Latest Updates
-
చలికాలంలో వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే మిల్లెట్ కూరగాయల సూప్..ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
టీ తాగే వేళలో తినడానికి బెస్ట్ హెల్దీ స్నాక్..తక్కువ సమయంలో,తక్కువ నూనెతో మఖానా టిక్కీ చేసుకోండిలా.. -
మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? -
ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు -
ఓడియమ్మ: బాత్రూమ్ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. -
చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది? శరీరంలో జరిగే పరిణామాలు ఇవే! -
క్రిస్పీ సొరకాయ పూరీలు.. ఒక్కసారి రుచి చూస్తే ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
కల్తీ లేని స్వచ్ఛమైన బొంబాయి రవ్వ.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండిలా! -
జిమ్ లేదు, ట్రెడ్ మిల్ లేదు.. ఇంట్లోనే నడిచి 14 కేజీలు తగ్గిన యువతి
చలికాలంలో వెచ్చగా, రుచిగా మహారాష్ట్ర స్పెషల్ టమాటా సూప్.. ఇంట్లోనే సులభంగా చేసుకోండి!
చల్లని శీతాకాలపు సాయంత్రాల్లో వేడివేడిగా, మనసుకు హాయినిచ్చేలా ఏదైనా తాగాలనిపిస్తోందా? అయితే మహారాష్ట్ర వంటకాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన టమాటా సూప్ (టమాటా సార్) బెస్ట్ ఆప్షన్. తాజా టమాటాలు, కమ్మని కొబ్బరి పాలతో తయారయ్యే ఈ సూప్ రుచిలో అమోఘంగా ఉండటమే కాకుండా, తయారు చేయడం కూడా చాలా సులభం.
పులుపు, తీపి, కొబ్బరి కమ్మదనం కలగలిసిన ఈ వంటకం ప్రతి గుటకలోనూ ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. ఈ చలిలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఈ రుచికరమైన సూప్ ను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-ఐదు పండిన టమాటాలు
-సగం బీట్ రూట్
-సగం పచ్చి కొబ్బరికాయ
-అంగుళం అల్లం ముక్క
-రెండు పచ్చిమిర్చి
-ఐదు కప్పుల నీరు
-రుచికి సరిపడా ఉప్పు
-అర కప్పు చక్కెర
-ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండి
-ఒక టేబుల్ స్పూన్ నెయ్యి
-అర టీస్పూన్ మినపప్పు
-అర టీస్పూన్ జీలకర్ర
-ఐదు కరివేపాకు ఆకులు
-గుప్పెడు కొత్తిమీర
-అవసరమైనంత నీరు
తయారీ విధానం
-ముందుగా టమాటాలపై క్రాస్ గుర్తు పెట్టి, వాటిని బీట్ రూట్ తో పాటు 5 నుండి 6 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఉడికిన తర్వాత వాటిని చల్లటి నీటిలో ముంచి, సులభంగా తొక్క తీసేయండి. ఇప్పుడు ఉడికిన టమాటాలు, బీట్ రూట్ ను గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని జల్లెడతో వడకట్టి ఒక పెద్ద గిన్నెలో పోసుకోండి.
-మిక్సీ జార్ లో తురిమిన పచ్చి కొబ్బరి, అల్లం ముక్క, పచ్చిమిర్చి, తగినంత నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన పల్చటి నూలు గుడ్డను ఉపయోగించి, ఈ కొబ్బరి మిశ్రమాన్ని బాగా పిండి చిక్కటి పాలను ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా మీ తాజా కొబ్బరి పాలు రెడీ అవుతాయి.
-ఇప్పుడు ముందుగా వడకట్టిన టమాటా ప్యూరీలో ఈ కొబ్బరి పాలను కలిపి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమం ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టండి. అందులో రుచికి సరిపడా ఉప్పు, చక్కెర వేసి కలపండి. అలాగే బియ్యప్పిండిని కొద్దిగా నీటిలో ఉండలు లేకుండా కలిపి ఆ ద్రావణాన్ని కూడా సూప్ లో పోసి బాగా కలుపుకోండి. దీనివల్ల సూప్ కు చక్కటి చిక్కదనం వస్తుంది.
-మిశ్రమం మరగడం ప్రారంభమైన తర్వాత మంటను తగ్గించి, సన్నని సెగపై కాసేపు ఉడికించండి.
-చివరగా సూప్ కు కమ్మని రుచినిచ్చే తాలింపు కోసం.. ఒక చిన్న తాలింపు గరిటెలో నెయ్యి వేడి చేసి, మినపప్పు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఆ తర్వాత అందులో జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాక, ఈ తాలింపును మరుగుతున్న సూప్ లో వేసి బాగా కలపండి.
-అంతే చివరగా తాజా కొత్తిమీర ఆకులను పైన చల్లితే ఘుమఘుమలాడే వేడివేడి మహారాష్ట్ర టమాటా సూప్ సర్వ్ చేయడానికి రెడీ. దీనిని సూప్ లా నేరుగా తాగవచ్చు లేదా వేడివేడి అన్నంలోకి కూడా వడ్డించుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
