Latest Updates
-
శ్రావణ మాసం స్పెషల్ హెల్తీ లడ్డు.. పప్పు నానబెట్టే పనే లేదు,పాకం పట్టే శ్రమ లేదు..ఈజీగా చేసుకోండిలా.. -
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి! -
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్!
ఎర్రటి జుట్టు నల్లగా నిగనిగలాడాలంటే....

1. ఉద్దిపప్పు ఒకటిన్నర టీ స్పూను, 15వరకు వేపాకులను తీసుకుని వీటిని పుల్లటి మజ్జిగలో నానపెట్టండి. అటుపై ఈ మిశ్రమాన్ని మెత్తగా రుబ్బాలి. ఇలా తయారు చేసిన పేస్టును తలకు పూర్తిగా పట్టించి, బాగా ఆరిన తర్వాత తలస్నానం చేయండి. ఈ విధంగా 10 నుంచి 15 రోజుల వరకు క్రమం తప్పకుండా చేస్తే రాగిరంగు జుట్టు క్రమంగా నల్లబడి మీరు కోరే అందమైన కురులు మీ సొంతమౌతుంది.
2. ప్రతిరోజు తలస్నానం, కండీషనింగ్ చేసుకోవాలి. ఆలీవ్ నూనెకు గుడ్డు తెల్లసొనను కలిపి తలకు పట్టించాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత తలస్నానం చేస్తే, జట్టుకు చక్కని పోషణ అంది పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.
3. రెండు టీస్పూన్ల తేనెకు మూడు టీస్పూన్ల ఆలివ్‌నూనె కలిపి.. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి తలంతా బాగా పట్టించాలి. ఇరవై నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఒక కప్పు కమలాపండు రసానికి ఒక టీస్పూన్ తేనె, నాలుగైదు చుక్కల కొబ్బరినూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి.
4. వెంట్రుకలు మరీ జీవం కోల్పోయినట్లు అనిపిస్తున్నట్లయితే.. అరకప్పు బాగా పండిన అరటిపండు గుజ్జుకు నాలుగైదు చుక్కల బాదం నూనె చేర్చి జుట్టుకు బాగా పట్టించాలి. కాసేపటి తరువాత, ముందుగా సోడాతోనూ ఆ తర్వాత నీటితోనూ కడిగేయాలి. చివరగా కండిషనింగ్ చేసుకుంటే జట్టు సహజ స్థితిలోకి వస్తుంది.
5. షాంపూను ఎప్పుడూ నీటిలో కలిపిన తరువాతే తలకు పట్టించి అంటుకోవాలి. నేరుగా షాంపూను జుట్టుకు తగలనివ్వకూడదు. షాంపూ చేసుకున్న వెంటనే జుట్టుకు, అర మగ్గు నీటిలో ఒక నిమ్మరసం, ఒక చెంచా వెనిగర్ కలిపి కండిషనర్‌లా వాడుకోవాలి. జిడ్డుగా వుండే జట్టుకు మసాజ్ చేసేటప్పుడు, నూనెకు మారుగా హెయిర్ టానిక్‌లను వాడాలి. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా నల్లగా ఉంటుంది.



Click it and Unblock the Notifications