Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
బ్రింగరాజ్ ఆయిల్ తో అద్భుతమైన హెయిర్ కేర్ బెనిఫిట్స్
బ్రింగరాజ్ ఆయిల్ తో అద్భుతమైన హెయిర్ కేర్ బెనిఫిట్స్
బ్రింగరాజ్ లేదా ఎక్లిప్టా ప్రొస్ట్రాట, ఇది సన్ ఫ్లవర్ కుటుంబానికి చెందినిది. బ్రింగరాజ్ ను వివిధ రకాల జుట్టు సమస్యల నివారణకు ఉపయోగిస్తుంటారు. ఈ మొక్కను ఇండియా, చైన, బ్రెజిల్ మరియు థాయ్ లాండ్ లో కనుగొనడం జరిగింది. ఈ మొక్కలో అనేక రకాల హెయిర్ కేర్ బెనిఫిట్స్ దాగున్నాయి.
బేసిక్ గా ఇది ఆయుర్వేదిక్ హెర్బ్ . అందుకే దీన్నివివిధరకాల మెడిసిన్స్ లో ఉపయోగిస్తుంటారు. జుట్టు సంరక్షణకు బ్రింగరాజ్ ఆయిల్ ఏవిధగా సహాయపడుతుంది, ఎలా ఉపయోగించాలన్నది ఈ క్రింది విధంగా అందివ్వడం జరిగింది. బ్రింగరాజ్ ఆయిల్లో కూడా ఉండే వివిధ రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఒక్కో దానికి ఒక్కోరకమైన ప్రయోజనాలు ఉన్నాయి..
వీటిలో మీ జుట్టుకు సరిపోయే దాన్ని కొనడం, లేదా ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. అయితే ఇంట్లో తయారుచేసుకోవడానికి బ్రింగరాజ్ పౌడర్ లేదా బ్రింగరాజ్ ఆకులు అవసరమౌతాయి.వీటిలో బ్రాండెండ్ బ్రింగరాజ్ లో ఇతర మూలికను చేర్చుంటారు.
బ్రింగరాజ్ జుట్టుకు ప్రయోజనాలను అందివ్వడంతో పాటు, చర్మాన్ని కూడా స్మూత్ గా మార్చుతుంది. ఇది ఎక్జిమాతో బాధపడే వారిలో ఈ సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది. అదనంగా , మనస్సు ప్రశాంతగా ఉంచుతుంది. ఇలాంటి మల్టీపర్పస్ బెనిఫిట్స్ అందించే ఆయిల్ ను ఎవరు కోరుకోరు చెప్పండి?
ఇటువంటి బ్రింగ్ రాజ్ ఆయిల్లో దాగున్న జుట్టు రహస్యాలు తెలుసుకుంటే మీ రెగ్యులర్ బ్యూటీలో ఈ ఆయిల్ ను ఖచ్చితంగా మిస్ చేయకుండా తీసుకుంటారు. అయితే ఆలస్యం చేయకుండా ఇందులో బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం...

జుట్టు పెరుగుదలకు:
బ్రింగరాజ్ నూనెను జుట్టుకు అప్లై చేసిమసాజ్ చేయడంవల్ల జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది. తలకు అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది.

తలలో దురద తగ్గిస్తుంది:
ఇది తలకు చల్లదనాన్ని అందిస్తుంది, తలలో దురదను చాలా త్వరగా తగ్గిస్తుంది, అందుకే ఈ నూనె అన్ని రకాల జుట్టు సమస్యలకు సూట్ అవుతుందని సూచించడం జరిగింది.

చుండ్రు:
తలలో ఎక్కువగా నూనె స్రవించినప్పుడు లేదా తల మరీ ఎక్కువగా డ్రైగా ఉన్నప్పుడు, చుండ్రు ఏర్పడుతుంది. బ్రింగరాజ్ ఆయిల్ చుండ్రు సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది జుట్టుకు అవసరమయ్యే పోషణను అందిస్తుంది.

హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది:
జుట్టు పల్చగా మారోతున్నదని బాధపడుతున్నారా?అయితే ఈ బ్రింగరాజ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల హెయిర్ వాల్యూమ్ పెరుగుతుంది.

.డ్రైహెయిర్ :
షాంపు చేయడానికి ముందు ఈ నూనెను తలకు అప్లైచేయడం వల్ల డ్రైగా ఉన్నజుట్టుకు అద్భుతమైన షైనింగ్ ను అందిస్తుంది. తలస్నానం చేయడానికి అరగంట ముందు తలకు అప్లై చేసి, తర్వాత తలస్నానం చేయాలి. అప్పుడే జుట్టుకు ఫర్ఫెక్ట్ బెనిఫిట్స్ ను పొందుతారు.

చిట్లిన జుట్టు:
జుట్టు చివర్లుకు మాత్రమే కాదు, ఇది జుట్టు మొదల నుండి మాయిశ్చరైజర్ ను పోషణను అందిస్తుంది. ఓరిజినల్ హెయిర్ కలర్ అలాగే ఉంటుంది.

తెల్ల జుట్టు:
తెల్ల జుట్టు నివారించడానికి బ్రింగరాజ్ ఆయిల్ ను రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది, ఇది ఓరిజినల్ హెయిర్ కలర్ ను అందిస్తుంది.

స్ట్రాంగ్ హెయిర్:
జుట్టు తెగిపోవడం అనేది చాల మంది ఎదుర్కుంటున్న సమస్య, వీరు బ్రింగరాజ్ ఆయిల్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే హెయిర్ బ్రేకేజ్, హెయిర్ వీక్ నెస్ ఉండదు.

హెయిర్ ఫాల్:
బ్రింగరాజ్ ఆయిల్ ను రెగ్యులర్ గా తలకు అప్లై చేస్తుంటే, తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఇది జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. హెయిర్ ఫాలిసెల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి.



Click it and Unblock the Notifications