Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
మహిళల వెనక బాగంలో జుట్టు పెరుగుదలను తగ్గించటానికి 5 స్క్రబ్స్
మీకు ఈ రోజు ప్రోమ్ నైట్ ఉందా? మీరు వివాహానికి హాజరు కావాలా? అయితే ఏమి ధరించి వెళ్ళుతున్నారు? మీరు ఖచ్చితంగా చాలా సెక్సీ గా ఉండే విధంగా ఏదో అలోచించి ఉంటారు. బాక్ లెస్ గౌను లేదా తక్కువ కట్ చోళి తో ఒక అందమైన చీరను ఎందుకు ధరించకూడదు? ఓహ్! మీకు...కుదరదు. ఎందుకంటే వెనక బాగంలో జుట్టు సమస్య మరియు బాధాకరమైన వాక్సింగ్ సమస్య ఉంటుంది. నేడు మీరు కొన్ని ఇతర దుస్తులను ధరించటానికి ప్రయత్నిస్తున్నారా? కానీ, మహిళల్లో వెనక బాగంలో జుట్టు తొలగించటానికి స్క్రబ్స్ ఉన్నాయని తెలుసా?

అవును మీరు సరిగ్గానే విన్నారు. వెనక బాగంలో జుట్టు పెరుగుదలను తగ్గించడానికి కొన్ని ఉత్తమమైన స్క్రబ్స్ ఉన్నాయి. ఈ సహజ పదార్థాలతో వాక్సింగ్ మరియు పునరావృత వాడకం ద్వారా వెళ్లవలసిన అవసరం లేదు. మీరు మీ జుట్టు పెరుగుదలలో కనిపించే మార్పు చూస్తారు. అలాగే ఈ స్క్రబ్స్ మీ వెనక బాగాన్నే కాకుండా శరీరంలో ఇతర బాగాలలో ఉన్న జుట్టును తొలగించటానికి కూడా సహాయపడతాయి. అమ్మాయి అందమైన ముఖం కావాలని కోరుకుంటుంది. అలాగే అబ్బాయిల దృష్టిలో పడాలని కూడా అనుకుంటుంది.
కానీ, ఈ స్క్రబ్స్ మాయ చేయవు. ఒక్క రాత్రిలో మీ సమస్యను పరిష్కరించవు. మీరు సహనంగా చేయాలి. వారంలో రెండు సార్లు స్క్రబ్ ఉపయోగిస్తే కొన్ని వారాల్లోనే మంచి పలితాన్ని పొందవచ్చు. ఇక్కడ మహిళల్లో వెనక బాగంలో జుట్టు పెరుగుదలను తగ్గించటానికి కొన్ని స్క్రబ్స్ ఉన్నాయి. మీకు వెనక బాగంలో స్క్రబ్ రాసుకోవటం కష్టంగా ఉంటే మీ మదర్ సాయం తీసుకోండి.

పసుపు స్క్రబ్
జుట్టు పెరుగుదలను తగ్గించటానికి ఉత్తమంగా పనిచేస్తుంది. పసుపు,శనగపిండి, నీరు కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని జుట్టు ఉన్న ప్రాంతంలో రాసి ఆరాక నిదానంగా కడగాలి.

తేనే, వోట్మీల్ మరియు నిమ్మకాయ స్క్రబ్
ఒక బౌల్ లో ఒక స్పూన్ తేనే,అరస్పూన్ వోట్మీల్ మరియు కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు ఉన్న బాగంలో రాసి అరిన తర్వాత రబ్ చేసి కడగాలి.

శనగపిండి స్క్రబ్
ఇది వెనక బాగంలో జుట్టు పెరుగుదలను తగ్గించటానికి ఉత్తమమైన స్క్రబ్. ఒక బౌల్ లో శనగపిండి, పెరుగు మరియు కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని జుట్టు ఉన్న వెనక బాగంలో రాసి ఆరాక రబ్ చేస్తే జుట్టు మూలాల నుండి తొలగిపోతుంది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో వెచ్చని ఆవాల నూనెతో మసాజ్ చేస్తే చర్మం నునుపుగా మారుతుంది.

డౌ బాల్
ఇది కూడా వెనక బాగంలో జుట్టు పెరుగుదలను తగ్గించటానికి సహాయపడుతుంది. డౌ బాల్ ని నూనెలో ముంచి జుట్టు ఉన్న ప్రాంతంలో రుద్దాలి. జుట్టు పెరుగుదల అధికంగా ఉన్న ప్రాంతాల్లో రుద్దితే జుట్టు పెరుగుదల తగ్గుతుంది.

బార్లీ స్క్రబ్
ఇది జుట్టు మూలాల నుండి జుట్టు తొలగించటానికి ఒక బలమైన స్క్రబ్ అని చెప్పవచ్చు. బార్లీ పౌడర్, పాలు మరియు నిమ్మరసం కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని జుట్టు ఉన్న వెనక బాగంలో రాసి ఆరాక రుద్దాలి. వారంలో 3 నుంచి 4 సార్లు చేస్తే మంచి పలితం కనపడుతుంది.
కాబట్టి మహిళలు వెనక బాగంలో జుట్టు పెరుగుదలను తగ్గించే స్క్రబ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇవి చర్మం నుండి మలినాన్ని మరియు మరణించిన చర్మం కణాలను తొలగించి చర్మం ప్రకాశవంతంగా మారటానికి కూడా సహాయపడతాయి.



Click it and Unblock the Notifications