Latest Updates
-
చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో వెచ్చగా, రుచిగా మహారాష్ట్ర స్పెషల్ టమాటా సూప్.. ఇంట్లోనే సులభంగా చేసుకోండి! -
చలికాలంలో వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే మిల్లెట్ కూరగాయల సూప్..ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
టీ తాగే వేళలో తినడానికి బెస్ట్ హెల్దీ స్నాక్..తక్కువ సమయంలో,తక్కువ నూనెతో మఖానా టిక్కీ చేసుకోండిలా.. -
మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? -
ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు -
ఓడియమ్మ: బాత్రూమ్ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. -
చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది? శరీరంలో జరిగే పరిణామాలు ఇవే! -
క్రిస్పీ సొరకాయ పూరీలు.. ఒక్కసారి రుచి చూస్తే ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే!
ప్రస్తుత కాలంలో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలామంది చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే మన ఆహారం, జీవనశైలిని మెరుగుపరచుకోవడం ద్వారా గుండె సమస్యలను గణనీయంగా నియంత్రించవచ్చు. దీనికోసంక్రమం తప్పని వ్యాయామంతో పాటు మనం తీసుకునే ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం.
ఆరోగ్యకరమైన గుండెను కాపాడుకోవడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వైద్య నిపుణుల ప్రకారం.. ఒమేగా-3 అనేది మన శరీరం స్వయంగా ఉత్పత్తి చేసుకోలేని ఒక ఆవశ్యకమైన కొవ్వు. కాబట్టి దీనిని మనం తినే ఆహారం ద్వారా తీసుకోవడం చాలా అవసరం. మీరు మాంసాహారం తినేవారైతే, మీ గుండె ఆరోగ్యానికి చేపలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను అందించే అద్భుతమైన మూలంగా నిలుస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కు అద్భుతమైన మూలాలైన అలాంటి కొన్ని చేపల గురించి ఇక్కడ చూడండి.

బంగడ చేపలు
భారతీయ మాకేరెల్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. మన దేశంలో అత్యధికంగా వినియోగించే చేపలలో బంగడ ఒకటి. ఇందులో DHA, EPA అనే రెండు కీలకమైన ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గణనీయమైన పరిమాణంలో ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇవి మెదడు, కంటి పనితీరును ఉత్తమంగా ఉంచడంలో కూడా సమర్థవంతంగా తోడ్పడతాయి.
సార్డినెస్
సార్డినెస్ చేపలు చూడటానికి చిన్నవిగా ఉన్నా, పోషక విలువల్లో మాత్రం మేటి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా లభిస్తాయి. ఈ చేపలో పాదరసం (మెర్క్యురీ) స్థాయిలు చాలా తక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. అందుకే ఇతర చేపలతో పోలిస్తే దీనిని అత్యంత సురక్షితమైనదిగా పరిగణిస్తారు. ఇవి ఎముకలను, కండరాలను బలోపేతం చేయడానికి ఎంతో సహాయపడతాయి.
సాల్మన్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరోగ్యకరమైన చేపలలో ఒకటిగా సాల్మన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 100 గ్రాముల సాల్మన్ లో సుమారు 1.8 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. దీనిని క్రమంగా తినడం వల్ల రక్తంలోని ట్రైగ్లిజరైడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు, ఇది గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. దీనికితోడు ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు శరీర ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి.
హిల్సా
తూర్పు భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చేపలలో హిల్సా ఒకటి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫాస్ఫరస్, అనేక రకాల ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే హిల్సా చేపను తినడం వల్ల మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.
రోహు
మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మంచినీటి చేపలలో రోహు ముందు వరుసలో ఉంటుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేయడమే కాకుండా, ఎముకల దృఢత్వానికి, మొత్తం శరీర ఆరోగ్యానికి ఎంతో మంచివని భావిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
