Latest Updates
-
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
జుట్టు సమస్యలన్నింటికీ ఒకటే మార్గం ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ 'గాడ్ మదర్ ఆఫ్ హెయిర్' గా భావిస్తారు నూనెలలో మంచిది ఆలివ్ ఆయిల్ . ఒకవిధమైన సీమచెట్టు, దాని యొక్క పండున్ను, దానివిత్తులలోనుంచి నూనె తీస్తారు, నేతికి సమానమైనది. ఆలివ్ విత్తనాల నుండి ఆలివ్ నూనె తీస్తారు. ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనె లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి . దీనిలో మోనో అన్క్ష్ సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అత్యధికము . మధ్యధరా ప్రాంత దేశాలలో ఈ వంటనూనె ఎక్కువగా వాడతారు.
రుచిని , పరిమళాన్ని , ఆరోగ్యాన్ని ఇస్తుంది .చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్ నూనెది ప్రత్యేక స్థానం. చర్మ సంరక్షణలోనే కాదు, కేశ సంరక్షణలో కూడా ఆలివ్ నూనెకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. మరియు ఇది జుట్టు సంరక్షణలో అద్భుతాలను స్రుష్టిస్తుంది. ఇది జుట్టుకు అవసరం అయ్యే తేమను, పోషకాలను అధిస్తుంది మరియు లోతైన కండీషనర్ గాను ఉపయోగపడుతుంది. ఇంకా ఇది కేశాలకు బలాన్ని అధిస్తుంది మరియు చుండ్రును నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ తో జుట్టుకు కలిగే మరిన్ని ప్రయోజనాలు క్రింది విధంగా...

డ్రై హెయిర్:
జుట్టు పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నూనె, ఆలివ్‌నూనె, ఆముదాలను సమపాళ్ళలో తీసుకుని బాగా కలపాలి. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు బాగా పట్టించి తరువాత తలస్నానం చేయాలి. జుట్టు పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నూనె, ఆలివ్‌నూనె, ఆముదాలను సమపాళ్ళలో తీసుకుని బాగా కలపాలి. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు బాగా పట్టించి తరువాత తలస్నానం చేయాలి.

వైట్ హెయిర్ నివారణకు:
ఈ ఆయిల్‌లో వెల్లుల్లిపొట్టును కాల్చిన పొడిని కలిపి కానీ లేదా వెల్లుల్లి పొట్టును అలాగే ఆయిల్‌లో కలిపి కాచి కానీ తలకు రాసుకుంటే జుట్టు నల్లబడటమే కాకుండా, త్వరగా జుట్టు నెరవదు.

జుట్టు పెరుగుదలకు:
ఆలివ్‌ఆయిల్‌లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకురాచుకుని, తలస్నానం చేసినట్లయితే వెంట్రుకలు మెత్తగా మారుతాయి. కేశాలు పొడవుగా పెరుగుతాయి.

జుట్టు రాలడాన్ని అరికడుతుంది:
ఆలివ్ ఆయిల్‌ను వెచ్చచేసి, వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి, పది పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేసినట్లయితే, జుట్టు రాలిపోకుండా వుంటుంది.

కుదుళ్లు దృఢంగా:
నాలుగుచుక్కల అల్లంరసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. కుదుళ్లు దృఢమవుతాయి.

హెయిర్ డ్యామేజ్ ను నివారిస్తుంది:
జుట్టు పొడిగా, దెబ్బతిని ఉన్నట్లయితే ఒక టీస్పూన్ ఆముదం, రెండు స్పూన్లు స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను కలిపి మసాజ్ చేసుకుని వేడినీటి టవల్ చుట్టి ఆపై స్నానం చేయాలి.

ఆలివ్ ఆయిల్ హెయిర్ మసాజ్:
ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, కొబ్బరినూనె సమానంగా తీసుకుని బాగా కలిపి తలకు పట్టించి మర్దన చేయాలి. తరువాత వేడి నీళ్ళల్లో ముంచిన టవల్ ను తలకు చుట్టుకుని ఉంచి పదిహేను నిమిషాల తరువాత తలస్నానం చేయాలి.

చుండ్రు నివారణకు :
ఆలివ్ ఆయిల్, తేనె సమపాళ్లలో తీసుకొని మాడుకు, కేశాలకు పట్టించాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చుండ్రు తగ్గుతుంది. పొడి జుట్టుకు ఆలివ్ ఆయిల్, తేనె కండిషనర్‌గా పనిచేస్తాయి.

ఆల్మండ్ ఆయిల్
ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించి ఓ పావుగంట ఆగి కడిగేస్తుంటే జుట్టు ఊడటం చాలావరకు తగ్గుతుంది. నెలకు రెండుసార్లు ఇలాచేస్తే సరిపోతుంది.

జుట్టు ఆరోగ్యానికి:
ఒక కోడిగుడ్డు, కీరదోస కాయ, రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకుని మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును తలకు పట్టించి పదిహేను నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. నెలకొక సారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు ఆరోగ్యంగా, ధృడంగా ఉండటమే కాక ఒత్తుగా కూడా పెరుగుతుంది.



Click it and Unblock the Notifications
