Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
మీ పేటకు మీరే ‘హ్యాండ్‌సమ్’..!!

చర్మం సంరక్షణ: అందంగా కనిపించేందుకు ముగవారికి కావల్సింది కండ బలం, గుండె బలం కాదు, 'వ్యక్తిగత సంరక్షణ'. పరిశభ్రతకు ప్రాధన్యతనిస్తూ జాగ్రత్తలు పాటిస్తుండాలి. చర్మానికి హాని తలపెట్లే క్రీములకు దూరంగా ఉంటూ సహజసిద్ధమైన ఔషుద చిట్కాలను ప్రాధాన్యతనివ్వాలి.
చెడువ్యసనాలు: ముఖ్యంగా చెడు వ్యసనాలగానే ముఖ్యంగా 'ధూమపానానికి' టీనేజి కుర్రాళ్లు ఆకర్షితులవుతున్నారు. ఆడవారు పొగతాగుతున్నారు కదా అన్న సందేహం మీకు రావచ్చు. అవును పలువురు ఆడవారు పొగుతాగుతున్నప్పటికి తమని తాము పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. ఏదేమైనా పొగతాగే అలవాటున్న మగవారు ఈ వ్యసనాన్ని త్వరగా వదిలించికోవటం ఉత్తమమైన లక్షణం. ధూమపానానికి భానిసలవుతున్న టీనేజర్లు వయసు పెరిగే కొద్ది ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది.
ఆహారం: ఆహారపు అలవాట్ల విషయంలో మగవారు నిబద్ధత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నూనె శాతం అధికంగా ఉండే అవుట్ సైడ్ ఫుడ్లను వీలైనంతవరకు తగ్గించాలి. పోషక విలువల అధికంగా ఉండే ఆహారాలను క్రమ బద్ధంగా తీసుకోవాలి. మితంగా ఆహారం తీసుకోవటం వల్ల అనవసర సమస్యల నుంచి బయటపడగలరు. బలమైన ఆహారం తీసుకుంటున్నామంటే సరిపోదు దానికి తగ్గట్టుగా చిన్న, చిన్న వ్యాయమాలను మీరు ఉన్న చోటనే చేసుకోవచ్చు. ప్రణాళికా బద్ధంగా మీ దినచరర్యలను ఆరంభిస్తే మార్పు స్వల్ప వ్యవధిలోనే కనబడుతుంది.
నిద్ర: అవును నిజమే..!! పోటీ ప్రపంచంలో పెరిగిన పని భారం సుఖ నిద్రను దూరం చేస్తుంది. ముఖ్యంగా మగవారు అనవసర విషయాల కోసం నిద్రను పాడుచేసుకోకండి. నైట్ మీటింగ్ లంటూ, నైట్ షికార్లంటూ మీ ఆరోగ్యానికి మీరే తూట్లు పొడుచుకోవద్దు. నిద్రకు ప్రత్యేక సమయాన్ని కేటాయించండి. సంతృప్తిగా నిద్రపోండి. మీకో విషయం తెలుసా.. యువసామ్రాట్, ద ఫ్రిన్స్ గా పిలవబడుతున్న ప్రముఖ హిరోల సౌందర్య రహస్యం ఏంటో తెలుసా సంతృప్తిగా నిద్రపోవడమే.
ఈ ప్రణాళికలను తప్పక పాటిస్తే మీ పేటకు మీరే 'హ్యాండ్‌సమ్'



Click it and Unblock the Notifications
