హాట్ టెంపరేచర్ లో హెయిర్ కేర్ కోసం కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన టిప్స్ ..

వేసవిలో జుట్టుకు సంబంధించిన సమస్యలు చాలానే ఉంటాయి. వేసవిలో చర్మ సంరక్షణకుఎంత జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే కేశాలకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ వేడికి చర్మం తర్వాత ఎక్కువగా సూర్యుని బారిన పడేది వెంట్రుకలే. ఎండ వేడిమి కారణంగా వెంట్రుకలు నిర్జీవంగా తయారౌతాయి. ఎండవేడి, వాతావరణంలోని తేమ జుట్టు మీద ఎంతో ప్రభావం చూపుతాయి. జుట్టులో మట్టి చేరుతుంది. ఫలితంగా వెంట్రుకల్లో చుండ్రు చేరడం, జుట్టు చిట్లిపోవడం వంటివి తలెత్తుతాయి. వెంట్రుకలు ఊడిపోతాయి. అంతేకాదు శిరోజాలు బాగా బిరుసెక్కుతాయి కూడా. సూర్యరశ్మి లోని అల్ట్రా వయొలెట్ కిరణాల కారణంగా కొనలు చిట్లి,పొడిబారినట్లు కనిపిస్తాయి. అందుకే వేసవికాలంలో జుట్టును జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.

వేసవిలో ఎండవేడి ప్రభావం మాడు మీద త్రీవంగా ఉంటుంది. దీంతో డ్రైస్కిన్ తోపాటు సన్‌బర్న్స్‌ కూడా తలెత్తుతాయి. సాధారణంగా జుట్టు మాడును పరిరక్షిస్తుంది. కాని వేసవిలో మాత్రం డ్రైస్కాల్ప్‌ ఎన్నో సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వెంట్రుకలను కుదుళ్ల నుంచీ దెబ్బతీస్తుంది.వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీ కురులు పట్టుకుచ్చు గా ఉంటాయి.

ఓవర్ కండీషనింగ్ లేదా ఓవర్ ట్రీటింగ్ చేయకూడదు:

ఓవర్ కండీషనింగ్ లేదా ఓవర్ ట్రీటింగ్ చేయకూడదు:

వేసవిలో వెంట్రుకలు బిరుసుగా ఉండడంతోపాటు జుట్టు బాగా చెమటపడుతుంది. ఇవి పోవడానికి ఓవర్‌ కండిషనింగ్‌ లేదా ఓవర్‌ ట్రీటింగ్‌ చేయకూడదు.

రెగ్యులర్ తలస్నానం వద్దు:

రెగ్యులర్ తలస్నానం వద్దు:

వేసవిలో రోజూ తలనస్నానం చేస్తే మంచిదనుకుంటారు. కానీ అది కూడా మంచిది కాదు. బాగా చెమట పట్టిన జుట్టును చాలా కాలం వరకూ రుద్దుకోకపోతే కూడా జుట్టు ఊడిపోతుంది.

జుట్టు బ్రౌన్‌ రంగులోకి మారుతుంది

జుట్టు బ్రౌన్‌ రంగులోకి మారుతుంది

వేసవికాలంలో ఎండవేడికి జుట్టు బ్రౌన్‌ రంగులోకి మారుతుంది. బయట ఎండలో ఎక్కువ సేపు ఉంటే జుట్టు రంగు తగ్గుతుంది.

జుట్టు బాగా జిడ్డుగా ఉంటుంది:

జుట్టు బాగా జిడ్డుగా ఉంటుంది:

జుట్టు బాగా జిడ్డుగా ఉంటే వెంట్రుకలకు బాగా చెమట పట్టిందని అర్థం. జుట్టు పట్టులా ఉండడానికి ఈ సీజన్‌లో చాలామంది రకరకాల కాస్మొటిక్స్‌ వాడుతుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. కెమికల్‌ ట్రీట్‌మెంట్స్‌ కూడా చేయించుకుంటుంటారు. ఇది కూడా మంచిది కాదు. అలాగే ఇంట్లోగాని స్పాలో గాని జుట్టుకు ఎక్కువగా కలరింగ్‌ వేసుకోవడం కూడా మంచిది కాదు. ఒకవేళ సమ్మర్‌ సీజన్‌లో మీ జుట్టుకు కలరింగ్‌ వేసుకోవాలనుకుంటే లేదా కలర్‌ మార్చుకోవాలనుకుంటే మాత్రం వేసవి తీవ్రత పెరగడానికి రెండు నెలల ముందే వేసుకుంటే మంచిది.

 మంచి కండీషనర్ ను వాడాలి:

మంచి కండీషనర్ ను వాడాలి:

మంచి కండిషనర్‌ వాడాలి. సూర్యరశ్మి వల్ల జుట్టు పొడారిపోయినట్టయితే ఆ వెంట్రుకలకు తేమ అవసరమవుతుంది. అందుకు రిన్స్‌-అవుట్‌ కండిషనర్‌ వాడాలి. మీ జుట్టు టెక్స్చెర్‌కు అది సూట్‌ అవుతుందో లేదో చూసుకోవాలి.

 స్విమ్మింగ్ కు వెళ్లే వారు క్యాప్ ధరించాలి:

స్విమ్మింగ్ కు వెళ్లే వారు క్యాప్ ధరించాలి:

స్విమ్మింగ్‌కు వెళ్లేవాళ్లు జుట్టుకు లీవ్‌-ఇన్‌-కండిషనర్‌ పెట్టుకుని స్విమ్మింగ్‌ క్యాప్‌ ధరించాలి.వేసవిలో ఈతను ఇష్టపడేవారు.. స్విమ్మింగ్ పూల్స్ కి వెళ్ళడం పరిపాటి. అయితే స్విమ్మింగ్ పూల్స్ లో క్లోరిన్ కలుపుతారు. ఉప్పునీరు కూడా ఉండవచ్చు. ఇలాంటప్పుడు పూల్ లో దిగడానికి ముందుగానే తలను మంచి నీటితో తడుపుకోవాలి.జుట్టు తగినంత నీరు పీల్చుకున్న తరువాత ఉప్పునీరు లేదా క్లోరిన్ నీటిని పీల్చుకోదు.కాబట్టి సమస్య ఉండదు. అయితే స్విమ్మింగ్ పూర్తైన తర్వాత ఇంటికొచ్చి శుబ్రంగా తలస్నానం చేయడం మరువద్దు.

షాంపు వాడకం తగ్గించాలి:

షాంపు వాడకం తగ్గించాలి:

నిత్యం వెంట్రుకలకు షాంపు పెట్టుకోవడం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువ షాంపు వాడడం వల్ల మాడు, వెంట్రుకలు పొడారినట్టవుతాయి. మీ వెంట్రుకలది ఎక్కువ చెమట పట్టే స్వభావం అయితే మైల్డ్‌ షాంపును మాత్రమే వాడాలి.వేసవిలో రసాయనాలు ఎక్కువ ఉన్న షంపూలు,ఇతర ప్రోడక్టుల వాడకాన్నితగ్గించాలి. ముక్యంగా హెయిర్ డై ని వాడకూడదు. హెయిర్ స్ప్రే లు వాడటం తాగించాలి.

సన్ స్క్రీన్ తో ఉన్న కండీషనర్ అప్లై చేయాలి:

సన్ స్క్రీన్ తో ఉన్న కండీషనర్ అప్లై చేయాలి:

జుట్టు వేసవిలో బిరుసెక్కినట్టు అవుతుంది కాబట్టి సన్ స్క్రీన్ తో ఉన్న కండిషనర్‌ వాడాలి.ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు చర్మానికి రాసినట్టుగానే జుట్టుకు లేదా మాడుకు కూడా కొంచెం సన్ స్క్రీన్ లోషన్ రాయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వళ్ళ ఎండకు మాడు చుర్రుమనదు. అయితే... ఇలా సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్నప్పుడు ఇంటికి రాగానే లేదా రాత్రి పడుకోబోయేముందు తలస్నానం చేయాల్సి ఉంటుంది. అల సాధ్యం కానప్పుడు ఆ లోషన్లకు బదులుగా కొబ్బరినూనెతో మర్దనా చేయాలి.

కాటన్ స్కార్ఫ్ కట్టాలి:

కాటన్ స్కార్ఫ్ కట్టాలి:

బయటకు వెళ్లేటప్పుడు తలకు కాటన్‌ స్కార్ఫ్‌ చుట్టుకుంటే తలపై దుమ్ముపడదు. వెంట్రుకలు పాడవవు. వడదెబ్బ కూడా తగలదు.

హెయిర్ స్టైలింగ్ టూల్స్ వాడకం తగ్గించాలి:

హెయిర్ స్టైలింగ్ టూల్స్ వాడకం తగ్గించాలి:

వేసవిలో హెయిర్‌ స్టైలింగ్‌ టూల్స్‌ను వాడడం తగ్గించాలి. సాధారణంగా మనం రోలర్స్‌, బ్లోయర్స్‌, ఐరన్స్‌ని జుట్టుపై వాడుతుంటాం. వీటిని వాడడం వల్ల వేడి మరింత ఎక్కువై జుట్టు రఫ్‌గా, పొడారినట్టు తయారవుతుంది. బ్లీచింగ్‌, హెయిర్‌ కలరింగ్‌ లాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. వేసవిలో ఈ జాగ్రత్తలు మరవొద్దు.

 వేసవిలో నీళ్లు బాగా తాగాలి.

వేసవిలో నీళ్లు బాగా తాగాలి.

నీరు తగినన్ని తాగకపోతే వెంట్రుకలు వన్నె తగ్గి డల్‌గా కనిపిస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం వేసవిలో నీళ్లు ఎంత తాగితే అంత మంచిది. రోజుకు ఏడెనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటివి కూడా బాగా తీసుకోవాలి. ఇవి శరీరానికి ఇన్‌స్టాంట్‌ ఎనర్జీని ఇస్తాయి.

 జ్యూసులు కూడా తాగాలి.

జ్యూసులు కూడా తాగాలి.

ఇవే కాకుండా నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయలు, కీరకాయలు, టొమాటోలు, కూరగాయ జ్యూసులు కూడా తాగాలి. ఫలితంగా శరీరంతోపాటు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి:

జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి:

వేసవిలో శీతలపానీయాలకూ, జంక్‌ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకూ ఇంటి పట్టున వండిన ఆహారానికే ప్రాధాన్యమివ్వాలి. ఆకుకూరలూ, తాజా కూరగాయలకు ప్రాధాన్యమివ్వాలి. ఈ నియమాలు జుట్టూ, చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తాయి.

చుండ్రు సమస్య నివారణకు:

చుండ్రు సమస్య నివారణకు:

వేసవిలో చెమట కారణంగా చుండ్రు సమస్య ఎక్కువవుతోంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొబ్బరి నూనెను కొంచం వేడి చేసి దానిని తలకు పట్టించి మర్ధనా చేసి ఒక టవల్‌ తో గట్టిగా చుట్టాలి. ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు చుండ్రు సమస్య తగ్గుతుంది.

 వేసవిలో తలలో చెమట వల్ల చెడు వాసన రాకుండా రోజ్ వాటర్ వాడాలి:

వేసవిలో తలలో చెమట వల్ల చెడు వాసన రాకుండా రోజ్ వాటర్ వాడాలి:

వేసవిలో మీ వెంట్రుకలు వాసన రాకుండా, ఎల్లపుడు తాజాగా కనపడాలి అనుకుంటున్నారా! అయితే రోజ్ వాటర్ ను వాడండి. కనీసం వారానికి ఒకసారైన మీ జుట్టును రోజ్ వాటర్ ను వాడండి. ఇలా చేయటం వలన అందమైన జుట్టు మాత్రమే కాకుండా, పొడి చర్మం మరియు చుండ్రు వలన కలిగే సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు.

Desktop Bottom Promotion