Latest Updates
-
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.!
కేశ సౌందర్యంను కండిషనర్ తో మెరుగుపరచుకోండి..

పాడయ్యే జుట్టుకు చికిత్సగానే కాకుండా మంచి జుట్టును పొందడానికి కూడా డీప్ కండిషనింగ్ అవసరం. దీనివల్ల శిరోజాల్లోని తేమ పరిరక్షించుకోవచ్చు. మాడుకు చక్కని చికిత్స దొరుకుతుంది. కుదుళ్ళు బలంగా తయారవడానికి సహకరిస్తుంది. జుట్టు చివర్లు చీలిపోతే వాటి ఎదుగుదల సరిగా ఉండదు. అంతేకాకుండా జుట్టు బలహీనంగా మారి తెగిపోతుంది. ఇంకా శిరోజాలు నిర్జీవంగా మారి రాలిపోతాయి. ఇలాంటి సమస్యలకు ఇంట్లో దొరికే వస్తువులతో చెక్ పెట్టండిలా....
1. రెండు నెలలకోసారి చిట్లిన శిరోజాల చివర్లను కత్తిరించేయాలి.
2. నెలలో రెండు సార్లు కొబ్బరి పాలతో శిరోజాలను తడిపి గంటయ్యాక షాంపూతో తల స్నానం చేస్తే జుట్టు చిట్లడం అదుపులో ఉంటుంది.
3. ఆముదం, ఆవనూనె సమపాళ్లలో తీసుకొని జుట్టు చివర్లకు రాసి పొడి తువాలును చుట్టి అరగంటయ్యాక స్నానం చేస్తే చిట్లడం తగ్గి కురులు ఒత్తుగా ఏర్పడతాయి.
4. కొబ్బరి, ఆలివ్ నూనె సమపాళ్లలో తీసుకొని గోరువెచ్చగా వచ్చేంత వరకూ వేడి చేసి తలకు, జుట్టుకి బాగా పట్టించాలి. మర్నాడు షాంపుతో తలస్నానం చేస్తే చిట్లిన జుట్టు తొలగి పట్టుకుచ్చులాంటి కురులు మీ సొంతం అవుతుంది.
5. బాగా పండిన బొప్పాయిని మాత్రం తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో తగినంత పెరుగు కలిపి తలకు పట్టించి అరగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టు చిట్లే సమస్య తగ్గుముఖం పట్టడమే కాకుండా జుట్టు రాలిపోయే సమస్య కూడా తగ్గిపోతుంది.
6. పొడిబారిపోయి కాంతిహీనంగా తయారైన జుట్టుతో బాధపడుతున్నట్లయితే, తాజా మెంతికూరను తీసికొని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి చిక్కటిపెరుగు కలిపి తలకు పట్టించండి. అరగంట తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయండి. జుట్టు ఎంతో కోమలంగా తయారౌతుంది.



Click it and Unblock the Notifications
