జుట్టు ఫాస్ట్ గా, ఒత్తుగా పెరగడానికి టీట్రీ ఆయిల్ ను ఉపయోగించే పద్ధతులు..!

టీట్రీ ఆయిల్ జుట్టుకు పోషణ అందిస్తుంది. డ్రైగా..జిడ్డుగా మారిన జుట్టుకు జీవం పోస్తుంది. నిర్జీవమైన జుట్టును ప్రకాశవంతంగా మార్చుతుంది!

హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో కొన్ని కఠినమైన కెమికల్స్ ఉండటం వల్ల, హీట్ స్టైలింగ్ టూల్స్ వాడటం వల్ల, చుండ్రు వల్ల జుట్టు రాలడం సహజం. ఇటువంటి హెయిర్ ను ఏ అమ్మాయి కోరుకోదు. అందమైన, పొడవైన జుట్టు ఉండాలన్నదే అమ్మాయిల డ్రీమ్ ! జుట్టును కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసుంటాము. ఎన్నో రకాల నూనెలను ఉపయోగించి ఉంటారు. అయితే టీట్రీ ఆయిల్ జుట్టు సంరక్షణలో గ్రేట్ గా ఉపయోగపడుతుందన్న విషయం మీకు తెలుసా..? జుట్టు సంరక్షణకు టీట్రీ ఆయిల్ ఉపయోగించడం వల్ల మీ కల నిజమౌతుంది.

టీట్రీ ఆయిల్ జుట్టుకు పోషణ అందిస్తుంది. డ్రైగా..జిడ్డుగా మారిన జుట్టుకు జీవం పోస్తుంది. నిర్జీవమైన జుట్టును ప్రకాశవంతంగా మార్చుతుంది!

టీట్రీ ఆయిల్లో టెర్పినిన్ 4 అనే కంటెంట్ ఉంటుంది. ఇది తలలో మురికిని తొలగిస్తుంది. మూసుకుపోయిన రంద్రాలను శుభ్రం చేస్తుంది. చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.

తలలో చర్మరంద్రాలు క్లియర్ అయిన తర్వాత, తలలో హెయిర్ ఫోలిసెల్స్ ఎటువంటి అంతరాయం జరగకుండా పెరగడం సులభం అవుతుంది.

టీట్రీ ఆయిల్లో మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలోనికి డీప్ గా చొచ్చుకుని పోయి, తలకు, జుట్టుకు తగిన తేమను అందిస్తుంది. ఎక్సెసివ్ ఆయిల్ లేకుండా స్కాల్ఫ్ కండీషన్ ను హెల్తీగా మెయింటైన్ చేస్తుంది. ఇది హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.

ఇంకా హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. క్యూటికల్స్ ను సీల్ చేస్తుంది. హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది. దాంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..! కాబట్టి, జుట్టుకు టీట్రీ ఆయిల్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం...

టీ ట్రీ ఆయిల్ , కొబ్బరి నూనె

టీ ట్రీ ఆయిల్ , కొబ్బరి నూనె

అరకప్పు కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. 5 నిముషాలు వేడి చేయాలి. తర్వాత స్టౌ ఆప్ చేసి, ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. దీన్ని తలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. 30 నిముషాల తర్వాత షాంపు, కండీషనర్ ఉపయోగించి తలస్నానం చేయాలి.

షాంపు తో

షాంపు తో

జుట్టు పెరుగదలకు టీట్రీ ఆయిల్ ను ఉపయోగించడం చాలా సులభం. కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ ను రెగ్యులర్ షాంపుకు మిక్స్ చేసి, షేక్ చేసి, తలకు రెగ్యులర్ షాంపు ఉపయోగించినట్లు ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

టీ ట్రీ ఆయిల్ , తేనె

టీ ట్రీ ఆయిల్ , తేనె

10 చుక్కల టీట్రీ ఆయిల్ ను ఒక కప్పులో తీసుకుని, గోరువెచ్చగా వేడి చేయాలి. . అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. షాంపు చేసిన తర్వాత ఈ సొల్యూషన్ ను తలార పోసుకోవాలి. తల మీద పోసుకుని, మసాజ్ చేయాలి. 5 నిముషాల తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే , జుట్టు పెరుగుదల వేగంగా ఉంటుంది.

