తెల్ల జుట్టు అపోహలు మరియు వాస్తవాలు

By Super

తెల్ల జుట్టు మీద కొన్ని అపోహలతో మీరు గందరగోళం చెందుతున్నార? కొన్ని అపోహల వెనుక దాగిఉన్న వాస్తవాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?తెల్ల జుట్టును నివారించుకోవడం కోసం కొన్ని వాస్తవాలను ఈ క్రింది విధంగా తెలుసుకోండి...

మనకు పుట్టినప్పడు ఉండే నేచురల్ హెయిర్ ఒక గొప్ప ఆభరణం బహుమతి వంటిది. అయితే వయస్సుతో పాటు, శారీరకంగా అనేక మార్పులు, జుట్టు, చర్మం విషయంలోకూడా మార్పులు చేసుకుంటాయి. మనకు నేచురల్ గా వచ్చిన ఈ జుట్టును సంరక్షించుకోవడం మన బాధ్యత. ఎల్లప్పుడు, నల్లని, మంచి షైనింగ్ తో మిళమిళ మెరుస్తుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొందరికి ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్న కెమికల్స్, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఒత్తిడి, పౌష్టికాహార లోపం వల్ల చిన్న వయస్సులోనే జుట్టు గ్రే లేదా తెల్లగా మారుతుంటుంది. దాంతో చిన్న వయస్సులోనే వయస్సైన వారిగా కనబడుతుంటారు. అందువల్ల, జుట్టు విషయంలో ఒక్కొక్క జనరేషన్ కొన్ని కొన్ని అపోహలు వివిధ రాకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అవును, అటువంటి అపోహలకు కొన్ని వాస్తవాలను కూడా మనం తెలుసుకోవల్సిన అవసరం ఉంది. అయితే, అపోహలన్నింటికి కాకపోయినా కొన్నింటికి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని అపోహలు మిమ్మల్ని తప్పదోవ పట్టించి ఉండవచ్చు కాబట్టి, కొన్నిఅపోహలకు కొన్ని వాస్తవాలను మీరు తెలుసుకోవడం కోసం ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది

అపోహ 1: మీరు ఒక తెల్ల వెంట్రుకను లాగితే, హెయిర్ ఫోలిసెల్స్ నుండి ఎక్కువగా తెల్ల వెంట్రుకలు పెరుగుతాయి.

అపోహ 1: మీరు ఒక తెల్ల వెంట్రుకను లాగితే, హెయిర్ ఫోలిసెల్స్ నుండి ఎక్కువగా తెల్ల వెంట్రుకలు పెరుగుతాయి.

వాస్తవం: ఇది ఖచ్చితంగా అవాస్తవం. తెల్లజుట్టును లాగడం ఆపకపోతే, కొన్ని రోజుల తర్వాత నిజంగా గుడ్డు అయిపోవడం ఖాయం. తలలో ఒక్కో వెంట్రుకకు ఒక్కో హెయిర్ ఫోలిసెల్ మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఇతర ఫోలిసెల్స్ జుట్టును తెల్లగా మార్చడం అసాద్యం.

అపోహ 2: కలర్ ట్రీట్మెంట్ తో తెల్లజుట్టును కవర్ చేసుకోవడం ఒక పర్మనెంట్ పరిష్కారమా

అపోహ 2: కలర్ ట్రీట్మెంట్ తో తెల్లజుట్టును కవర్ చేసుకోవడం ఒక పర్మనెంట్ పరిష్కారమా

వాస్తవం: ఇది ఎప్పటికీ నిజం కాదు. మన తలలో ఎన్ని తెల్లవెంట్రుకలున్నాయో తెలుసుకోవడం వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం కుదరదు. తెల్ల జుట్టు ఉన్నప్రాంతంలో కెమికల్స్ తో కూడిన కలర్స్ వేసుకోవడం వల్ల ప్రస్తుతం బాగున్నా, ముందు ముందుకు సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది., అయితే దీనికి శాస్వత పరిష్కారం మాత్రం లేదు.

అపోహ 3: సిగరెట్ త్రాగడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది.

అపోహ 3: సిగరెట్ త్రాగడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది.

వాస్తవం: అవును, ఇది నిజం, స్మోక్ చేయడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. నిపుణులు జె.జీ మోస్లే అభిప్రాయం ప్రకారం, సిగరెట్ త్రాగని వారికంటే, సిగరెట్ త్రాగేవారిలో నాలుగు రెట్లు ఎక్కువగా తెల్ల జుట్టుకు కారణం అవుతుంది. స్మోక్ చేయడం వల్ల జుట్టు తెల్లబడుట మాత్రమే కాదు, జుట్టు రాలడానికి కూడా కారణం అవుతుంది. అందువల్ల, ధూమపానంకు దూరంగా ఉండా తెల్లజుట్టు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

అపోహ 4: తెల్లజుట్టు ప్రక్రియ రివర్స్ అవుతుంది.

అపోహ 4: తెల్లజుట్టు ప్రక్రియ రివర్స్ అవుతుంది.

వాస్తవం:ఒక రకంగా ఇది నిజం కావచ్చు. ఎందుకంటే కొన్ని పద్ధతులు తెల్లజుట్టు రాకుండా నిరోధిస్తాయి. మరియు తెల్లజుట్టు రాకుండా వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి. అయితే ఇది ఇప్పటి వరకూ నిర్ధారణ కాలేదు, అయితే క్యారెట్ జ్యూస్ త్రాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.

అపోహ5: ఏవైనా భయపెట్టే సంఘటనలు లేదా గాయాల వల్ల జుట్టు తెల్లబడటం ప్రారంభం అవుతుంది.

అపోహ5: ఏవైనా భయపెట్టే సంఘటనలు లేదా గాయాల వల్ల జుట్టు తెల్లబడటం ప్రారంభం అవుతుంది.

వాస్తవం: ఇది పూర్తిగా నిజం కాదు. ఈ అపోహకు ఎటువంటి ప్రయోగాత్మక నిర్ధారణలు లేవు. గాయపడం ద్వారా జుట్టు తెల్లబడుతుందనడంలో నిజం లేదు.

అపోహ 6: హెయిర్ జెల్ ను ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతుంది

అపోహ 6: హెయిర్ జెల్ ను ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతుంది

వాస్తవం: ఇది ఒక అద్భుతమైన అపోహ. ఎందుకంటే చాలా మంది వారి జుట్టు స్టైలిష్ గా కనబడుట కోసం హెయిర్ జెల్ ను రెగ్యులర్ గా ఉపయోగించే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి, ఈ విషయంలో అపోహను నమ్మఅవసరం లేదు. మీరు బ్రాండ్ జెల్ ను ఉపయోగించడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు.

అపోహ 7: ఎక్కువగా ఎండతగలడం వల్ల జుట్టు తెల్లబడుతుంది

అపోహ 7: ఎక్కువగా ఎండతగలడం వల్ల జుట్టు తెల్లబడుతుంది

వాస్తవం : ఇది ఒక రకంగా నిజమే అని చెప్పవచ్చు. ఎందుకంటే, సూర్య రశ్మి నేరుగా జుట్టుకు తగలడం వల్ల జుట్టు యొక్క మెరుపు మరియు రంగులో తేడాలు ఏర్పడుతాయి. సూర్యరశ్మి తాకిడి వల్ల జుట్టు రంగు లైట్ గా కనబడుతుంది. కాబట్టి, బయట వెళ్లేటప్పుడు తలకు క్యాప్ పెట్టుకోవాలి. జుట్టును వెనిగర్ తో రెయిజ్ చేయాలి.

అపోహ 8: తెల్లజుట్టు చాలా బాధాకరం మరియు మెయింటైన్ చేయడం కూడా కష్టం

అపోహ 8: తెల్లజుట్టు చాలా బాధాకరం మరియు మెయింటైన్ చేయడం కూడా కష్టం

వాస్తవం: ఇది ప్రతికూల ప్రకటన లేదా స్వచ్చమైన పురాణం. మీ తెల్లజుట్టైనా నల్లజుట్టైనా ఒకే స్ట్రక్చర్ తో నిర్వహించవచ్చు. కాబట్టి తెల్ల జుట్టు మెయింటైన్ చేయడం కష్టం అనడం నిజం కాదు. ఇది మీ సొంత ఆలోచన అయ్యిండవచ్చు. కాబట్టి, దీన్ని నమ్మకండి.

అపోహ9 : హెయిర్ కలర్ మీ తెల్లజుట్టు మరింత డల్ గా మార్చుతుంది.

అపోహ9 : హెయిర్ కలర్ మీ తెల్లజుట్టు మరింత డల్ గా మార్చుతుంది.

వాస్తవం: లేదు, అది ఎప్పటికీ నిజం కాదు. మార్కెట్లో లభించే అనేక హెయిర్ కలర్ కిట్స్ చాలా వరకూ మాయిశ్చరైజింగ్ వే మరియు ఇవి మీ జుట్టుకు మంచి మెరుపును అందిస్తుంది. మరియు మీ జుట్టుకు అవసరం అయ్యే పోషనణు మరియు ఆరోగ్యాన్ని అందిస్తుంది.

Desktop Bottom Promotion