Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఫేస్ వైప్స్ వాడుతున్నారా? మీ స్కిన్ కి ఇవి ఎంత సేఫ్?..ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ప్రస్తుతం చాలామంది ఫేషియల్ వైప్స్ ని(facial wipes) వాడుతున్నారు. ప్రయాణాల సమయంలో,మొఖం మురికిగా ఉన్న సమయంలో,నీరు వంటివి అందుబాటులో లేని సమయంలో స్కిన్ మీద ఉన్న డస్ట్ ను తుడుచుకునేందుకు వీటిని చాలామంది తమ బ్యాగ్ లో పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా మేకప్ తీయడానికి కూడా వైప్స్ చాలా ఉపయోగపడుతుంది.
కరోనా తర్వాత చాలామందిలో శుభ్రతపై శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలోనే ఈ వైప్స్ వాడే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. భారత్ లో వెట్ వైప్స్ మార్కెట్ విలువ దాదాపు రూ.744 కోట్లుగా ఉంది. అయితే 2027 నాటికి వెట్ వైప్ మార్కెట్(wet wipe market in india) విలువ మనదేశంలో 2,155 కోట్లకు చేరుకుంటుందని ఓ అంచనా. అయితే ఫేషియల్ వైప్స్ స్కిన్ కి(skin) మంచిదేనా లేదా ప్రమాదమా అని ఎప్పుడైనా ఆలోచించారా? నిపుణులు దీని గురించి ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం.

ఫేషియల్ వైప్స్ అనేవి మన స్కిన్ ని శుభ్రపరచడానికి రూపొందించిన పదార్థాల మిశ్రమంతో నింపబడి ఉంటాయి. చాలా వైప్‌లు డెర్మటాలాజికల్‌గా పరీక్షించబడినప్పటికీ వాటిలోని కొన్ని రసాయనాలు ప్రతి చర్మ రకానికి సరిపోకపోవచ్చు. ముఖ్యంగా మీది సున్నితమైన లేదా మోటిమలు వచ్చే చర్మం అయితే మీకు అది సెట్ అవకపోవచ్చు. అయితే స్కిన్ కేర్ రొటీన్ లో వైప్స్ విలువను నిర్ణయించడానికి దీనిలో వాడే పదార్థాలు,క్వాలీటీ,ప్రభావం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మార్కెట్ లో వివిధ బ్రాండ్ ల ఫేషియల్ వైప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అందరికీ ఒకరకమైన స్కిన్ టైప్ ఉండదు. ఢిఫరెంట్ ఢిఫరెంట్ చర్మ రకాలకు వాటి సామర్థ్యాన్ని,అనుకూలతను చెక్ చేయడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. అన్ని ఉత్పత్తులు సమానంగా తయారుచేయడవని..కొన్ని కఠినమైన రసాయనాలు లేదా అలెర్జీ కారకాలను కలిగి ఉండవచ్చుని.. ఇవి ప్రయోజనాలను అందించడం కంటే చర్మానికి హాని కలిగించేవిగా ఉండవచ్చని తెలిపారు.
ఫేషియల్ వైప్స్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాలి
ఫేషియల్ టిస్యూని సెలక్ట్ చేసుకునేటప్పుడు అనేక రకాల విషయాలు గుర్తుంచుకోవాలి. క్వాలీటీ, అనుకూలతలను ప్రభావితం చేసే వివిధ కారకాలు, పదార్థాలు అందులో ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. అసలు అత్యవసరమైతే తప్ప ముఖంపై వైప్స్ ఉపయోగించకూడదు. ఒక వేళ వాడవలసి వస్తే మాత్రం వాటిని కొనేటప్పుడు ఈ కింద విషయాలను గుర్తుంచుకోండి.
-వైప్స్ లో అలోవెరా,హైలురోనిక్ యాసిడ్, విటమిన్ సి వంటి హైడ్రేటింగ్ పదార్థాలు ఉండి, ఆల్కహాల్ లేకుండా ఉండేలా చూసుకోండి. మితిమీరిన సువాసన చర్మాన్ని చికాకుపెడుతుంది..నల్లమచ్చలు లేదా తెల్లమచ్చలు వచ్చే అవకాశముంటది కాబట్టి అవి కనీస పరిమళాన్ని కలిగి ఉండాలి.
- సాఫ్ట్ నెస్,గట్టిదనం దీనిని మంచిదా కాదా అని తేల్చడానికి కీలక అంశాలు. మంచి ఫీడ్ బ్యాక్ ఉన్న వైబ్స్ మాత్రమే కొనండి.
-చర్మ సున్నితత్వాన్ని ప్రభావితం చేసే లోషన్లు లేదా సువాసనలు వంటివి ఏవైనా ఆ వైబ్స్ లో ఉన్నాయో లేదో చెక్ చేయండి.
-ఆ ప్రొడక్ట్ పై పర్యావరణ ప్రభావం ఎలా ఉంటుందో కూడా చేసుకోవాలి. అది అది రీసైకిల్ చేయబడిన పదార్థాలతో తయారు చేయబడిందా లేదా బయోడిగ్రేడబులా అనే విషయాన్ని తెలుసుకోవాలి.
-మేకప్ తొలగించడం విషయానికి వస్తే వైబ్స్ ఒక్కటే కాదు చాలా బెటర్ ఆప్షన్లు ఉన్నాయి. కేవలం వైప్‌లను ఉపయోగించడం బెటర్ కాదు అని నిపుణులు చెబుతున్నారు.
-మీ ముఖం నిజంగా మురికిగా ఉన్నప్పుడు,నీరు అందుబాటులో లేని సమయాల్లో దానిని వాడండి. నీరు అందుబాటులో ఉంటే మీ ముఖాన్ని నీటితో కడుక్కోవడమే బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
