Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
చుండ్రును నివారించే 7 సీక్రెట్ హోం రెమెడీస్ ..
జుట్టు సంరక్షణలో జుట్టు రాలడం, తెల్ల జుట్టు, జుట్టు పొడిబారటం, కేశాలు చిట్లిపోవడం ఇటువంటివి ఒక సమస్య అయితే, మరో అతి పెద్ద సమస్య చుండ్రు.
సాధారణంగా మనలో చాలా మంది అనేక జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో, కాలుష్యం, వాతవరణంలో వేడి, వల్ల జుట్టు అధికంగా రాలే సమస్య ఒకటైతే, చుండ్రు మరో ప్రధాన సమస్య. చుండ్రు మాత్రమే కాదు, తలలో దురద, తలలో మొటిమలు, చర్మం పొట్టు రాలడం, హెయిర్ డ్యామేజ్, మరియు ఇతర జుట్టు సమస్యలు.
కొందరిని చుండ్రు సమస్య విపరీతంగా బాధపెడుతుంది. కారణం, దీనినుండి ఎదురయ్యే ఇబ్బందే! చుండ్రు శిరోజాల అందాన్ని పాడుచేయడంతో పాటూ, ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. మానసికంగానూ చికాకు పెడుతుంది. చుండ్రు వల్ల జుట్టు పెరగకపోగా, ఇంకా ఎక్కువగా ఊడుతుంది.ఎంత తలస్నానం చేసినా...దురదగా ఉండడం...తలమీద చిన్ని కురుపులు కూడా వచ్చి, ముఖం జిడ్డుగా మారి, మొటిమలతో బాధిస్తుంటుంది.
చుండ్రు సమస్యకు పలురకాల కారణాలున్నాయి. ఫంగల్ ఇన్ ఫెక్షన్, తల్లోని నూనె గ్రంథులు స్రవించడం తగ్గిపోవడం, వాతావరణంలో మార్పులు, నురగ ఎక్కువగా వచ్చే షాంపూలు తరచూ వాడటం, కాలుష్యం..వంటివన్నీ ఈ సమస్యకు కారణాలు.చుండ్రు లక్షణాలు, మరియు ట్రీట్మెంట్ అనేది జుట్టు రకం మీద ఆధారపడి ఉంటుంది. అందుకు మీరు ఎక్సపర్ట్ డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాల్సి ఉంటుంది . అలాగే కొన్ని హోం మేడ్ ట్రీట్మెంట్ కూడా బాగా పనిచేస్తాయి. కామన్ టైప్ డ్యాండ్రఫ్ ను ఇంటి చిట్కాలతోనే నివారించుకోవచ్చు. మరి అదెలాగో చూద్దాం...

గుడ్డు:
గుడ్డు:రెండు గుడ్లను పగులగొట్టి సొనను బాగా గిలకొట్టాలి, ఈ సొనను తలకు బాగా పట్టించి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి గోరువెచ్చిని నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు మరియు హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. తలస్నానం చేసిన తర్వాత కోడిగుడ్డును జుట్టుకు పట్టించండి. ఇది మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. ఇది కూడా చుండ్రును తగ్గిస్తుంది.

వెనిగర్:
వెనిగర్: సెడార్ వేనిగార్ ను నీటితో కలిపి దూదితో మీ తలకు పట్టించండి. ఈ పద్ధతి కూడా మీ జుట్టునుండి చుండ్రును పోగొడుతుంది.వెనిగర్ మరియు నీళ్ళు సమపాళ్ళలో తీసుకొని, బాగా మిక్స్ చేసి రాత్రి నిద్రపోయే ముందు తలకు బాగా పట్టించాలి. తర్వాత రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత మీ తలను తేలికపాటి బేబీ షాంపూను ఉపయోగించి తలస్నానం చేసుకోవాలి.

మెంతి:
మెంతులు మెంతి ఆకు లేదా మెంతులు చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మెంతుల్లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల చుండ్రును పారద్రోలుతుంది.2టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయం వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు మరియు కేశాలకు బాగా పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈవిధంగా నాలుగు వారాల పాటు క్రమం తప్పకుండా పాటించండి.

నిమ్మకాయ:
చుండ్రు అనగానే చాలామంది నిమ్మచెక్కతో బరాబరా జట్టుపై రాసి రుద్దేసి కడిగేస్తుంటారు. అలా కాకుండా తలస్నానం చేసిన తరువాత ఒక టీస్పూన్ తాజా నిమ్మరసాన్ని ఓ మగ్గు మంచినీటిలో కలిపి జుట్టు తడిసేలా కడిగితే సరిపోతుంది. ఇలా నెలకు ఒకసారి చేస్తే చుండ్రు మాయమవుతుంది.పెరుగు: పెరుగును వివిధ రకాల కురలు సమస్యలకు(చుండ్రు, చివరులు చిట్లడం, దురద, పొడిబారడం) ఉపయోగించి ఉంటారు. అంతే కాదు ఈ పెరుగుతో నేచురల్ గా కురులు సున్నితంగా తయారవుతాయి.

పెరుగు:
మీ కేశాలకు పెరుగును బాగా పట్టించి ఒక గంట పాటు అలాగే వదిలేయాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆలివ్ ఆయిల్:
గోరువెచ్చని బాదాం నూనె, కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ ను తలకు బాగా మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేయడం వల్ల చుండ్రును సులభంగా వదలగొడుతుంది.

రోజ్ వాటర్:
బాదం నూనె మరియు రోజ్ వాటర్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. జెల్ లాగా పట్టించాలంటే ఇందులో కొద్దిగా అలోవెర జెల్ మిక్స్ చేసి , రాత్రి నిద్రించడానికి ముందు తలకు పట్టించి మరుసటి రోజు ఉదయం కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications
