Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
జుట్టు సమస్యలను నివారించే గ్రేట్ లీఫ్.. కలబంద..!
అవోవెర అద్భుతమైన ఔషధ మొక్క, ఈ మొక్కలో ఉండే చిక్కటి జెల్లో అనేక ఔషధగుణాలతో పాటు కాస్మోటిక్ గుణాలు కూడా ఉన్నాయి. చర్మ సంరక్షణలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలుసా..? అలోవెర జెల్ ను జుట్టుకు వివిధ మార్గాల్లో ఉపయోగిస్తుంటారు.
మనలో చాలా మందికి డ్రై అండ్ డల్ హెయిర్ ఉంటుంది. ఇలా జుట్టు డ్రైగా మరియు డల్ గా ఉండటం వల్ల జుట్టులో షైనింగ్ తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యలన్నవారు టీవీ యాడ్స్, పేపర్ ప్రకటనల్లో చూపించే కొత్త ప్రొడక్ట్స్ ను జుట్టుకు ఉపయోగిస్తుంటారు. అయితే వీటి వల్ల తాత్కాలిక ప్రయోజనం మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఎలాంటి ఫ్యాన్సీ టెక్నాలజీ ఉపయోగించకుండా నేచురల్ గా జుట్టును అందంగా.. ఆరోగ్యంగా మార్చుకోవచ్చు
బిజీ షెడ్యుల్స్ లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జుట్టు డ్రైగా మరియు డల్ గా మారుతుంది. ఇంకా జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోపోవడం హెల్తీ డైట్ ను పాటించకపోవడం వల్ల జుట్టు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఈ సమస్యలన్నింటిని నివారించుకోవాలంటే నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి . అటువంటి నేచురల్ రెమెడీస్ లో అలోవెర ఒకటి. అలోవెరా, ఒక చిక్కగా జెల్ గా ఉండే ఒక పదార్థం. అలోవెరా (కలబంద)ను కాలినగాయాలకు, తెగిన గాయాలకు మరియు చర్మ ఇన్ఫెక్షన్లకు అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. అలోవెరా జెల్ ల్లో అనేక న్యూట్రీషియన్స్, మరియు విటమిన్స్, మినిరల్స్ ఇవి శరీరానికి ఎంత అవసరం అయిన వాటితో నిండి ఉంది.
అలోవెరా జ్యూస్ ను ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తూ, దీన్ని రోజుకు ఒక సారైనా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అలోవెరాలో ఉండే అనేక యాంటీఆక్సిడెంట్స్ మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది . ఇంకా ఈ జ్యూస్ లో మంచి అమినో యాసిడ్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండి శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలోవెరా జ్యూస్ లో ఉన్న అనేక విటమిన్స్ మన శరీరంలోని డ్యామేజ్ అయిన బాడీ సెల్స్ లేదా టిష్యూలను రిపేర్ చేయడానికి సహాయపడుతుంది.
ఈజ్యూస్ లో వివిధ పోషకాలు, విటమిన్లు, మినరల్స్, ఎమినో యాసిడ్స్ వంటి పోషకాలెన్నో వుంటాయి. ఇది జెల్ , ఆయింట్మెంట్ , లోషన్ ల రూపం లో అటు సౌందర్య సాధనం గా ఇటు ఔషధం గా దీని వాడుక విపరీతం గా పెరిగింది. అలోవెర జుట్టుకు ఏవిధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం...

కండీషనర్ గా :
అలోవెర జెల్ ను జుట్టుకు రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల గ్రేట్ కండీషనర్ గా పనిచేస్తుంది. . ఇది జుట్టుకు మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది మరియు జుట్టుకు తగినంత తేమను అందిస్తుంది. . డ్రై హెయిర్ నివారించడానికి సహాయపడుతుంది. !

చుండ్రు నివారణకు ట్రీట్మెంట్
కొన్ని సందర్భాల్లో, డ్రై స్కాల్ప్ వల్ల జుట్టు చుండ్రు ఎక్కువ అవుతుంది. అలోవెరను జుట్టుకు అప్లై చేయడం వల్ల, తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. చుండ్రు నివారిస్తుంది. అలోవెర జెల్ ను అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయస్తే పూర్తిగా నివారించబడుతుంది.

సెరమ్ లాగా ఉపయోగించుకోవాలి:
జుట్టు గ్లాసీగా కనిపించాలంటే సెరమ్ ఉపయోగిస్తుంటారు. కెమికల్స్ తో తయారుచేసి సెరమ్ కు బదులుగా అలోవెర జెల్ ను ఉపయోగించడం వల్ల జుట్టు నేచురల్ గానే గ్లాసీ లుక్ ను అందిస్తుంది.

తలలో దురద:
తలో దురద నివారించడంలో అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది. జెల్ తలకు అప్లై చేసిన తర్వాత తలలోకి పూర్తిగా అబ్షార్బ్ అవ్వడం వల్ల దురద నివారించడంతో పాటు, గ్రేట్ గా పనిచేస్తుంది!

ఆయిల్ హెయిర్ :
తలలో సెబమ్ ప్రొడక్షన్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో తలలో ఆయిల్ ఎక్కువ ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది. అలోవెర జెల్ ను అప్లై చేయడానికి ముందు, తలస్నానం చేయాలి. లేదంటే జిడ్డు మరింత ఎక్కువ అవుతుంది.

కండీషనర్ :
బ్రాండెండ్ లీవ్స్ కండీషనర్స్ చాలా ఖరీదైనవి. అయితే అలోవెర జెల్ మనకు అందుబాటులో ఉండే ఔషధ మొక్క. ఇది అద్భుత ఫలితాను అందిస్తుంది. ఇది కర్లీ అండ్ ఫిజ్జీ హెయిర్ నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది.

జుట్టు పెరుగుదలకు:
అలోవెర జెల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వారంలో ఒకటి రెండు సార్లు ఈ జెల్ ను తలకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications











