ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్!

Posted By:

ఎంత హాయిగా, తృప్తిగా అనిపించిందో ఇవాళ భోజనం అనే అనుభూతి మీరు పొందాలనుకుంటున్నారా? అయితే ఓసారి బెండకాయ వంకాయ కలిి చేసే రోటి పచ్చడి ట్రై చేసి తీరాల్సిందే. దీని రుచి మాటల్లో చెప్పలేం. వేడి అన్నంతో అమృతంలా ఉంటుంది. దోశతో అద్భుతంగా ఉంటుంది.

చేసిన మీరు మర్చిపోలేరు. తిన్నవారు మర్చిపోలేరు..అంత గొప్పగా ఉంటుంది. సూపర్ టేస్టీ బెండకాయ వంకాయ పచ్చడి మీ ఇంట్లో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Bendakaya Vankaya Roti Pachadi Recipe in Telugu How to Make Village Style Okra and Brinjal Chutney

బెండకాయ వంకాయ రోటి పచ్చడి తయారీకి కావాల్సినవి

-వంకాయలు
-బెండకాయలు
-పచ్చిమిర్చి
-టమాటో
-ధనియాలు
-మినపప్పు
-నూనె
-వెల్లుల్లి
-ఉప్పు
-ఉల్లిపాయ
-కొత్తిమీర
-కరివేపాకు
-జీలకర్ర
-ఆవాలు
-పచ్చిశెనగపప్పు
-చింతపండు

నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

బెండకాయ వంకాయ పచ్చడి తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 4-5 చెంచాల నూనె వేసి వేడి చెయ్యాలి.

-వేడెక్కిన నూనెలో 15-20 పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. పచ్చిమిర్చి కొద్దిగా మగ్గిన తర్వాత అందులోనే 18-20 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేగనివ్వాలి.

-పచ్చిమిర్చి పొంగి, బాగా వేగిన తర్వాత అందులో 3 నాటు టమాటోల ముక్కలు, రాళ్ల ఉప్పు వేసి టమాటో ముక్కలను బాగా మెత్తబడనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేసి కొద్దిగా వేడి నీళ్లుకూడా పోసి మొత్తాన్ని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లోనే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడయ్యాక అందులో 200గ్రాముల ముదిరిన బెండకాయల ముక్కలు వేసి పెద్ద మంట మీద బాగా వేయించి ఓ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లోనే మరో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో 100-150 గ్రాముల వంకాయల ముక్కలు వేసి మీడియం మంట మీద మెత్తగా మగ్గనిచ్చాక అందులో పిడికెడు కాడలతో సహా ఉన్న కొత్తిమీరును వేపండి. కొత్తిమీర కూడా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేయండి.

-ఇప్పుడు రోట్లో వేగిన బెండకాయలను, 1 ఉల్లిపాయ మీడియం సైజు ముక్కలు, నిమ్మకాయ సైజు అంత నానబెట్టిన చింతపండు కూడా వేసి కచ్చాపచ్చాగా బాగా నూరండి. తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి పేస్ట్ వేసి మొత్తం కలిసేలా బాగా నూరండి. తర్వాత ఇందులో వేయించిన బెండకాయ కొత్తిమీర కూడా వేసి మొత్తం బాగా నూరుకోవాలి.

-ఒకవేళ మీ ఇంట్లో రోలు లేకుంటే మిక్సీలో అయినా వేసి చేసుకోవచ్చు.

-పచ్చడి రెడీ అయ్యాక దానికి తాలింపు పెట్టుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఎర్రగా వేపాలి. పప్పులు రంగు మారుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిట్లనిచ్చాక కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి వేయించాక స్టవ్ ఆపేయండి.

-ఇప్పుడు నూరుకున్న పచ్చడిని తాలింపులో వేసి కలుపుకోండి. అంతే సూపర్ టేస్టీ బెండకాయ వంకాయ రోటి పచ్చడి రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, August 11, 2026, 20:02 [IST]
Desktop Bottom Promotion