టీట్రీ ఆయిల్, కోకనట్ మిల్క్, గ్రేప్ సీడ్ ఆయిల్

టీట్రీ ఆయిల్, కోకనట్ మిల్క్, గ్రేప్ సీడ్ ఆయిల్

ఫ్రెష్ కోకనట్ మిల్క్ కు ఒక టీస్పూన్ గ్రేప్ సీడ్ ఆయిల్ మిక్స్ చేసి, అందులో 10 చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. మూడూ బాగా మిక్స్ అయ్యే వరకూ స్పూన్ తో కలిపి, తర్వాత తలకు పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత జుట్టును వదులుగా బన్ వేసుకోవాలి. ఒక గంట తర్వాత షాంపును ఉపయోగించి, తలస్నానం చేయాలి.

టీట్రీ ఆయిల్, జెన్సింగ్, ఆలివ్ ఆయిల్ :

టీట్రీ ఆయిల్, జెన్సింగ్, ఆలివ్ ఆయిల్ :

ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్లో, 5 చుక్కల టీట్రీ ఆయిల్ , 5 చుక్కల జెన్సింగ్ ఎక్స్ ట్రాక్ట్ మిక్స్ చేసి, తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

 టీట్రీ ఆయిల్ , హెన్నా:

టీట్రీ ఆయిల్ , హెన్నా:

ఒక టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్ లో , 5చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. వాటర్ మిక్స్ చేసి, స్మూత్ గా పేస్ట్ చేసుకుని, జుట్టుకు అప్లై చేయాలి. జుట్టు పొడవునా అప్లై చేయొచ్చు. అరగంట తర్వాత షాంపు కండీషనర్ తో తలస్నానం చేసుకోవాలి. ఈ హెర్బల్ టీ ట్రీ ఆయిల్ హెయిర్ మాస్క్ ను నెలకొకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

టీ ట్రీ ఆయిల్, అలోవెర

టీ ట్రీ ఆయిల్, అలోవెర

అలోవెర జెల్ ను తీసుకుని అందులో 5 చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. రెండూ బాగా కలిసే వరకూ మిక్స్ చేసి, తలమీద కొద్దిగా వాటర్ ను చిలకరించి, తర్వాత ఈ హెర్బల్ రెమెడీని అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

టీట్రీ ఆయిల్ , జోజోబ ఆయిల్

టీట్రీ ఆయిల్ , జోజోబ ఆయిల్

ఒక టేబుల్ స్పూన్ జోజోబ ఆయిల్లో 5 చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేసి గోరువెచ్చగా చేసి, తలకు మసాజ్ చేయాలి. ఈ రెమెడీ తలకు పోషణను అందిస్తుంది. కాబట్టి, ఒక గంట తర్వాత గోరువెచ్చని నీరు, షాంపుతో తలస్నానం చేయాలి

టీట్రీ ఆయిల్ , ఎగ్ వైట్ , బాదం ఆయిల్

టీట్రీ ఆయిల్ , ఎగ్ వైట్ , బాదం ఆయిల్

ఎగ్ వైట్ తీసుకుని అందులో 5 చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేసి రెండూ కలిసేలా బీట్ చేయాలి. జుట్టును తడిచేసి, తడి జుట్టు మీద ఈ మిశ్రం అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

పెరుగు, అవొకాడో, టీట్రీ ఆయిల్

పెరుగు, అవొకాడో, టీట్రీ ఆయిల్

ఒక టేబుల్ స్పూన్ అవొకాడో పేస్ట్ కు ఒక టేబుల్ స్పూన్ పెరుగు , 5 చుక్కల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మూడు పదార్థాలను బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత తలను తడి చేసి, ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి, ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. నెలకొకసారి అప్లై చేయడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

Story first published: Thursday, October 13, 2016, 18:30 [IST]
Desktop Bottom Promotion