Latest Updates
-
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.!
మీరు రోడ్డుపైన వెళ్తున్నప్పుడు ఇప్పటివరకు ఒక్కసారయినా మీకు డబ్బు దొరికి ఉండవచ్చు. నోట్లు లేదా చిల్లరైనా మీ కంట పడి ఉంటుంది. ఇలాంటి ఊహించని ఘటన ఎదురైనప్పుడు చాలా మందిలో సందేహం నెలకొంటుంది. ఆ డబ్బు తీసుకోవాలా వద్దా అని.. రోడ్డుపై డబ్బు కనిపిస్తే అది లక్ష్మీదేవి ఆశీర్వాదానికి సంకేతమా లేక మరేదైనా చెడుకి సంకేతమా అని ఆలోచిస్తుంటారు. మరి ఇది దేనికి సంకేతం.. జ్యోతిష్య పండితుల సలహాలు చూద్దాం..

మన జీవితంలో జరిగే ప్రతి పరిణామాలు, సంఘటనలు.. జ్యోతిష్యం, వాస్తుతో ముడిపడి ఉంటాయని మన పెద్దలు చెబుతుంటారు. మనకు వచ్చే కలలు, ఎదురయ్యే సంఘటనలు, రోజువారీ పనులు ఇలా ఎన్నో.. ఈ క్రమంలో మీరు వెళ్తున్న దారిలో నాణేలు లేదా నోట్లు కనిపించినప్పుడు ఒక్కసారిగా తీసుకోవాలని ఆశ కలిగినా ఆ మరుక్షణమే ఆలోచనలో పడిపోతారు. తీసుకోవాలా వద్దా అని.. ఒకవేళ ఆ డ్బబు తీసుకుంటే వెంటనే ఖర్చు చేయాలా.. ఖర్చు పెట్టకుండా అలాగే దాచుకుంటే ఏదైనా అశుభం జరుగుతుందా.. దీనికి మన జీవితానికి ఏం సంబంధం ఉంది.. రోడ్డుపైన దొరికిన డబ్బుకి సంబంధించి జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో కొన్ని వాస్తవాలు, సంకేతాలు ఉన్నాయి. అవేంటంటే..
డబ్బు దొరికితే శుభమా, అశుభమా.?
జ్యోతిష్య, వాస్తు విశ్వాసాల ప్రకారం.. రోడ్డుపై డబ్బు దొరకడం అనేది సాధారణంగానే శుభసూచకంగా పరిగణిస్తారు. ఇలా అనుకోకుండా డబ్బు దొరకితే.. ఆ వ్యక్తి జీవితంలో సానుకూల మార్పునకు సంకేతం అని చెబుతారు. అంతేకాకుండా రోడ్డుపై డబ్బు దొరకడం లక్ష్మీదేవి ఆశీస్సులతో కూడా ముడిపడి ఉంటుందని వాస్తు చెబుతోంది. కొన్ని మత విశ్వాసాల ప్రకారం ఇది పూర్వీకుల ఆశీస్సులకు సంకేతంగా కూడా భావిస్తారు. అయితే ఆ డబ్బు ఎలాంటి చోట్ల దొరికిందనేది ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం..
ఈ ప్రదేశాల్లో దొరికితే తీసుకోకూడదు..
మత విశ్వాసాల ప్రకారం.. కొన్ని ప్రదేశాల్లో డబ్బు దొరికితే తీసుకోకూడదు. స్మశానంలో, ఏదైనా మురికి ప్రదేశంలో, దారిలో కూడలిలో దొరికిన డబ్బు తీసుకోవద్దని చెబుతారు. ఇలాంటి ప్రదేశాల్లో దొరికిన డబ్బును ప్రతికూల శక్తి, తాంత్రిక కర్మలతో ముడిపడి ఉంటుంది. దాని వల్ల ఇంట్లో సుఖసంతోషాలు దూరం కావచ్చు.

రోడ్డుపై దొరికిన డబ్బు ఖర్చు పెట్టాలా.?
దారిలో డబ్బు దొరికితే దాచి పెట్టుకోకుండా వెంటనే ఖర్చు పెట్టేయాలని కొందరు విశ్వసిస్తుంటారు. అయితే మత విశ్వాసాల ప్రకారం.. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును వెంటనే ఖర్చు చేయడం సరైనది కాదని చెబుతోంది. ఈ డబ్బులో కొంత భాగాన్ని గుడిలో సమర్పించడం, మంచి కార్యాలకు ఉపయోగించడం, అవసరమైన వారికి దారి చేయడం మంచిది. ఇలాంటి పనుల ద్వారా మీరు ఆ డబ్బును సక్రమంగా ఉపయోగించినట్లవుతుంది. అయితే మరికొందరు దొరికిన డబ్బును దాచిపెట్టుకుంటారు. ఇలా దొరికిన సంపద ఆర్థిక శ్రేయస్సుకు, ఇంటి సౌభాగ్యానికి సంకేతంగా పరిగణిస్తారు.
ఆర్థిక లాభం..
జ్యోతిష్య, వాస్తు సలహాల ప్రకారం.. దారిలో డబ్బు దొరకడం అనేది మీ భవిష్యతులో ఆర్థిక లాభాలతో ముడిపడి ఉండొచ్చు. వారికి ఆర్థిక అవకాశాలు పెరగడం లేదా పెండింగ్ పనుల్లో వేగం పెరుగుతుందని చెబుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
