరి
అయితే శారీరకంగా ఆందోళనను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇందుకోసం దీర్ఘశ్వాస తీసుకోవడం మేలు చేస్తుంది. మీ రోజు అంతా అనుకూలంగా ఉండేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు నుదుటిపై కుంకుమపువ్వు తిలకం పెట్టుకోవడం ఆధ్యాత్మికంగా మేలు చేస్తుంది.
కన్యా రాశి
కన్యా రాశి వారు వృత్తిపరంగా సమర్థవంతంగా ఉండగలరు. తెర వెనుక ఉండి పనిచేస్తూ విజయం సాధిస్తారు. ఆఫీసు రాజకీయాల కారణంగా ఒత్తిడి ఏర్పడుతుంది. వీటికి దూరంగా ఉండటం మంచిది. ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. వాటిని నియంత్రించడం మేలు.
కన్యా రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో కాస్త స్వేచ్ఛ కోరుకుంటారు. ఒంటరిగా సమయం గడపాలనుకుంటారు. దీని వల్ల చిన్న పాటి ఘర్షణలు ఎదురుకావచ్చు. వీటిని నివారించడానికి మీ భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడండి.
రావి చెట్టు కింద దీపం
ఎక్కువ సేపు కంప్యూటర్ చూడటం ద్వారా కంటి అలసట ఏర్పడవచ్చు. పని మధ్యలో కాసేపు స్క్రీన్‌కి దూరంగా ఉండటం మంచిది. సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే పనిలో విజయాలను అందుకుంటారు. 15 నిమిషాల పాటు నిశ్శబ్దంగా ధ్యానం చేయడం మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
