Latest Updates
-
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.!
తడి జుట్టుని ఆరబెట్టుకునేటప్పుడు చేయకూడని మిస్టేక్స్,..
వారంలో చాలాసార్లు తల స్నానం చేస్తారు, అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి హెల్తీ ఫుడ్ కూడా తీసుకోవాలి, జుట్టుకి ఉపయోగించే ప్రొడక్ట్స్ మంచివై ఉండాలి, ఇవన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. మీ జుట్టు నిర్జీవంగా, డ్యామేజ్ గా ఉంటోంది అంటే.. కారణం ఏంటి ? మీరు చేస్తున్న పొరపాటు ఏంటి ?
ఇది కాస్త అసౌకర్యానికి గురిచేసినా.. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి చాలా జాగ్రత్తలే తీసుకుంటారు. కానీ.. అవి అన్ హెల్తీగా, నిర్జీవంగా కనిపిస్తాయి. అయితే దీనికి మీరు చేస్తున్న పొరపాటే కారణం అయి ఉంటుంది. తలస్నానం చేసేటప్పుడు, జుట్టుని ఆర్పుకునేటప్పుడు, జుట్టుని దువ్వుకునేటప్పుడు.. ఎక్కడో పొరపాటు చేస్తుండటం వల్లే.. జుట్టు డ్యామేజ్ అవుతుంది.
ఇప్పుడు జుట్టుని ఆర్పుకునేటప్పుడు చేస్తున్న పొరపాట్లేంటో చూద్దాం. ఇవి కొన్నేళ్లుగా పాటిస్తున్న పద్ధతులే అయినా.. ఇవి.. ఫలితాన్ని మాత్రం డ్యామేజ్ చేస్తుంటాయి. మీరు జుట్టుని ఎలా డ్రై చేసుకుంటున్నా.. కొన్ని తప్పులు మాత్రం చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వెంటనే ఆరబెట్టుకోవడం
చాలా సందర్భాల్లో మహిళలు జుట్టుని తలస్నానం చేసిన వెంటనే ఆరబెట్టుకుంటారు. ఈ హ్యాబిట్ వల్ల జుట్టు మరింత చిక్కు పడటానికి కారణమవుతుంది. జుట్టుని లాగడం వల్ల.. మరింత ఎక్కువగా ఊడిపోతుంది.

సెరమ్
జుట్టుని న్యాచురల్ గా ఆరబెట్టుకునే ప్రయత్నం చేసినా.. కొన్ని సందర్భాల్లో అది డ్రైగా మారడానికి, చిక్కుపడటానికి కారణమవుతుంది. కాబట్టి.. సెరమ్ ని ఉపయోగించడం వల్ల జుట్టు హెల్తీగా ఉంటుంది.

తడిజుట్టుతో పడుకోవడం
రాత్రిళ్లు తడిజుట్టుతో పడుకోవడం వల్ల జుట్టు డ్యామేజ్ అవడానికి కారణమవుతుంది. తడి జుట్టు పిల్లోపై తరచుగా అటు ఇటు తిరగడం వల్ల డ్యామేజ్ అవుతుంది.

బాగా రుద్దడం
జుట్టు ఆరబెట్టుకునే ప్రయత్నంలో టవల్ తో బాగా రుద్దడం వల్ల.. జుట్టు డ్యామేజ్ అయి.. హెయిర్ ఫాల్ కి కారణమవుతుంది. కాబట్టి.. తడిజుట్టుతో చాలా సున్నితంగా వ్యవహరించాలి.

జుట్టుని శుభ్రపరుకున్న
వెంటనే దువ్వుకుంటారు. దీనివల్ల నీళ్లు మొత్తం బయటకు పోతాయని భావిస్తారు. కానీ.. ఈ పద్ధతి వల్ల జుట్టు కుదుళ్లు డ్యామేజ్ అయి.. జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఎందుకంటే.. అప్పుడు జుట్టు డెలికేట్ గా ఉంటుంది.

హెయిర్ డ్రైయర్స్
తరచుగా హెయిర్ డ్రైయర్ ఉపయోగించి జుట్టుని ఆరబెట్టుకోవడం వల్ల అది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి న్యాచురల్ గా జుట్టుని ఆరబెట్టుకునే ప్రయత్నం చేయాలి.

జుట్టుని విడదీయకపోవడం
జుట్టుని ఆర్పుకునేటప్పుడు విడతీయకపోడం వలల.. అది మరింత చిక్కుపడి, డ్రైగా మారి.. డ్యామేజ్ అవడానికి కారణమవుతుంది. కాబట్టి.. జుట్టుని ఆరబెట్టేటప్పుడు చాలా సున్నితంగా వ్యవహరించాలి.



Click it and Unblock the Notifications
