Latest Updates
-
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్‌ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.? -
ఎక్కువ కాలం బతకాలా? ఈ వ్యాయామాలు చేస్తే మరణ ప్రమాదం తగ్గుతుంది.. -
విజయవాడ కనక దుర్గమ్మ తల్లి ఆ కొండపై ఎందుకు కూర్చుంది? అసలు కథ -
ధాబా స్టైల్ టీ ఇంట్లోనే కావాలా? అయితే ఈ 3 సీక్రెట్ మసాలాలు వాడాల్సిందే!
Lipstick Side Effects: లిప్ స్టిక్ తెగ వాడేస్తున్నారా.. పెదాల అందమే కాదు ఆరోగ్యమూ పాడవుతుంది
లిప్‌స్టిక్‌ను అతిగా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది. లిప్‌స్టిక్‌ల్లో హానికరమైన క్రోమియం, సీసం, అల్యూమినియం, కాడ్మియం సహా అనేక విషపదార్థాలు ఉంటున్నట్లు వెల్లడైంది.
Lipstick Side Effects: అందం-ఆడపిల్ల. రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. అందంగా కనిపించాలని ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉంటుంది. ఇలా అందంగా కనిపించడంలో భాగమే లిప్‌స్టిక్ వాడటం.

లిప్‌స్టిక్‌తో కేవలం నిమిషాల వ్యవధిలోనే అందంగా కనిపించవచ్చు. లిప్‌స్టిక్స్‌లోనూ ఎన్నో రంగాలు, ఎన్నో షేడ్స్ ఉంటాయి. సందర్భాన్ని బట్టి, డ్రెస్సును బట్టి, కలవాల్సిన వ్యక్తులను బట్టి వీటి రంగును మార్చేస్తుంటారు అమ్మాయిలు.
అయితే లిప్‌స్టిక్‌ను అతిగా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని బర్కిలీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో లిప్ గ్లాసెస్, లిప్‌స్టిక్‌ల్లో హానికరమైన క్రోమియం, సీసం, అల్యూమినియం, కాడ్మియం సహా అనేక విషపదార్థాలు ఉంటున్నట్లు వెల్లడైంది.
ఈ విష రసాయనాలను తరచూ వాడితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో రెండు, మూడు సార్లు కంటే ఎక్కువసార్లు లిప్‌స్టిక్‌ను వాడే వ్యక్తుల్లో పలు రోగాలు గుర్తించినట్లు అధ్యయనం పేర్కొంది.

లిప్‌స్టిక్‌లో ఉండే విషపూరిత పదార్థాలు:
* థాలేట్స్ ఎండోక్రైన్ వ్యవస్థకు హానికరం.
* సీసం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
* పాలిథిలిన్ గ్లైకాల్స్ క్రీమ్ ఆధారిత ఉత్పత్తులు నాడీ వ్యవస్థకు హానికరం.
* పారాబెన్‌లు సాధారణంగా లిప్‌స్టిక్‌లో కనిపిస్తాయి. చర్మంలోకి సులభంగా చొచ్చుకుపోతాయి. అవి డిప్రెషన్, డయేరాయి వంటి సమస్యలను తెచ్చిపెడతాయి.

లిప్‌స్టిక్‌ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు
1. శరీరంలో విషాన్ని కలిగిస్తాయి
లిప్‌స్టిక్‌లలోని విషపూర్తి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి దానిని పెదాలకు రాసుకోవడం వల్ల విష పదార్థాలు శరీరం లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. లిప్‌స్టిక్‌లను కొనుగోలు చేసే ముందు అందులో ఎలాంటి పదార్థాలు వాడారో తనిఖీ చేసుకోవడం మంచిది.

2. స్కిన్ అలెర్జీ
కొన్ని రకాల లిప్‌స్టిక్‌లు వాడటం వల్ల పెదాలపై దద్దుర్లు, పెదవి ప్రాంతం చుట్టూ దురద ఉంటుంది. లిప్‌స్టిక్‌లలో సంరక్షణ కోసం బిస్మత్ ఆక్సిక్లోరైడ్ అనే రసాయనాన్ని వాడతారు. ఈ పదార్థం క్యాన్సర్ కారకం.

3. క్యాన్సర్ కారకాలు
లిప్‌స్టిక్‌ల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. లిప్‌స్టిక్‌లను సంరక్షించడానికి ఉపయోగించే రసాయనాలు దగ్గు, కంటి చికాకు, గురక, ఇతర అలెర్జీ సమస్యలను తెచ్చిపెడతాయి. తీవ్రమైన సందర్భాల్లో, క్యాన్సర్ కూడా సంభవించొచ్చు.

4. ఎండోక్రైన్ వ్యవస్థలో మార్పు
లిప్‌స్టిక్‌లలో పెట్రో కెమికల్స్ ఉంటాయి. ఇవి ఎండోక్రైన్ వ్యవస్థలో పెద్ద మార్పులకు కారణం అవుతాయి. అదే జరిగితే.. శరీరం కాగ్నిటివ్, పునరుత్పత్తి సామర్థ్యాల్లో అనేక సమస్యలను ఎదుర్కొంటుంది.

5. మూత్రపిండ వైఫల్యం
తీవ్రమైన సందర్భాల్లో లిప్‌స్టిక్‌లను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మూత్రపిండ వైఫల్యం కూడా సంభవించవచ్చు. లిప్‌స్టిక్‌లలో పెద్ద మొత్తంలో కాడ్మియం ఉండటమే దీనికి కారణం. ఈ విష రసాయనం ఉండటం వల్ల కడుపులో కణితులు కూడా సంభవించే అవకాశం ఉంది.

లిప్‌స్టిక్‌ల గురించి ఇంకొన్ని వాస్తవాలు:
- ముదురు రంగు లిప్‌స్టిక్‌లలో విషపూరిత రసాయనాలు ఎక్కువగా ఉంటాయి.
- లిప్‌స్టిక్ వేసే ముందు ఎప్పుడూ పెట్రోలియం జెల్లీని అప్లై చేసుకోవాలి. ఇది మీ పెదాలకు రక్షణ పొరను అందిస్తుంది. అలాగే లిప్‌స్టిక్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.
- టాక్సిన్ లేని లేదా సహజమైన లిప్‌స్టిక్‌లను ప్రయత్నించడం మంచిది. వీటి వల్ల అనారోగ్య సమస్యలు తక్కువ.
- గర్భధారణ సమయంలో లిప్‌స్టిక్‌లు వాడటం మానుకోవాలి. లిప్‌స్టిక్‌లలోని రసాయన పదార్థాల వల్ల గర్భస్రావం జరగవచ్చు.
- వారానికి 2-3 సార్లు కంటే ఎక్కువ సార్లు లిప్‌స్టిక్ వాడకపోవడం ఉత్తమం.



Click it and Unblock the Notifications