Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
కుబేరుడి అనుగ్రహం కావాలా? ఆఫీసులో ఈ దిశగా కూర్చుంటే అదృష్టం మీ వెంటే!
ఆఫీసులో టైంతో సంబంధం లేకుండా మెషీన్ లా కష్టపడుతున్నారా? మీ తోటి ఉద్యోగులు ఈజీగా శాలరీ హైక్స్, ప్రమోషన్లు కొట్టేస్తుంటే.. మీరు మాత్రం అక్కడే ఆగిపోయినట్లు అనిపిస్తోందా? అన్నీ సరిగ్గానే చేస్తున్నా, టాలెంట్ కి తగిన గుర్తింపు లభించకపోతే ఎవరికైనా తీవ్ర నిరాశ కలుగుతుంది. అయితే,ఇక్కడ లోపం మీ పనితీరులోనో, మీ కష్టంలోనో లేకపోవచ్చు. సమస్య అంతా మీరు కూర్చునే చోట, మీ కుర్చీ వేసుకున్న డైరక్షన్ లో కూడా ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం..ఆఫీస్ లేదా కార్యాలయంలో మనం కూర్చునే దిశ, మన చుట్టూ ఉండే వాతావరణం మన కెరీర్ ఎదుగుదలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి.

ఉత్తరం లేదా తూర్పు దిశ
పనిచేసేటప్పుడు మనం ఏ దిశలో ముఖం పెట్టి కూర్చున్నామనేది వాస్తులో అత్యంత కీలకం. ఆఫీసులో ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశల వైపు చూస్తూ పనిచేయడం చాలా మంచిది. ఉత్తర దిశకు అధిపతి సంపదలను ప్రసాదించే కుబేరుడు. ఈ దిశగా కూర్చొని పనిచేయడం వల్ల కెరీర్ లో ఆర్థిక లాభాలు, కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఇక తూర్పు దిశ సూర్యుడికి ప్రతీక. ఇది సానుకూల శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ ఏకాగ్రతను అమాంతం పెంచుతుంది. పొరపాటున కూడా దక్షిణం వైపు తిరిగి కూర్చోకండి. ఇది పనిలో ఆటంకాలను, మానసిక ఒత్తిడిని పెంచుతుంది.
వీపు వెనుక దృఢమైన గోడ
మీరు కూర్చునే కుర్చీకి వెనుక వైపు ఏముందో ఎప్పుడైనా గమనించారా? వాస్తు ప్రకారం పని చేసేటప్పుడు మీ వీపు వెనుక కచ్చితంగా ఒక దృఢమైన గోడ ఉండాలి. ఇలా ఉండటం వల్ల మీకు ఆఫీసులో పై అధికారుల నుండి, తోటి ఉద్యోగుల నుండి బలమైన మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అలా కాకుండా మీ వెనుక ఏదైనా కిటికీ, తలుపు లేదా అద్దాల గోడ ఉంటే.. అది మీలోని శక్తిని హరించేస్తుంది. పనిపై ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా, మీలో తెలియని అభద్రతా భావం కలుగుతుంది.
డెస్క్ మీద ఏముండాలి
టేబుల్ పై అనవసరమైన కాగితాలు, పాత ఫైళ్లు, చెత్తాచెదారం పేరుకుపోతే.. అది నెగెటివ్ ఎనర్జీని ఆకర్షించి, పనికి ఆటంకం కలిగిస్తుంది. మీ లాప్ టాప్ లేదా కంప్యూటర్ ను టేబుల్ మీద ఎప్పుడూ ఈశాన్య మూలలో ఉంచండి. మీరు ఎక్కువగా ఫైల్స్ చూసే వారైతే, ముఖ్యమైన డాక్యుమెంట్లను ఎల్లప్పుడూ మీ కుడి వైపున పెట్టుకోండి. టేబుల్ మీద ఒక చిన్న మొక్క లేదా ఒక నీళ్ల బాటిల్ ఉంచుకోవడం వల్ల వాతావరణం ప్రశాంతంగా, పాజిటివ్ గా మారుతుంది.
బీమ్స్ కింద కూర్చోవద్దు
చాలా ఆఫీసుల్లో పైకప్పు నుండి కాంక్రీట్ బీమ్స్ లేదా పిల్లర్లు కిందికి కనిపిస్తూ ఉంటాయి. వాస్తు ప్రకారం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బీమ్స్ కింద నేరుగా కూర్చోకూడదు. ఆలా కూర్చోవడం వల్ల మీ తలపై అదృశ్యమైన భారం పడుతున్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల ఏ కారణం లేకుండానే త్వరగా అలసిపోవడం, చిరాకు రావడం జరుగుతుంది. తప్పనిసరిగా అక్కడే కూర్చోవాల్సి వస్తే, ఆ దోషాన్ని నివారించడానికి ఆ బీమ్ కు ఒక చిన్న ఫ్లూట్ వేలాడదీయండి లేదా మీ టేబుల్ పై ఒక చిన్న క్రిస్టల్ ను పెట్టుకోండి.
Disclaimer: నమ్మకాలు, మతవిశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని నిరూపించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, దీనిని నమ్మడం వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications
