Latest Updates
-
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి
జుట్టు రాలడం అరికట్టడానికి వెల్లుల్లి ఉపయోగించే పద్దతులు..!
జుట్టు వేగంగా పచ్చబడటం, తెల్లగా మారుతోందా? నిద్రలేచినప్పుడు రాలిపోయిన జుట్టు పిల్లో , బెడ్ షీట్స్ మీద కనబడుతున్నాయా? అయితే మీరు ఖచ్చితంగా జుట్టు గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడాని ఇదే మంచి సమయం.జుట్టు సమస్యలను నివారించుకోవడానికి ఎన్నో ట్రీట్మెంట్స్, హోం రెమెడీస్, ఉపయోగించి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా వెల్లుల్లిని ఉపయోగించారా?
జుట్టు రాలడం నివారించుకోవడానికి వెల్లుల్లిని ఏవిధంగా ఉపయోగించాలో మీకు తెలుసా?వెల్లుల్లిలో అల్లం మరియు కాపర్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి బ్లడ్ సర్క్యులేషన్ ను క్రమబద్దం చేస్తుంది . తలను శుభ్రం చేస్తుంది. చుండ్రును నివారిస్తుంది.
సల్ఫర్ లోపం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. నెయిల్స్ చిట్లడం మరియు డ్రైగా మారడం జరుగుతుంది. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ తినడం లేదా జుట్టును అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం నివారిస్తుంది. గార్లిక్ లో ఉండే విటమిన్ సి జుట్టు రాలడం తగ్గించడం మాత్రమే కాదు, ఇదిజుట్టు డ్యామేజ్ కాకుండా హెయిర్ ఫోలిసెల్స్ ను రిపేర్ ముస్తుంది. హెయిర్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది.
మహిళల్లో మోనోపాజ్ కు ముందు, మోనోపాజ్ తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కుగా ఉంటుంది. సెడెన్ గా శరీరంలో ఐరన్ తగ్గిపోవడం, విటమిన్స్ హార్మోన్స్ లోపం వల్ల ఇలా జరగుతుంది. వెల్లుల్లిలో ఐరన్ ఎక్కువగా ఉంది. దీన్ని డైరెక్ట్ గా తీసుకుంటా . బాడీలో ఐరన్ కంటెంట్ 7 రోజులలోపు మెరుగుపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వెల్లుల్లిలో గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి . అందువల్ల వెల్లుల్లిని రెగ్యులర్ హెయిర్ కేర్ లో ఉపయోగించడానికి ఇక్కడ 6 మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

గార్లిక్ ఆయిల్: రెగ్యులర్ హెయిర్ కేర్ లో గార్లిక్ ను ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.తలలో ఇన్ఫెక్షన్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియా నివారిస్తుంది. జుట్టు తెల్లగా మారకుండా నివారిస్తుంది.
ఎలా ఎపయోగించాలి: కొన్ని వెల్లుల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్ చేసి, జ్యూస్ తీసి, ఒక టేబుల్ స్పూన్ గార్లిక్ జ్యూస్ ను అరకప్పు కొబ్బరి నూనెలో మిక్స్ చేయాలి.గోరువెచ్చగా వేడి చేసి, ఈ నూనెను తలకుఅ ప్లై చేయాలి. ఒక గంట తర్వాత రెగ్యులర్ షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేయాలి.

రా గార్లిక్ సెరమ్:
గార్లిక్ లో ఉండే ఔషధ గుణాలు వల్ల గార్లిక్ ను జుట్టు సంరక్షణగా వివిధ రకాలుగా ఉపయోగించడం జరిగింది, ఉల్లిపాయ జుట్టుకు ఏవిధంగా సహాయపడుతుందో..అదే విధంగా వెల్లుల్లి కూడా సహాయపడుతుంది.
ఎలా ఉపయోగించాలి: ఒక టీస్పూన్ వెల్లుల్లిరసం, ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం మిక్స్ చేయాలి. తర్వాత కాటన్ బాల్ తీసుకుని తలకు మొత్తానికి అప్లై చేయాలి. తర్వాత ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో తలకు స్నానం చేసుకోవాలి. ప్రతి రోజూ సమస్య తగ్గే వరకూ ఈ చిట్కాను ఫాలో అవ్వొచ్చు.

గార్లిక్ కండీషనర్: జుట్టు సంరక్షణలో భాగంగా గార్లిక్ ను రెగ్యులర్ గా ఉపయోగించుకోవచ్చు. వెల్లుల్లిని హెయిర్ కండీషనర్ గా ఉపయోగించుకోవచ్చు.
ఎలా ఉపయోగించాలి?వెల్లుల్లి పాయలను ఎండలో ఎండబెట్టి, మెత్తగా పౌడర్ చేయాలి . ఈ పౌడర్ ను మీరు ఉపయోగించే రెగ్యులర్ కండీషనర్స్ తో మిక్స్ చేసి, జుట్టుకు ఉపయోగించాలి.

గార్లిక్ మాస్క్: గార్లిక్ లో ఉండే సెలీనియం, ఆలివ్ ఆయిల్లోని విటమిన్ ఇ మరియు గుడ్డులోని ప్రోటీన్స్ జుట్టు సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
ఎలా ఉపయోగించాలి:ఒక బౌల్ తీసుకుని , బాగా మిక్స్ చేసి జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత . షాంపుతో తలస్నానం చేయాలి. దీన్ని రెగ్యులర్ కండీషనర్ గా ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

గార్లిక్ : రెగ్యులర్ హెయిర్ కేర్ లో వెల్లుల్లితో పాటు, అలోవెర, తేనె మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల అద్భుత ఫలితం ఉంటుంది.
ఎలా ఉపయోగించాలి: ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రసంలో, ఒక టేబుల్ స్పూన్ తేనె, అలోవెర మిక్స్ చేయాలి. స్మూత్ పేస్ట్ తయారయ్యే వరకూ మిక్స్ చేస్తుండాలి. తర్వాత దీన్ని ప్రతి రోజూ రాత్రి నిద్రపోవడానికి ముందు తలకు అప్లై చేయాలి. 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది తలలో ఇన్ఫ్లమేషన్ మరియు రాషెస్ ను తగ్గిస్తుంది.

గార్లిక్ స్ప్రే: మీ జుట్టు సంరక్షణలో వెల్లుల్లినే నేచురల్ రెమెడీగా దీన్ని ఉపయోగిస్తుంటారు.
ఎలాతయారుచేయాలి: ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక కప్పు డిస్టిల్ వాటర్, 10 చుక్కల ల్యావెండర్ ఆయిల్ ను మిక్స్ చేయాలి. ఈ మొత్తం పదార్థాలను ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని, బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో నిలవ్వ చేసుకోవాలి. జుట్టుకు ఉపయోగించడానికి ముందు దీన్ని బాగా షేక్ చేసి తలకు స్ప్రే చేసుకోవాలి.



Click it and Unblock the Notifications