Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక?
పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే లేదా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చున్నప్పుడు చేతులు, కాళ్లు మొద్దుబారడం, చీమలు పాకినట్లు అనిపించడం మనలో చాలామందికి ఎదురయ్యే సాధారణ అనుభవమే. ఆ సమయంలో చేతులు, కాళ్లు కాస్త రుద్దుకుంటాం, కాసేపటికి తగ్గిపోతుంది కదా అని తేలికగా తీసుకుంటాం.
కానీ ఈ తిమ్మిర్లు తరచుగా వేధిస్తుంటే లేదా ఎక్కువ కాలం కొనసాగుతుంటే మాత్రం కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే అది భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యకు హెచ్చరిక కావచ్చు.

సాధారణంగా ఎందుకు వస్తుందంటే?
వైద్య పరిభాషలో ఈ సమస్యను పరేస్థీసియా అంటారు. శరీరానికి స్పర్శను అందించే నరాలపై ఒత్తిడి పడినప్పుడు ఇలా జరుగుతుంది. మనం ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చున్నా, కాళ్లపై కాళ్లు వేసుకుని కూర్చున్నా లేదా చేయి కింద పెట్టుకుని పడుకున్నా నరాలకు రక్తప్రసరణ తాత్కాలికంగా తగ్గుతుంది. ఆ సమయంలో మెదడుకు వెళ్లాల్సిన సంకేతాలకు అంతరాయం ఏర్పడి ఆ భాగం మొద్దుబారుతుంది. భంగిమ మార్చగానే రక్తప్రసరణ సాధారణ స్థితికి చేరుకుని, నిమిషాల్లోనే తిమ్మిరి తగ్గిపోతుంది. ఇది పూర్తిగా సహజమైన శారీరక ప్రక్రియ. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు.
ఎప్పుడు ప్రమాదకరం?
కానీ ఎలాంటి కారణం లేకుండానే పదే పదే తిమ్మిర్లు వస్తున్నా, క్రమంగా తీవ్రమవుతున్నా అది నరాల బలహీనతకు సంకేతం అని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ చెబుతోంది. కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
పక్షవాతం ముప్పు
శరీరంలో ఒకవైపు మాత్రమే అకస్మాత్తుగా తిమ్మిరి రావడం, మాట తడబడటం, కంటిచూపు మసకబారడం, బ్యాలెన్స్ తప్పడం వంటివి కనిపిస్తే అది పక్షవాతం లక్షణం కావొచ్చు. ఇలాంటి సమయంలో ప్రతి నిమిషం విలువైనదే. తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి.
ఇతర వ్యాధుల సంకేతాలు
మధుమేహం ఉన్నవారిలో ఈ లక్షణం నిరంతరంగా ఉంటే అది డయాబెటిక్ న్యూరోపతికి కారణం. విటమిన్ బి12 లోపం, థైరాయిడ్ సమస్యలు, కండరాల బలహీనత, తీవ్రమైన మెడ లేదా నడుము నొప్పి ఉన్నప్పుడు కూడా దీనిని వెన్నుపాము, మెదడుకు సంబంధించిన ముప్పుగా భావించాలి.
మల్టిపుల్ స్క్లెరోసిస్ తో జాగ్రత్త
మరొక తీవ్రమైన సమస్య మల్టిపుల్ స్క్లెరోసిస్. ఇదొక ఆటో ఇమ్యూన్ నాడీ సంబంధిత వ్యాధి. ఇందులో మన శరీర రోగనిరోధక వ్యవస్థే మెదడు, వెన్నుపాములోని నరాల రక్షణ పొరపై దాడి చేస్తుంది. దీనివల్ల చేతులు, కాళ్లలో జలదరింపు, కండరాల బలహీనత వస్తుంటాయి. ఈ వ్యాధిలో లక్షణాలు కొన్నిరోజులు ఉండి మళ్లీ వాటంతట అవే తగ్గిపోతుంటాయి. దీనివల్ల రోగి పెద్దగా పట్టించుకోడు. కానీ లోపల వ్యాధి తీవ్రత పెరుగుతూనే ఉంటుంది.
కాబట్టి చేతులు కాళ్లు మొద్దుబారడాన్ని కేవలం ఒత్తిడి వల్లే అని కొట్టిపారేయకండి. అవి మీ శరీరంలోని లోపాన్ని తెలియజేసే అలారం కావొచ్చు. సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంటే డాక్టర్ ను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
