Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
అందమైన..నాజూకైన శరీర ఆకృతి మీ సొంతం కావాలంటే

1. గ్రీన్ టీ: గ్రీన్ టీ ఆరోగ్యానికే కాకుండా అందంగా ఉంచడానికి దోహదం చేస్తుందని నిపుణలు అంటున్నారు. ముఖ్యంగా స్త్రీలు గ్రీన్ టీ తాగడం వలన బోలెడు లాభాలు పొందవచ్చు. రోజుకు రెండు లేదా మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణప్రక్రియ వేగవంతం అవుతుంది.
2. సూప్స్: భోజనానికి ముందు సూప్స్ తీసుకోవాడం చాలా మందికి అలవాటు. ఈ అలవాటు చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. కొవ్వును త్వరితగతిన కరిగించే గుణం సూప్స్ కు ఉందని వారు చెబుతున్నారు. మంచి శరీర ఆకృతిని సొంతం చేసుకోవాలంటే సూప్స్ ను తీసుకోవడం తప్పనిసరి. వీటి వలన ఆహారాన్ని తక్కువ తీసుకుంటారు. దాని వలన తక్కువ క్యాలరీలు శరీరంలో చేరతాయి.
3. మిరపకాయలు, మిరియాలు: మిరియాలు, మిరపకాయలు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అధికబరువును తేలికగా తగ్గించుకోవచ్చు. బరువు తగ్గించుకునేందుకు అనుసరించే అన్నిపద్దతుల కన్నా ఈ పద్దతి ద్వారా త్వరగా మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.
4. ఓట్ మీల్: ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశె, పూరీ, చపాతీలాటి వాటికన్నా ఓట్స్ ను తీసుకుంటే మంచిది. ఇది గుండె జబ్బులతో సమర్థవంతంగా పోరాడడమే కాకుండా, అధికబరువును తగ్గిస్తుంది. దీనిలో ఫ్యాటీ ఫైబర్ జీర్ణప్రక్రియను ఎక్కువ చేస్తుంది.
5. ఆకుకూరలు: ఆకుకూరలు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా అధికబరువును కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా బ్రాకోలీ చాలా మంచిది. వారంలో కనీసం రెండు సార్లు ఆకుకూరలు ఆహారంలో చేర్చుకొంటే మంచింది.
6. మొలకెత్తిన విత్తనాలు: మొలకెత్తిన విత్తనాలు, సోయాబీన్స్ ఇవి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు, కిడ్నీ బీన్స్, బఠాణీలు, మొదలైనవి నీటిలో కరిగే పీచు కొల్లెస్టరాల్ లెవెల్ తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications
